DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవం గా సత్యసాయి ఆరాధన వేడుకలు. 

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2019 (DNS online) : సత్యసాయి బాబా అష్టమ ఆరాధన మహోత్సవాలు విశాఖలోని సత్యసాయి విద్యా విహార్ లో వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నగర సత్యసాయి సేవా

సమితి భజన బృందం ఆధ్వర్యవం లో 
నగర సంకీర్తనతో ఆరంభమైన ఈ ఉత్సవాలు, ఓం కారం, సుప్రభాతం అనంతరం నగర సంకీర్తన తో కొనసాగాయి. నగరం లోని ఎంవిపి కోలనీలోని శ్రీ సత్య

సాయి ప్రేమ సదన్ మందిరం లో శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం, భక్తులచే సామూహిక శ్రీ సత్య సాయి సహస్ర నామ లక్ష పుషార్చన, శ్రీ సత్య సాయి గాయత్రీ

విశ్వ శాంతి హోమం, తదుపరి పూర్ణాహుతి నిర్వహించారు. à°ˆ కార్యక్రమాలు నగర సేవ సమితి  à°•à°¨à±à°µà±€à°¨à°°à± పిఆర్ ఎస్ ఎన్ నాయుడు, బాల త్రిపుర సుందరి ఆధ్వర్యవంలో జరిగాయి. అనంతరం

పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు, తదుపరి మహా నారాయణ సేవ గా భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కావించారు. వేడుకల్లో భాగంగా సత్యసాయి విద్యార్థులచే వేద పఠనం,

అష్టోత్తరం జరిపిన అనంతరం సిటీ సేవా సమితి భజన బృందం చే నామ సంకీర్తన చేపట్టారు. కార్యక్రమాల్లో ఆకర్షణగా పుట్టపర్తి ప్రశాంతినిలయం కి చెందిన ప్రముఖ గాయకులు

ప్రిన్స్ పటేల్, సత్యం పటేల్ భజన గాయకులచే సంగీత విభావరి చేపట్టారు. విశాఖ లో జరుగుతున్న à°ˆ కార్యక్రమాల్లో సత్య సాయి బాబా వారి దివ్య సందేశం వీడియో  à°¦à±à°µà°¾à°°à°¾

ప్రదర్శించారు. à°ˆ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

dns; dnslive; dns live; dnsnews; dns news; dnsmedia; dns media; dnsonline; dns online; visakhapatnam; vizag; sathyasai; bhagavan; MVP colony; Aradhana Utsavam; Rudrabhishekam; 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam