Jun 28, 2026 6:24 pm
*దేశం విడిచిన మేధావులు తిరిగి భారత్ కు రావాలి: ఎంపీ భారత్*
విశాఖ లో బ్రాహ్మణా సంఘాలచే ఘనంగా పీవీ 105 జయంతి వేడుకలు
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
విశాఖపట్నం, 28 జూన్ 2026 (DNS ): ప్రపంచ స్థాయిలో భారత కీర్తిపతాకను ఉన్నతంగా నిలిపి భారత మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారంగా జరపాలని మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలోని అఖిల బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక నిర్వహణలో పీవీ 105 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని లోక్ సభ సభ్యులు ఎం. శ్రీ భారత్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సుహాసిని ఆనంద్ ( బీజీపీ), బొత్స ఝాన్సీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ( వైఎస్సార్ కాంగ్రెస్), పివి కి ఎస్ డి ఓ గా ఆరేళ్ళు పనిచేసిన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జివిఎల్ మాట్లాడుతూ తానూ పీవీ ని ప్రత్యక్షంగా ఒక్కసారే కలిసినట్టు తెలిపారు. అయితే భారత ప్రధానమంత్రి గాను, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గానూ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ అన్నారు. ఈయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపు గాను ఆయనకు భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే నన్నారు. రాజకీయంగా బద్ద విరోదంగా ఉన్నప్పడికి వారికి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించడం జరిగిందన్నారు. ఆర్ధిక సంస్కరణల ద్వారా ఈ భారత దేశ గతిని పూర్తిగా మారేశారన్నారు.
ఒక వ్యక్తి మాతృ భాష కాకుండా మరొక భాష నేర్చుకోవడమే అత్యంత కష్టతరమని, అలాంటిది పీవీ ఏకంగా 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నేర్పరి అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా పీవీ నేటి తరానికి మార్గదర్శి అన్నారు.
విశాఖ ఎంపీ శ్రీ భారత్ మాట్లాడుతూ పీవీ ప్రభుత్వానికి ముందు ఉన్న ఆర్ధిక విపత్తుల ఫలితంగా విదేశాలకు వెళ్ళిపోయిన మేధావులు ( మేధో మధనం ) భారత్ కు తిరిగి రావాలి ని పిలుపునిచ్చారు. సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రపంచం మెచ్చిన ఆర్థిక సంస్కరణల మేధావిగా ఎదిగిన పీవీ స్ఫూర్తిగా నేటి యువతరం ఎదగాలని, తద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన స్థితికి చేరుకుంటుందన్నారు.
కార్యక్రమానికి ముందుగా పీవీ నరసింహారావు వద్ద ప్రత్యేక అధికారిగా ఆరేళ్ళు పనిచేసిన ప్రసాద్ పీవీ జీవన శైలి, ఆలోచన, కార్యాచరణ విధానాలని వివరించారు. ప్రతిపక్ష నేతలైన అటల్ బిహారి వాజపేయి, అద్వానీ, ఇతర ముఖ్య నేతలు అందరితోనూ స్నేహ పూర్వక అనుబంధాన్ని కొనసాగించారని తెలిపారు. తన సొంత భూమి 80 ఎకరాలను ప్రభుత్వానికి స్వచ్చ్చందంగా అప్పగించిన ధీశాలి పీవీ అని తెలిపారు.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సుహాసిని ఆనంద్ ( బీజీపీ), బొత్స ఝాన్సీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ( వైఎస్సార్ కాంగ్రెస్) తదితరులు పీవీ ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. వారిని కొనియాడడంతో పాటు, వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవ చెయ్యాలని పిలుపునిచ్చారు.
పీవీ విగ్రహానికి సంయుక్తంగా ఘన నివాళి :
అంతకు ముందు సిరిపురం లోని సర్క్యూట్ హౌస్ కూడలి వద్దగల పీవీ విగ్రహానికి ఎంపీ భారత్, మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు, గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావులు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ లు సంయుక్తం గా భారీ పూలమాల వేసి, ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమం లో వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు కావూరి చరణ్ కుమార్, పీవీ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె నరసింహ మూర్తి, వైజాగ్ బ్రాహ్మణ జె ఏ సి కన్వీనర్ కిరణ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలు ప్రముఖ న్యాయవాది కె. నరసింహ మూర్తి అధ్యక్షతన జరిగాయి. విశాఖ నగరం లోని అన్ని బ్రాహ్మణ సంఘాలు, అర్చక పురోహిత, మీడియా వర్గాలు, యువజన సంఘాలు, తదితర ప్రతినిధుల సంపూర్ణ సహకారంతో పీవీ జయంతి వేడుకలను విజయవంతంగా జరిగినట్టు నిర్వాహక కమిటీ తెలియచేసింది.
ఈ వేడుకల్లో విశాఖ లోని వివిధ బ్రాహ్మణా సంఘాల కుటుంబ సభ్యులు, పీవీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Jun 23, 2026 4:49 pm
*చతికిల స్థితి నుంచి చక్రం త్రిప్పే స్థితి కి వచ్చింది పీవీ వల్లే.*
*విజ్ఞాన గని, అపరమేధావి, బహు భాషాకోవిదునికి ఘన నివాళి*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 22, 2026 (డిఎన్ఎస్ ):* ప్రపంచ దేశాలకు ధీటుగా భారత దేశం అన్నిరంగాల్లో నిలబడడానికి ప్రధాన కారణం 1991 నుంచి 1996 వరకూ జరిగిన ఆర్ధిక సంస్కరణల బీజమే.
భారత దేశాన్ని దోచుకుతినేందుకు వెయ్యేళ్ళ కాలం లో ఎందరో బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు, హుణులు, శకులు, మొఘలులు, ఖిల్జీలు ఎందరో దాడులు చేసి, ఈ దేశ సంపదను దోచుకుతిన్న చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే స్వాతంత్య్ర పు స్వేచ్ఛ లభించిన తర్వాత ఎందరో స్కాం ల పేరుతో దోచుకుతిన్న సందర్భాలు కూడా ఈ దేశం చవిచూసింది.
ఇంత దారుణ దోపిడీ చవి చూసిన తరుణంలో భారత దేశం ఆర్ధికంగా పూర్తిగా చతికిల పడిన సమయంలో ఈ దుస్థితి నుంచి గట్టు ఎక్కించేందుకు వచ్చిన అత్యున్నత శక్తి పేరే పీవీ. .. పాముల పార్టీ వెంకట నరసింహారావు . .
పదవి చేపట్టింది కేవలం ఐదేళ్లు మాత్రమే. . అందునా పూర్తి స్థాయి సంఖ్యా లో ఎంపీ లు లేకున్నా. . ప్రతిపక్షాలను సైతం ఆకట్టుకున్నా నైజం పీవీ ది.
భారత దేశ చరిత్రలో 1991 కి ముందు 1991 తర్వాత అనే సగర్వంగా చెప్పుకునే స్థితికి చేర్చారు.
పీవీ అనే నేను భారత ప్రధానిగా . . .
21 జూన్ , 1996 నాటి స్వర్ణయుగాన్ని భారత ప్రజలు మరిచిపోయే అవకాశం లేదు. వంగర అనే కుగ్రామం నుంచి దేశ రాజధాని హస్తిన లో భారత దేశ 9 వ ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. అందునా ఒక బ్రహ్మాణ సామాజిక వర్గానికి చెందిన మేధావి దేశ ప్రధానిగా భాద్యతలు చేపడితే దేశ భవిత మారిపోతుంది అనడానికి నిదర్శనమే పీవీ పాలన.
భారత దేశపు ఆర్ధిక స్థితి విపత్తు అంచున ఉంది. దిగజారనున్న దేశాన్ని తిరిగి వెనుకకు మరల్చటానికి కార్యదక్షత గల ఒక బ్రాహ్మణుడు అపర చాణుక్యుడు గా రంగ ప్రవేశం చేసారు. తన ప్రభుత్వానికి తగిన సంఖ్యా బలం లేకున్నా. . . ఇతర కూటమి సభ్యులతో ఒక ప్రక్క సమన్వయము చేసుకుంటూ, మరోప్రక్క దేశ భవితను కాపాడుతూ, విదేశీ శత్రు దేశ ముష్కరులకు అడ్డుకట్ట వేస్తూ. . .ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన అత్యంత మేధావి ఇతను మాత్రమే.
ఉత్తర తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో లకినేపల్లిలో జూన్ 28, 1921 లో పుట్టిన పీవీ, కుటుంబ వృత్తి వ్యవసాయ మెళుకువలతో పాటు పాండిత్యం వారసత్వంగా పొందారు. చిన్న వయసులోనే దత్తతకు వెళ్లారు. గణితశాస్త్రంలో ప్రాధమిక విద్య వంగరలో మొదలెట్టారు. నాటి తెలంగాణ ఆచారాల ప్రకారం వీరికి అతి చిన్న వయసులోనే వివాహం జరిపించారు.
పీవీ ప్రయాణం . .. .
పీవీ విద్యా ప్రస్థానం అసాధారణమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాగపూర్ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో చదువుకుని, చివరికి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. డజనుకు పైగా భాషలు మాట్లాడగల బహుభాషావేత్త పీవీ. తనకి నచ్చని విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే. . . మరో భాషలో సమాధానం చెప్పడం గమనార్హం.
ప్రధానమంత్రి కాక ముందు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, హోం వ్యవహారాలు వంటి కీలకమైన శాఖలను నిర్వహించి ఎంతో అనుభవాన్ని పొందారు. పరిశీలనాత్మక దృక్పథం ఉండడంతో పాటు, ఎంతో సహనశీలి.
అగాధం అంచునుంచి అగ్రస్థాయికి దేశం :
1991 లో భారతదేశం ఆర్ధిక స్థితి ఇబ్బందుల్లోనే కాదు, డోలాయమానంగా ఉంది. దేశం తీవ్రమైన చెల్లింపుల సంతులన సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు ఎంతగా పడిపోయాయంటే, భారతదేశం కొన్ని వారాల దిగుమతులను కూడా భరించలేని స్థితికి చేరుకుంది. పూచీకత్తుగా బంగారాన్ని భౌతికంగా విదేశాలకు రవాణా చేయాల్సి వచ్చింది. దాదాపు జీవచ్చ వ స్థితి నుంచి జీవం పొయ్యాలి అంటే అంత సులభం కాదు.
అన్నింటినీ మార్చిన నిర్ణయాలు :
ఆర్ధిక స్థితిని మెరుగు పరిచేందుకు ఆయన రంగం లోకి దింపిన బ్రహ్మాస్త్రం పేరు మన్మోహన్ సింగ్. ఆయన్ని ఆర్థిక మంత్రిగా నియమించారు. వారిద్దరూ కలిసి భారతదేశ భవిష్యత్తును మౌలికంగా మార్చివేసిన అనేక ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. వాటిలో కొన్ని మచ్ఛుతునకలు
• సరళీకరణ: అనేక అనుమతుల పొరల కింద వ్యాపారాలను ఉక్కిరిబిక్కిరి చేసిన అపఖ్యాతి పాలైన “లైసెన్స్ రాజ్”కు ముగింపు పలకడం.
• ప్రైవేటీకరణ: అత్యవసరం కాని పరిశ్రమలలో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించడం.
• ప్రపంచీకరణ: విదేశీ పెట్టుబడులు మరియు వాణిజ్యం కోసం భారతదేశానికి ద్వారాలు తెరవడం.
ఇవన్నీ నిర్మాణాత్మకమైన మార్పులు. బాధాకరమైనవి, వివాదాస్పదమైనవి, మరియు అవసరమైనవి.
ఒత్తిడిలో నాయకత్వం :
పీవీ తీసుకున్న ప్రతి చర్యకు ప్రతిపక్ష పార్టీల నుండి మరియు తన సొంత కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. పాత సామ్యవాద చట్రంతో సౌకర్యవంతంగా ఉన్న సంప్రదాయవాదులలో ఆర్థిక వ్యవస్థను సరళీకరించాలనే ఆలోచన అంతగా ప్రజాదరణ పొందలేదు. అయినప్పటికీ, ముందుకు సాగారు.
ఆర్థిక శాస్త్రానికి అతీతంగా
ఆర్థిక సంస్కరణలే ఆయన అతిపెద్ద వారసత్వం అయినప్పటికీ, వాటికే పరిమితం కాలేదు. విదేశాంగ విధానాన్ని బలోపేతం చేశారు, కీలకమైన ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరిచారు. వేగంగా మారుతున్న ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మార్గనిర్దేశం చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత పరిణామాలు :
బాబ్రీ మసీదు కూల్చివేత తదనంతర పరిణామాలలో పీవీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నేటికీ హిందూ సమాజాన్ని పీడిస్తున్నాయి. అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుపడి ఉన్నారు. ముస్లిం వర్గాలకు అవిచ్చ్చన్న హక్కులు, చట్టాలు ప్రత్యేకంగా అమలు చేసారు. తద్వారా వక్ఫ్ పేరిట భూ ఆక్రమణలు పెరిగిపోయాయి.
వీరి హయం లోనే ఐటీ వృద్ధి విస్తృతంగా పెరిగింది.
ఆధునిక భారతదేశ రూపశిల్పి పీవీ :
ఆధునిక భారతదేశ రూపశిల్పి గా పీవీ ఖ్యాతి గాంచారు. ఆర్థిక పరివర్తన ఎప్పుడూ ఒక్కరి వల్ల జరిగేది కాదు. కానీ రూపశిల్పులు ముఖ్యమే. వారు వ్యవస్థను రూపొందిస్తారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, అంతా కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు బాధ్యత తీసుకుంటారు. పీవీ సరిగ్గా అదే చేశారు.
భారతదేశం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, ఆయన కేవలం వ్యవస్థను స్థిరీకరించడమే కాదు. దానిని పునర్నిర్మించారు. నిశ్శబ్దంగా, పద్ధతిగా, దశాబ్దాల తర్వాత మాత్రమే స్పష్టమయ్యే దూరదృష్టితో ఆయన ఈ పని చేశారు.
పి. వి. నరసింహారావు లేకపోతే, అభివృద్ధి చెందుతున్న భారతదేశపు కథ చాలా చాలా భిన్నంగా ఉండేది. బహుశా మరింత నెమ్మదిగా. బహుశా మరింత బలహీనంగా. మరియు కచ్చితంగా అంత ఆసక్తికరంగా ఉండేది కాదు.
భూ సంస్కరణల్లో వివాదం :
ఆర్ధిక సంస్కరణలతో పాటు, భూమి వ్యవహారం లో సైతం సంస్కరణలను చేపట్టారు. స్వయంగా తన సొంత భూమిని సైతం ప్రభుత్వ పరం చేసి, ధీరోదాత్తుడు అయ్యాడు పీవీ. అయితే ఈయన చేసిన సంస్కరణలను వక్ఫ్ పేరిట అపరిమిత భూ దోపిడీ జరిగిన మాట మాత్రం వాస్తవం. ప్రభుత్వ స్థలాలతో పాటుగా, ప్రయివేట్ వ్యక్తుల భూములను సైతం బలవంతంగా ఆక్రమించుకున్న ఘటనలు కూడా పీవీ హయాంలోనే జరిగాయి.
బాబ్రీ ఘటనలు సాకుగా చూపించి, ముస్లిం లకు మేలు చేసే ఎన్నో చట్టాలను అమలు చెయ్యడమే కాక, రాజ్యాంగం లో సైతం కూడని మార్పులు చేసి, హిందూ సమాజం నుంచి నేటికీ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒక వ్యక్తి తన పరిధిలో చేసే పనుల ద్వారా అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అసాధ్యం. అయితే. . . అధిక భాగం ప్రజానీకానికి మేలు జరిగే అంశాలను అందరూ అభినందించవలసిందే. .
సొంత పార్టీ నుంచే ఘోర పరాభవం :
చిన్న నాటి నుంచి తానూ నమ్మిన కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎన్నికైన పీవీ అదే ఖాన్ గ్రెస్ పార్టీ నుంచి అత్యంత ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు. పదవి పూర్తి అయినా తర్వాత ఖాన్ గ్రెస్ పార్టీ పీవీ పట్ల అత్యంత నీచమైన వైఖరి చూపింది. విదేశీ మహిళా సారధ్యంలో ఉన్న పార్టీ లో దేశీయ మహా నాయకులకు ఎటువంటి చోటు లేదని నిరూపితమయ్యింది. పీవీ మరణం తర్వాత భౌతిక కాయాన్ని సాధారణంగా ఆయా పార్టీ కార్యాలయాల వద్ద సందర్శన కోసం ఉంచుతారు. అయితే పీవీ భౌతిక కాయం ఖాన్ గ్రెస్ పార్టీ గుమ్మం తొక్కడాని కి కూడా వీలు లేదు అని విదేశీ మహిళా సారధ్యంలోని ఖాన్ గ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో సొంత పార్టీ నేతలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఎంతో నాటకీయ పరిణామాల మధ్య పీవీ కాయాన్ని తెలంగాణ లోని భాగ్యనగరానికి తీసుకు రావడం జరిగింది. అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో పీవీ అంత్య క్రియలు జరగడం బాధాకరం. దీనికి ప్రధాన కారణం. . పీవీ బ్రాహ్మణుడు కావడమే అనేది వారి అభిమానుల మనోగతం.
ప్రతిపక్షాలలో సైతం అభిమానులు. . .:
అందరిని కలుపుకుంటూ వెళ్లే నైజం ఉన్న పీవీ తో ప్రతిపక్షాల సభ్యులు సైతం ఎంతో సన్నిహిత బంధాలు ఉండేవి. అభిప్రాయాల పరంగా ముఖ్యంగా భిన్న ధృవమైన భారతీయ జనతా పార్టీ నేతలలో అటల్ బిహారి వాజపేయి, ఎల్ కె అద్వానీ, వంటి మహానేతలు పీవీ తో ఏంతో సన్నిహితంగా ఉండేవారు.
పివి కి భారత రత్న ఇచ్చింది bjp :
సొంత ఖాన్ గ్రెస్ పార్టీ పీవీ ని అత్యంత దారుణంగా అవమానిస్తే. . ప్రతిపక్ష పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ పీవీ ఈ దేశానికి చేసిన సేవలకు గుర్తింపు గాను అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పురస్కారం తో గౌరవించింది. తమకు పీవీ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవం ఉంది అని ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పురస్కారం సందర్భంగా ప్రకటించడం ద్వారా విపక్షాలు సైతం పీవీ ని ఎంతగా ఆదరించాయో తెలుస్తోంది.
పీవీ జయంతి కి విశాఖ లో భారీ ఏర్పాట్లు :
ఇంతటి వైభవాన్ని సంతరించుకున్న పీవీ నరసింహారావు జయంతి జూన్ 28 . ఈ ఏడాది 105 జయంతి వేడుకలను విశాఖపట్నం మహా నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య నిర్ణయించింది. నగర పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించి, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

సంప్రదాయం లో ఆషాఢ శుద్ధ ఏకాదశి కే తొలి ప్రాధాన...
Jul 24, 2026 12:55 pm
*శ్రీమహావిష్ణువు యోగనిద్ర లోకి వెళ్ళేది ఈ రోజునుంచే*
*25 న తొలిఏకాదశి, చాతుర్మాస్య దీక్ష ...
Jul 23, 2026 5:51 pm
Jul 15, 2026 8:05 pm
Jul 15, 2026 5:47 pm

Jun 28, 2026 10:27 pm
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
విశాఖపట్నం, 28 జూన్ 2026 (DNS ): భారత దేశాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఆర్ధిక ప్రభంజనం సృష్టించే స్థితి కి తీసుకు వచ్చిన భారత రత్న పీవీ నరసింహారావు కి విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం ఘన నివాళి అర్పించింది. ఆదివారం విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం కూడలి వద్ద గల పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్చించారు. ఈ సందర్భంగా VKBAP సేవా సంఘం అధ్యక్షులు నెమ్మలూరి శివగణేష్ మాట్లాడుతూ పీవీ లాంటి అపర మేధావి బ్రాహ్మణ సామాజిక వర్గం కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య వ్యక్తి ప్రపంచం విస్తుపోయే ఆర్ధిక సంస్కరణలను చేపట్టి దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. విశాఖ లో ఉమ్మడి బ్రాహ్మణ ఐక్య వేదిక నిర్వహిస్తున్న పీవీ జయంతి వేడుకలకు తమ సంఘం తరపున భారీ విరాళాన్ని సైతం అందించారు.
విశాఖపట్నం బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక JAC కన్వీనర్ మాట్లాడుతూ పీవీ తెలుగు వాడు కావడం మన తెలుగు ప్రజలకు గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమం లో విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ శర్మ, నాగ శర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు.