DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల గుడిలో సెక్యూరిటీ ఫెయిల్ : మొబైల్ తో గుళ్ళోకి వెళ్లిన భక్తుడు

తిరుమల గుడిలో సెక్యూరిటీ ఫెయిల్ : మొబైల్ తో గుళ్ళోకి వెళ్లిన భక్తుడు 

కొట్టవచ్చిన సెక్యూరిటీ వైఫల్యం, విద్యార్థికి పట్టివేత 

( రిపోర్ట్ : డి ఎస్

ఎన్ మూర్తి, తిరుమల  )

తిరుమల, జనవరి 16, 2019 (DNS Online): కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రక్షణ యంత్రాలు, రక్షణ సిబ్బందికి వేతనాలు ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో రక్షణ

విభాగం వైఫల్యం వెలుగుచూసింది. బుధవారం రాత్రి 9 :50 గంటల సమయంలో గర్భ గుడిలో స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్ధం ఇచ్చే గట్టువద్ద ఫోటో తీస్తుండగా ఒక యువకుని

వద్ద ఆధునిక సెల్ ఫోన్ బయటపడింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడే ఉన్న ఒక స్కౌట్ విద్యార్థిని పట్టుకుని తనకు ఇచ్చిన సేవకు న్యాయం చేకూర్చింది. ఆరు సెక్యూరిటీ

గేట్లు దాటినా తదుపరి ప్రతి భక్తుణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత క్యూలైన్లను వదలడం జరుగుతుంది. ప్రతి మలుపు వద్దా, కొందరు రక్షణ సిబ్బంది తనిఖీ కేంద్రాల

వద్ద ఉండడం జరుగుతుంది. వీరికి సహాయకులుగా శ్రీవారి సేవకులు, స్కౌట్లు, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వీరందరినీ తప్పించుకుని

భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్, ఇతర నిషేధ సామాగ్రిని తమ వెంట తీసుకు వెళ్ళగలరు. బుధవారం జరిగిన ఘటన ఇలాంటిదే. రాత్రి 9 :50 గంటల సమయంలో దర్శనం చేసుకున్న ఒక యువకుడు

తీర్ధం తీసుకున్న అనంతరం గర్భాలయ గోపురాన్ని ఫోటో తియ్యడానికి ప్రయత్నించిన సమయం లో అక్కడే ఉన్న ఒక స్కౌట్ బాలిక అతని నుంచి ఫోన్ లాక్కోవడం సమీపంలోని సీసీ

కెమెరాలో కూడా రికార్డు అయినట్టు తెలుస్తోంది. అదే సమయానికి స్వామి దర్శనమ్ కోసం వెళ్లిన విశాఖ పాత్రికేయుడు మూర్తి ఈ అంశాన్ని తిరుమల దేవస్థాన సెక్యూరిటీ

సిబ్బంది ని ప్రశ్నించగా, ఇది తమ అంతర్గత విషయమని, సమాధానం చెప్పకుండా తప్పించుకు వెళ్లిపోవడం గమనార్హం. 

ఇదీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పూర్తి నిర్లక్ష్య  à°µà±ˆà°–à°°à°¿

 :

ప్రపంచంలోనే ప్రసిద్ధి కెక్కిన హిందూ దేవాలయంగా ప్రసిద్ధి కెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటీవల కాలంలో సెక్యూరిటీ పూర్తిగా వైఫల్యం చెందిన

ఘటనలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. కేవలం సామాన్య భక్తుల పైనే తమ అధికారాన్ని ఝుళిపిస్తున్న టిటిడి సిబ్బంది, విఐపిల పట్ల మాత్రం పాదాక్రాంతమైపోతున్నారు.

దీనికి నిదర్శనమే à°ˆ వారంలోనే స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్  à°…న్యమతస్తుడు కావడం తో కనీసం అతని నుంచి ధ్రువీకరణ పత్రాన్ని కూడా

తీసుకోలేదు.. దీనికి అదనంగా అతని వెంట డజన్ల కొద్దీ బౌన్సర్లు కూడా యధాశక్తి గర్భాలయంలోకి వెళ్లడంతో, వారి ని కూడా పూర్తిస్థాయి తనిఖీ లేకుండానే వదలడం

గమనార్హం. రెండు రోజులు గడవక ముందే ఒక సాధారణ యువకుడు తన వెంట యధేచ్చగా మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, ఆనవాయితీగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి తనిఖీ

యంత్రాలు నెలకొల్పడం తో పాటు, నెలవారీగా లక్షలాది రూపాయల జీతం కూడా వెచ్చిస్తున్న టిటిడి పట్ల వీరు పూర్తిగా కృతఘ్నత చూపిస్తున్నట్టే తెలుస్తోంది. ఈ రోజు ఈ

చిన్నారి చూడడం వలన à°ˆ విషయం తెలిసింది. ఇలా చూడకుండా ఇంకీన్ని వస్తువులు యధేచ్చగా తీసుకు వెళ్తున్నారో. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ttd  #tirumala tirupati  #temple  #cell phone

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam