DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింగపూర్ తో పాతికేళ్ల బంధం మరింత బల పడింది : అడ్మిరల్ సునీల్ లంబ 

విశాఖపట్నం, నవంబర్ 19, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : ప్రపంచంలోనే అత్యంత పదునైన, బలమైన యుద్ధ సైనిక పధకాలు కల్గిన సింగపూర్ తో మైత్రీ సంబంధాలు పాతికేళ్ల బంధం ద్వారా మరింత

బలపడ్డాయని భారతీయ నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ తెలిపారు. సింబక్స్ 2018  ( 1994 - 2018 ) పేరిట భారత్ సింగపూర్ 25 ఏళ్ళ మైత్రీ బంధాన్ని పురస్కరించుకుని సోమవారం ఐ ఎన్ ఎస్

సహ్యాద్రి నౌక పై సింగపూర్ నేవీ చీఫ్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత పాతికేళ్ల బంధంలో ఎటువంటి విభేదాలు లేకుండా సత్సంబంధాలు

పరిపూర్ణంగా నెలకొల్పగలిగామన్నారు. రెండు దేశాల మధ్య ఇంతకాలం మైత్రీ బంధం కొనసాగడం ఒక రికార్డుగా ప్రకటించారు. సింబాక్స్ 2018 ని పురస్కరించుకుని ఆదివారం విశాఖ

సాగర తీరం లో నిర్వహించిన భారత నావి మారథాన్ లో సింగపూర్ నావికాదళ సిబ్బంది కూడా పాల్గొనడం అభినందనీయమన్నారు. మంగళవారం విశాఖపట్నం లోని తూర్పు నావికాదళ ప్రధాన

కార్యాలయం లో భారత దేశ రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, సింగపూర్ రక్షణ మంత్రి తో తదుపరి మైత్రీ బంధం కొనసాగింపులో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నట్టు

సునీల్ లంబ ప్రకటించారు. 

సింగపూర్ నావికా దళపతి  à°²à±à°¯à±‚ చ్యువేన్ హ్యాంగ్ మాట్లాడుతూ à°—à°¤ పాతికేళ్ల కాలంలో భారత్ దేశం తో మైత్రి తో ఇరు దేశాలు ఉత్తమ ఫలితాలు

సాధించుకోగలిగామన్నారు. 1994 లో నాటి ప్రధాన మంత్రి పి వి నర్సింహా రావు తీసుకున్న పటిష్టమైన నిర్ణయం కారణంగా రెండు దేశాల మధ్య మైత్రి కుదిరిందన్నారు. తదుపరి ఇరు

దేశాల రక్షణ శాఖల మంత్రులు మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం సైనిక శిక్షణతో పాటుగా పరస్పర సహకారం అందించుకోగలుగుతున్నామన్నారు. తాను సింగపూర్

నావికాదళపతిగా భాద్యతలు చేపట్టిన కాలం నుంచి మూడు పర్యాయాలు భారత్ లో పర్యటించానని, భారత నావికాదళ అధికారులు, వైమానిక అధికారులతో ఎన్నో చర్చల్లో

పాల్గొన్నామన్నారు. గత పాతికేళ్ల కాలం మైత్రి మంచి ఫలితాలు పొందడానికి సహకరించిన ప్రతీ ఒక్కరి కి అభినందనలు తెలిపారు. ఈ సంయుక్త మీడియా సమావేశం లో ఇరు వర్గాల

నావికాదళ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.  

 

 

#dns   #dnslive  #dns live  #dns media  #dns news  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #navy  #indian navy  #navy marathon; #simbex 2018

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam