DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఏఎస్ ల తారుమారు తక్కడమార్ బదిలీలు 

కలెక్టర్ల బదిలీ :  à°µà°¿à°¶à°¾à°– కు భాస్కర్, పగో జిల్లాకు ప్రవీణ్ కుమార్ 

విశాఖపట్నం, జనవరి 17, 2019 (DNS Online): గురువారం జరిగిన ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీల్లో రాష్ట్ర

ప్రభుత్వం తారుమారు తక్కడ మార్ ఆట ఆడింది. విశాఖ జిల్లా లోనే ఏళ్ళ తరబడి విధులు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ ను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ

జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చెయ్యగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా విధుల్లో ఉన్న కాటమనేని భాస్కర్

ను విశాఖ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. జాయింట్ కలెక్టర్ గా విశాఖ జిల్లా లో అడుగు పెట్టిన ప్రవీణ్ కుమార్, రెండేళ్ల కాలం తదుపరి, మహా విశాఖపట్నం మునిసిపల్

కార్పొరేషన్ ( జీవీఎంసీ) కమిషనర్ విధులు నిర్వహించారు, అనంతరం, విశాఖ జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరారు. సుమారు ఆరేళ్ళ కాలం పాటు విశాఖ లోనే విధుల్లో ఉండడంతో

విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ మంచి పేరు సంపాదించారు. 2006 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ విశాఖ జిల్లాలో విధుల్లో ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన,

అనంతరం హుదూద్ తుఫాను సమయాల్లో అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. అదే క్రమం లో  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ 2004 బ్యాచ్ కు చెందిన కాటమనేని

భాస్కర్ ను విశాఖ జిల్లా కలెక్టర్ à°—à°¾ బదిలీ చేశారు. 
1991 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి   శ్రీరామ్ ప్రకాశం సిసోడియా ను సాంఘిక సంక్షేమ శాఖ ( ఇప్పడి వరకు ట్రైబల్ వెల్ఫేర్ à°—à°¾ à°ˆ

శాఖ ను పేరు మార్పు చేశారు) ముఖ్య కార్యదర్శిగా నియమించారు. 1992 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి  à°·à°‚షేర్ సింగ్ రావత్ స్తానం లో నియమించారు. 1998 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి నాగులాపల్లి

శ్రీకాంత్ ను సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిగాను, ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషర్ గా విధుల్లో ఉన్న 1993 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారిణి కె. దమయంతి ని రాష్ట్ర పశు

సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. à°ˆ మేరకు ఆదేశాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #collector  #IAS  #west godavari
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam