DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అహో . . . అవధానులనే అబ్బుర పరిచిన అమెరికా ఆదిత్యుని అవధాన ప్రతిభ  

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/312942869343727/

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/310967469553495/

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/2278155295786788/

 

 

pix courtesy: Darshanam  Monthly

Magazine

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #hyderabad  #ravindra bharati  #avadhanam  #Gannavaram adithya

">

ఆదిత్యుని ప్రతిభ ముందు రవీంద్ర భారతి చిన్నబోయింది. 

ఆంధ్ర భాషలో అమెరికా యువ అవధాని అద్భుత ప్రదర్శన 

లలితంగానే అక్షరాలు అద్భుతంగా

సంధించాడు. 

అవధాని వయసు 16 , పృచ్ఛకులు వయసు 60 à°•à°¿ పైనే.    

హైద్రాబాద్, జనవరి 16, 2019 (DNS Online): అవధానులనే అబ్బుర పరిచిన అమెరికా ఆదిత్యుని అవధాన ప్రతిభతో ఆదివారం

హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కళా ప్రాంగణం ఆనందపరవశంలో మునిగిపోయింది.  à°®à°•à°° సంక్రాంతికి  à°¹à±ˆà°¦à±à°°à°¾à°¬à°¾à°¦à± లోని తెలుగువారికి అక్షర పరమాన్నం వడ్డించారు.

యువ

అద్భుత అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య ప్రతిభ ను ముందుగానే ఊహించే పిట్ట కొంచెం కూడా ఘనం అనే ఈ నానుడి వచ్చిందేమో అనిపిస్తోంది. సంక్రాతి పర్వదినోత్సవం

సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక మాస పత్రిక దర్శనం హైద్రాబాద్ లోని రవీంద్ర భారతి కళా వేదిక పై ఏర్పాటు చేసిన ఆదిత్యుని ద్విభాషా అవధానం ఆద్యంతం ఆసక్తికరంగా

సాగింది. అమెరికా కు చెందిన ప్రవాసీయులైన 16 ఏళ్ళ అపర మేధావి,  à°—న్నవరం లలిత్ ఆదిత్య తన అపార మేధావితనంతో ఆహుతులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచి తేల్చాడు. అమెరికా లో

పుట్టి, అక్కడే విద్యాభ్యాసం చేస్తూ, మాతృభాషపై మమకారం, సంస్కృత భాష పై అనురాగం తో రెండు భాషల్లోనూ అద్వితీయమైన ప్రావీణ్యాన్ని సాధించి, ఆయా భాషల్లో ఆచార్యులను

సైతం ఆకట్టుకోగలుగుతున్నాడు. ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం à°¨ భూతొ à°¨ భవిష్యత్ అన్న రీతిలో సాగింది. 

ఉత్తరాయణ

సంక్రమణ పర్వదినోత్సవం ఆరంభమైన సమయంలో ఆకాశంలో ఉండే ఆదిత్యుడు దివి నుంచి భువికి దిగి వచ్చి అవధానం ఆచరించారా అన్నట్టుగా అనిపించింది. అకుంఠిత దీక్షతో చేసిన

ధారణా శక్తితో దద్దరిల్లింది :

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి

రమణాచార్యులు మాట్లాడుతూ ఆధునిక సంస్కృతి పై మోజుతో ఇక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు క్యూలు కడుతున్న ప్రస్తుత యువతకు ఆదర్శనంగా నిలుస్తున్న గన్నవరం లలిత్

ఆదిత్య సర్వదా అభినందనీయుడన్నారు. అమెరికా లో పుట్టి మాతృదేశం, మాతృ భాషపై ఎంత ప్రేమ లేక పొతే అద్వితీయమైన అవధానం అత్యంత ఆనందకరంగా చేయగలడో అన్నారు. ఈ అవధానంలో

పృచ్ఛకులు గా వ్యవహించిన వారు ఒక్కొక్కరు తెలుగు, సంస్కృత భాషల్లో అద్వితీయమైన అనుభవం, ప్రావీణ్యం కలిగినవారు, పైగా ఆయా భాషల్లో ఎంతో పరిశోధనలు చేస్తున్నవారు.

వారందరూ సంధించే ప్రశ్నల బాణాలను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. 

శతవధానులనే అబ్బుర పరిచారు : 

తెలుగు, సంస్కృత భాషల్లో అష్టావధానం, శతావధానం, సహస్రావధానం

చేసిన మహనీయుల్లో సంస్కృత శతావధాని దోర్బల ప్రభాకర శర్మ లాంటి వారు సభాధ్యక్షులుగాను,  à°ªà±ƒà°šà±à°›à°•à±à°²à±à°—à°¾ ఉన్న సభలో తెలుగులో à°’à°• మాట మాట్లాడడమే అత్యంత క్లిష్టమైన

క్రియ, అలాంటిది వారు సంధించే సంస్కృత ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడమంటే పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.  

తప్పటడుగులు కాదు చప్పట్లే . . . 

అవధానం చేసే

వారు బాలకుడు కదా తప్పటడుగు వేస్తాడేమో అనే సంశయం చాలా మందికి కలిగినప్పడికీ, స్పృరద్రూపిగా ఉన్నాడు కదా చూద్దామనుకుని సభలోకి వచ్చిన వారందరి చేతా సభా

ప్రాంగణమంతా మారుమ్రోగేలాగా  à°¤à°¨ అక్షర కుసుమాల ప్రదర్శనతో  à°šà°ªà±à°ªà°Ÿà±à°²à± కొట్టించాడు. తన పేరుకి తగినట్టు లలితంగానే అక్షరాలు అద్భుతంగా సంధించాడు లలితాదిత్య అని

ప్రతి ఒక్కరూ కొనియాడారు. అందరికంటే అత్యంత అమితానందం పొందినవారు పృచ్ఛకులే అని చెప్పడం అతిశయోక్తి కాదు. పృచ్ఛకులుగా ఆసీనులైనవారు తాము సంధించిన

ప్రశ్నావళికి అత్యద్భుత సమాధానాలు ఇచ్చిన ఆదిత్యునిపై ఆశు కవితల రూపంలో ఆశీర్వచనం చేయడం కోసం మెరుపు. 

ఈ అబ్బుర సన్నివేశ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన

వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి, రచయితా, సీనియర్  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à±  à°µà°¨à°‚ జ్వాలా నర్శింహారావు, సినీ రచయితా, కవి, ఆధ్యాత్మిక ప్రవచన కర్త

తనికెళ్ళ భరణి, డాక్టర్ జి.ఎం రామశర్మ, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, నరేంద్ర శాస్త్రి, డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ, దర్శనం పత్రిక సంపాదకులు ఎం. వెంకట రమణ

శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

 

Avadhanam videos:

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/312942869343727/

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/310967469553495/

https://www.facebook.com/DEVOTIONALMAGAZINE/videos/2278155295786788/

 

 

pix courtesy: Darshanam  Monthly

Magazine

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #hyderabad  #ravindra bharati  #avadhanam  #Gannavaram adithya

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam