DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ దేశాలకు చాటిచూపిన భారత నావికాదళ శక్తి 

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2019 (DNS online) : భారతీయ యుద్ధ నౌకల సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది భారతీయ నౌకాదళం. చైనా నావికాదళ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) 70 వ

వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం చైనా సముద్ర జలాల్లో జరిగిన నావికా విన్యాసాల్లో 13 దేశాలకు చెందిన 32 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. భారత నావికాదళం లోని యుద్ధ

నౌకల సామర్ధ్యాన్ని చాటి చెప్పేందుకు నిర్వహించిన నావికా విన్యాసం లో అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్ కతా,  à°¨à°¾à°µà°¿à°•à°¾à°¦à°³ నౌకా దళ సహాయక నౌక ఐఎన్ఎస్ శక్తి

లు అత్యంత ఆకర్షణీయంగా నిలిచాయి. చైనా అధ్యక్షులు జి జిన్ పింగ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ విన్యాసాలని ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ నౌక విన్యాసాల్లో (

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ) లో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో భారత నావికాదళ జట్టు  à°¸à°‚పన్ రేస్ పడవ తో 2 .5 కిలోమీటర్ల పెటీలోనూ, టగ్ ఆఫ్ వార్ ఛాంపియన్ షిప్ లోనూ

పాల్గొన్నారు. అదే విధంగా ఫుట్ బాల్ మ్యాచ్ లో భారత జట్టు బ్యునై నావి జట్టు తో పోటీ పడింది.  à°•à±à°°à±€à°¡à°¾ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు రెండవ స్థానం లో

నిలిచింది. కాగా చైనా జట్టు మొదటి స్థానం లో నిలిచింది. భారత నావికా దళ నౌకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడం గమనార్హం. 

 

 

 

 

#dns  #dnslive  #dns live 

#dnsmedia  #dns media  #dnsonline  #dns online  #dnsnews  #dns news  #visakhapatnam  #vizag  #indian navy  #INS Shakti  #INS Kolkata  #PLA  #China  #Foot Ball

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam