DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు దేశం ముందస్తు మేనిఫెస్టో మంత్రిమండలి లో విడుదల ?

ఆచరణకు అసాధ్యమైన హామీలూ అధికమే. 

కేంద్రం ఇచ్చిన అగ్రవర్గ రిజర్వేషన్లనూ తప్పుదారి లోకే పట్టించింది.

అమరావతి,  à°œà°¨à°µà°°à°¿ 21 ,2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లో

అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికల మేనిఫెస్టోను మంత్రిమండలి లో విడుదల చేసినట్టుగానే ఉంది. అతి త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న

తరుణంలో అధికారాలన్నీ పూర్తిగా వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వదలడం లేదు. ఒక ప్రక్క ప్రతిపక్ష

పార్టీ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో పాటు, జనసేన పార్టీ సైతం ఒక అడుగు ముందుకు వెయ్యడం తో తెలుగుదేశం శ్రేణుల్లో ఒణుకు పుట్టడంతో అధికారాన్ని సైతం పూర్తిగా

వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్రము ప్రకటించిన అగ్రవర్గ పేదలకు 10 శతం రిజర్వేషన్ లో 5 శతం కాపు సామజిక వర్గానికి ఇచ్చేస్తున్నట్టు మంత్రి వర్గ

సమావేశం లో చంద్రబాబు ప్రకటించేశారు. అయితే దీన్ని అమలు చెయ్యడం సాధ్యం కాదని తెలిసికూడా ప్రకటన చేశారంటే ఇది కచ్చితంగా ఎన్నికల తాయిలంగానే కనపడుతోంది.

దీనిపై ఎవరైనా కోర్టు లో వ్యాజ్యం వేస్తే చంద్రబాబు అండ్ కో కు మొట్టికాయలు పడడం ఖాయం. ఇదే విధంగా చాలా హామీలను ప్రకటించేశారు. వాటిల్లో చాలా హామీలు ప్రశ్నార్ధకం

కాగా, కొన్ని ఆచరణకు అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. రాజధాని లో పాత్రికేయులకు 30 ఎకరాలు కేటాయించగా, ఇతర జిల్లాల పాత్రికేయుల విషయం లో స్పష్టత లేదు. పైగా ఒకరికి ఖాళీ

స్థలాలు ఇచ్చి, మరొకరికి చిన్న ఫ్లాట్ లు కట్టి ఇస్తే పాత్రికేయుల్లో ప్రాంతాల వారీగా విభేదాలు తలెత్తుతాయి. మిగిలిన హామీలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. వాటి వివరాలు

ఇలా ఉన్నాయి. 
 
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపు : 
• ఎన్టీఆర్ భరోసా పథకం à°•à°¿à°‚à°¦ ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాలన్న ప్రతిపాదనలకు మంత్రిమండలి

ఆమోదం.
• ప్రస్తుతం వెయ్యి రూపాయిలుగా ఉన్న పెన్షన్లు రూ.2 వేలు. రూ.1500 à°—à°¾ ఉన్న పెన్షన్లు రూ.3 వేలు చేశారు. 
• 54.61 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.
ఉద్యోగులకు

డీఏ : 
• ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం à°’à°• డిఏని à°ˆ జీతం నుంచి సర్దుబాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. 
• à°’à°• డీఏ బకాయిల మొత్తం రూ.513.13 కోట్లు

వాయిదాల రూపంలో చెల్లించాలని, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయానికి వచ్చింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేలు :
/> • వివిధ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైమ్ స్కేలు à°ˆ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి

నిర్ణయించింది. 
బుడగ జంగాల ఇష్యూ : 
• బుడగ జంగాల సామాజిక హోదా మార్పుపై శర్మ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. రాబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం

తీసుకుంటారు.
ఆటోలకు పన్ను మినహాయింపు : 
• ఆటోలకు జీవిత కాలం పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
• ముగ్గురు,

నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన తేలికపాటి

వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయింపు. మోటారు వెహికిల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి

ఆమోదం. 
• à°ˆ ఏడాది రూ.60 కోట్లు ఆటోలు నడిపేవారికి లబ్ది కలుగుతుంది. వారు ప్రతి ఏటా రూ.55కోట్ల లబ్ది పొందుతారు. 
• దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.60 కోట్ల మేర

ఆదాయాన్ని కోల్పోతుంది. 
• ఆటోలు,ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79లక్షల వాహన యజమానులకు లబ్ది. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయి. వీటిపై ఏడాదికి

రూ.20కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించారు. 
• 4 సీట్ల ఆటో రిక్షాలు 5.64లక్షలు ఉన్నాయి. వీటిపై ఏడాదికి రూ.19.59కోట్ల జీవితకాల పన్ను మినహాయించారు. 
• 5-6 సీట్ల

ఆటోరిక్షాలు 10 వేలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.14 లక్షల త్రైమాసిక పన్ను మినహాయింపు. 
• 7 సీట్ల ఆటో రిక్షాలు 10వేలు ఉన్నాయి. వీటిపై 27లక్షల త్రైమాసిక పన్ను మినహాయింపు.


ట్రాక్టర్లు 1.82లక్షలు ఉన్నాయి. వీటిపై త్రైమాసిక పన్ను రూ.13కోట్లు మినహాయింపు.
• ట్రాక్టర్ ట్రైలర్స్ 1.45లక్షలు ఉన్నాయి. వీటిపై త్రైమాసిక పన్ను రూ.11కోట్లు

మినహాయింపు.
• 3చక్రాల తేలికపాటి సరుకు రవాణా వాహనాలు 86వేలు ఉన్నాయి. వీటిపై జీవితకాల పన్ను రూ.22.50కోట్ల మినహాయింపు.
• మొత్తం 9.79లక్షల వాహనాల యజమానులకు రూ.66.50కోట్ల

ప్రయోజనం కలిగించిన ప్రభుత్వం
చుక్కల భూములు :
• చుక్కల భూములు, ఇళ్ల పట్టాల వరకు ఆర్డీవోలకే అధికారం. కలెక్టర్ల పర్యవేక్షణలో చేయాలి. 
• ఏపీ డాటెడ్

ల్యాండ్స్ చట్టంలోని కొన్ని అంశాలకు సవరణ ప్రతిపాదనకు ఆమోదం. జాయింట్ కలెక్టరుకు బదులుగా ఆర్డీవోకు ఇచ్చేసి కలెక్టర్ పర్యవేక్షించేలా చేయాలి. 
• చుక్కల

భూముల సమస్యలపై ఇబ్బందులు పెట్టరాదు.
హౌసింగ్ : 
• 2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న లక్షా 26 వేల 97 ఇళ్లకు ప్రభుత్వ సాయం అందించాలని మంత్రిమండలి

నిర్ణయం.
• ఒక్కో ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.15 వేలతో కలిపి రూ.60 వేల చొప్పున లబ్దిదారునికి ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 


దీనికోసం రూ.756 కోట్లు వ్యయం కానున్నది. 
పాత ఇళ్ల రిపేర్లకు రూ.10 వేలు :
• 1996-2004 మధ్యలో వివిధ పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మరమ్మతుల కోసం ఒక్కో

ఇంటికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనపై మంత్రిమండలి ఆమోదం.
• మొత్తం 20 వేల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది.
• దీని కోసం వన్ టైమ్ గ్రాంటు à°•à°¿à°‚à°¦ APHBà°•à°¿ రూ.20

కోట్లు ఇస్తారు. 
అర్బన్ హౌసింగ్ నిమిత్తం ల్యాండ్ పూలింగ్ : 
• అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్తవలసలో 94.86 ఎకరాలు, పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం 127.46

ఎకరాలు (మొత్తం 222.32 ఎకరాలు) చొప్పున ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉడాకు అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ర్యాటిఫై చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
ఉద్యోగుల,

అధికారులకు ఇళ్ల స్థలాలు :
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జుడిషియల్ అఫీషియల్స్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయింపుపై నూతన విధానం. మార్గదర్శకాల

రూపొందించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున కేటాయిస్తారు. సొసైటీల ద్వారా స్థలాల కేటాయింపు

జరుగుతుంది.

• à°ˆ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పనిచేస్తున్న అందరికీ స్థలాలు

కేటాయిస్తారు. 
• సెక్రటేరియెట్, లెజిస్లేచర్‌లలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ స్టాఫ్‌కు, రాష్ట్ర

రాజధానిలోని హెచ్‌వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. 
• అటానమస్ ఆర్గనైజేషన్లలో పనిచేసేవారికి స్థలాలు కానీ,

ఫ్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి నామినల్ మార్కెట్ రేటుకు కేటాయిస్తారు. 
• రాష్ట్రంలో రీజనల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు

బహుళ అంతస్థుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పిస్తారు.
• గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే à°ˆ కేటాయింపులు జరుగుతాయి.
కొత్తగా రెండు హౌసింగ్ పాలసీలు : 


ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కొత్తగా 2 పాలసీలు తీసుకువస్తున్నారు. 1) జనరల్ హౌసింగ్ పాలసీ, 2) కేపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్‌మెంట్ పాలసీ. 
• కొత్త రాజధాని కాబట్టి

ఇక్కడే స్థిర నివాసం ఉండేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2 పాలసీలు తెస్తున్నాం. రాజధానిలో నివాసాలను ప్రోత్సహించడం, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ కేపిటల్.. కోసం ఈ

పాలసీలను తీసుకువస్తున్నారు.
• ఫైనాన్స్, లా, సీఆర్‌డిఏ సెక్రటరీలు ఉమ్మడిగా నిబంధనలను, మార్గదర్శకాలను ఖరారు చేస్తారు.

జర్నలిస్టులకు 30 ఎకరాల స్థలం :


అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు à°Žà°•à°°à°‚ రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్‌డీఏ పరిధిలో కేటాయించాలని

నిర్ణయం.
• రాజధాని నగర ప్రాంతంలో హౌస్ సైట్ ఉన్నవాళ్లు అర్హులు కారు. ఏ ప్రాంతంలో ఇళ్ల స్థలం ఇస్తున్నామో à°† ప్రాంతంలో గతంలో ఇల్లు ఉండి ఉండకూడదు. దరఖాస్తుదారు

à°’à°• సొసైటీలో కన్నా ఎక్కువ సొసైటీలలో సభ్యుడిగా ఉండరాదు. 
• గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు à°’à°• విధానం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది

ప్రభుత్వ విధానం. 
• గతంలో ప్రభుత్వ లబ్ది పొందని జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం. 
• రాజధాని పరిధిలో సుప్రీంకోర్టుకు వెళ్లారు.

సుప్రీంకోర్టులో లిటిగేషన్ ఉంది. హైకోర్ట్ ఏం చెప్పిందంటే మీకు హౌసింగ్ పాలసి ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్లాలని అంది. 
• హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం

గతంలో ఇళ్లస్థలాలు ఉన్నవారికి ఇవ్వకూడదని జీవో 242, 243, 244లపై కేసులు వేశారు. వీటిపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్నారు.
• సీఆర్‌డీఏ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.

ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే స్థలాలు ఇస్తారు. అందుబాటులో లేకపోతే ప్రభుత్వమే స్థలం తీసుకుని ప్లాట్లు కట్టించి ఇస్తుంది. నిర్మాణ సంస్థలకు కనీసం 15 ఏళ్లు

అనుభవం ఉండాలి, 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలి.
చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా: 
• చేనేత కార్మికుల వైద్య-ఆరోగ్య బీమా పథకాన్ని తిరిగి తీసుకొస్తున్నారు. రూ.10

కోట్ల బడ్జెట్‌తో దీన్ని చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలను ఆహ్వానిస్తూ à°‡-టెండర్లు పిలవనున్నారు. కుటుంబానికి రూ.20 వేల చొప్పున బీమా

కల్పిస్తారు. 
కార్మిక చట్టాలకు సవరణలు :
• బీడీ, సిగార్ కార్మికుల నుంచి వర్కింగ్ జర్నలిస్టు అండ్ à°¦ న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ వంటి మొత్తం 20 చట్టాలకు సవరణలు

ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో స్కోర్ పెంచుకునేందుకు వీలుగా సవరణలు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 5 చక్కెర

ఫ్యాక్టరీలకు పన్ను మినహాయింపు: 
• పుంగనూరులోని కేబీడీ సుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ సుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట సుగర్స్, పొదలకూరులోని

సుదలగుంట సుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ సుగర్స్ సంస్థలకు రూ.47.54 కోట్ల మేర పన్ను మినహాయింపు. 
సుగర్ ఫ్యాక్టరీలకు à°Šà°°à°Ÿ: 
• కోఆపరేటీవ్, నిజాం సుగర్స్ (పబ్లిక్

సెక్టారు), ఖండసారి సుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ.227,04,59,292 మొత్తాన్ని మినహాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
రూ.2,685.58

కోట్లతో చిత్తూరు జిల్లాకు తాగునీరు : 
• పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లయ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్

ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు à°•à°¿à°‚à°¦ రూ.2,685.58 కోట్లతో పనులు చేపట్టాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. 
• ఇంటింటికీ తాగునీటి సరఫరా à°•à°¿à°‚à°¦ తొలిదశలో చిత్తూరు

జిల్లాకు రూ.2,685.58 కోట్లతో పనులు చేపడతారు. 28 మండలాలు, 4780 హ్యాబిటేషన్లకు ప్రయోజనం కలుగుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి తొలిదశ ప్రాజెక్టును చేపడతారు. 
బందరు పోర్టు

అభివృద్ధి : 
• బందరు డీప్ వాటర్ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూముల కొనుగోలుకు కలెక్టర్ నిర్ణయించిన ధరకు ఆమోదముద్ర

వేస్తూ మంత్రిమండలి నిర్ణయం.

• à°Žà°•à°°à°¾ రూ.40 లక్షల చొప్పున 122.95 ఎకరాల భూమిని ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ à°•à°¿à°‚à°¦ మేకవానిపాలెం, పోతిపల్లి గ్రామాలలో కొనుగోలు చేయడానికి

కృష్ణాజిల్లా కలెక్టరు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 
విట్

బిల్డింగ్స్‌కు అనుమతి : 
• రాజధానిలోని ఐనవోలు గ్రామంలో నెలకొల్పిన వెల్లూరు

ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) భవనాలను 45 మీటర్ల మేర ఎత్తుకు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం. 
• నేషనల్ బిల్డింగ్ కోడ్

ప్రకారం విద్యా సంస్థలకు 30 మీటర్ల వరకు అనుమతి ఇస్తారు. అయితే ఇది ఐకానిక్ బిల్డింగ్‌à°—à°¾ నిర్మాణం జరుగుతున్నందున 45 మీటర్ల ఎత్తున నిర్మించుకునేందుకు అనుమతి

ఇవ్వాలన్న అభ్యర్ధనను పరిశీలించి అనుమతి ఇచ్చారు. 
PACS: 
• కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల సూపరాన్యుయేషన్ వయసును నిర్దారించేందుకు చట్టంలో

అవసరమైన సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
• ఏపీ కో-ఆపరేటీవ్ సొసైటీల చట్టం-1964లో దీనికి సంబంధించి తగిన మార్పులు చేస్తారు. 
అనాధ

బాలలకు పాఠశాల నిర్మాణం- మినహాయింపులు : 
• కృష్ణాజిల్లా అంపాపురం గ్రామంలో అనాధ బాలల కోసం నిర్మించే పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు,

బిల్డింగ్ పర్మిట్ ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జీలు, లేబర్ సెస్ వగైరాల్లో రూ.2,15,215 మేర మినహాయింపు ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
గన్నవరం రైతులకు స్టాంపు డ్యూటీ

మినహాయింపు : 
• గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన (LPS ఫార్మర్స్) రైతులకు రాజధానిలో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్స్ఛేంజ్ డీడ్ రిజిస్ట్రేషన్,

స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ మంత్రిమండలి ఆమోదం. గన్నవరంలో భూములు ఇచ్చిన 1100 ప్లాట్లు రైతులకు రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వబోతున్నారు. వారికి స్టాంపు డ్యూటీ

మినహాయింపు.
టీటీడీ ఆలయం భూమికి పన్ను మినహాయింపు : 
• రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్ర

నిర్మాణం సీఆర్డీయే కేటాయించిన 25 ఎకరాల భూమి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ పత్రాలపై స్టాంపులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పన్ను రూ.1,00,20,600కు మినహాయింపు ప్రతిపాదనకు

మంత్రిమండలి ఆమోదం. కోటి వరకు మినహాయింపు.
రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి భూ కేటాయింపు : 
• విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో 1052.86 చదరపు గజాల మునిసిపల్

ల్యాండ్‌ను మంత్రాలయం శ్రీరాఘవేంద్ర మఠం వారికి కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో నాలుగోవంతు ధరకు భూమిని

కేటాయిస్తారు.
ఆర్మ్‌డ్ పోలీసులకు పదోన్నతులు : 
• ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ

మంత్రిమండలి నిర్ణయం. 
పోస్టులు : 
• హైకోర్టుకు కొత్తగా 9 పోస్టులు మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఇవన్నీ రిజిస్ట్రార్ పోస్టులు. 
• జాతీయ, రాష్ట్ర ఉత్తమ

ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సూపరాన్యుయేషన్ వయస్సు కంటే తక్కువగా ఉంటే à°’à°• ఏడాది పదవీకాలం పొడిగిస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
• తూర్పుగోదావరి జిల్లా చింతూరు

గ్రామంలోని నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే 27 టీచింగ్, 14 నాన్ టీచింగ్ ఉద్యోగాలను మంజూరుచేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం.
• రూ.1,52,33,172 బడ్జెట్‌తో à°ˆ

పోస్టులను మంజూరు చేశారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలను ప్రారంభిస్తున్నారు.
• విశాఖ జోన్-1 కు జాయింట్ డెరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టు మంజూరు.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోసం పోస్టుల మంజూరు. చీఫ్ ఇంజనీర్ పోస్టు 1, సూపరింటెండెంట్ ఇంజనీర్

పోస్టు 2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 6, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల పోస్టు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
• ప్రభుత్వం టేకోవర్ చేసిన కృష్ణాజిల్లా

కలిదిండి అల్లూరి సీతారామరాజు సహకార జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది సర్వీసును రెగ్యులరైజ్ చేస్తూ 8 ఉపాధ్యాయ పోస్టులు, 9 బోధనేతర సిబ్బంది పోస్టులు

మంజూరుకు మంత్రిమండలి ఆమోదం
భూ కేటాయింపులు :
• శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో MSME పార్కు నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. 


శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం à°•à°‚à°šà°°à°‚ గ్రామంలో పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం కోసం మునిసిపల్ కమిషనర్‌కు 23.36 ఎకరాల ప్రభుత్వ భూమి ముందస్తుగా స్వాధీనం.

ఏ.పి.ఎల్.ఎం.ఏ. సిఫారసు ప్రకారం మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.7,47,439 చెల్లించే షరతు మీద లేదా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అభ్యర్ధన మేరకు ఉచితంగా

స్వాధీనపరిచేందుకు మంత్రిమండలి ఆమోదం.
• కృష్ణాజిల్లా చల్లపల్లిలో శ్రీ విజయ ఎడ్యుకేషనల్ & కల్చరల్ సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి షరతులతో 20 ఏళ్ల పాటు

లీజు.

• అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి గ్రామంలో అందరికీ గృహనిర్మాణం (affordable) పథకం à°•à°¿à°‚à°¦ చేపట్టిన ప్రాజెక్టుకు 6 ఎకరాలు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.24,00,000

చెల్లించే షరతుపై లేదా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అభ్యర్ధన మేరకు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం. 
• అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమిటికుంట

గ్రామం సోలార్ పవర్

ప్రాజెక్టు కోసం 2.44 ఎకరాల భూమి NREDCAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు కేటాయింపు. 
• వైఎస్ఆర్ à°•à°¡à°ª జిల్లా తొండూరు మండలం బూచుపల్లి,

మల్లెల, తొండూరు ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం 42.70 ఎకరాల భూమి కేటాయింపు. బూచుపల్లిలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ.94,000, మల్లెల గ్రామంలో ఎకరం

ఒక్కింటికి రూ.1,06,213 రూపాయలు, తొండూరులో à°Žà°•à°°à°‚ ఒక్కింటికి రూ.1,04,213 చెల్లించే షరతు మీద NREDCAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం.
/> బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు : 
• బాబు జగ్జీవన్ రామ్ 111 à°µ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రకటించిన సమతా స్ఫూర్తివనం నిర్మాణానికి రూ.50 కోట్లు, నిర్మాణానికి 10

సెంట్ల భూమి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం. 
• అమరావతిలో నిర్మాణ స్థలాన్ని సీఆర్డీఏ గుర్తించి ఇచ్చిన తరువాత మరో రూ.50 కోట్లు సాంఘిక సంక్షేమ శాఖకు

చెల్లించేందుకు మంత్రిమండలి నిర్ణయం.
రిపబ్లిక్ డే ఏర్పాట్లు : 
• రిపబ్లిక్ డే వేడుకల అలంకరణ, భద్రతా ఏర్పాట్లు, పనుల కోసం రూ.64,60,373 కేటాయించే ప్రతిపాదనకు

మంత్రిమండలి ఆమోదం. ముందుగా ప్రతిపాదించిన రూ. 1,24,50,000 బదులుగా రూ.64,60,373కు వ్యయం కుదింపు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #andhra pradesh  #cabinet  #meeting  #amaravathi
 

Recent News

Latest Job Notifications

Panchangam - Mar 29, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam