DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్డే క్రికెట్ మ్యాచ్ కు భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు 

విశాఖపట్నం, అక్టోబర్ 23 , 2018 (డిఎన్ఎస్):  à°¬à±à°§à°µà°¾à°°à°‚ విశాఖ నగరం లోని ఏ సీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో  à°­à°¾à°°à°¤à± - వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే

మ్యాచ్ కు భారీ మొత్తం లో పోలీసు బలగాలను à°°à°‚à°—à°‚ లోకి దించారు. 
విశాఖ సిటీ, జిల్లా పరిధిలోనే పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రంగం అంతా క్రికెట్ మ్యాచ్

నిర్వహణలోనే సమాయత్తమయ్యారు. ఇదే సమయం లో ఫైన్ టెక్ అంతర్జాతీయ సదస్సు కూడా నగరం లోనే జరుగుతుండడంతో దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి రావడంతో భద్రతా

ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పడికే నగర పరిధిలోని హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. మ్యాచ్ కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. సోమవారం వరకూ ఒక్కరు కూడా

కనిపించని ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచే భారీ ప్లాటూన్ల పోలీసులు భద్రతా కోసం దిగాయి. గత నెల్లోనే మన్యం లో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల జంట హత్యలతో

ఉలిక్కి పడిన విశాఖ, ఈ మ్యాచ్ కోసం రెట్టింపు భద్రతను ఏర్పాటు చెయ్యడం గమనార్హం. బిసిసిఐ అనుమతించిన పాస్ లు లేనివారిని మైదానం పరిసరాల్లోకి రానివ్వకుండా

కట్టుదిట్టమైన ఆజ్ఞలు జారీ చేశారు. వివిఐపి లు, విఐపి లు, మీడియా, సాధారణ ప్రేక్షకులకు విడివిడిగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసి, వారి వాహనాల పార్కింగ్ కై విస్తృత

ఏర్పాట్లను చేశారు. ఇప్పడికే అన్ని మార్గాల్లోని రహదారులను పోలీసు వర్గాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మ్యాచ్ ముగిసే వరకు ( సుమారు

రాత్రి 10 గంటల వరకు) విశాఖ నుంచి - విజయనగరం మధ్య పూర్తిగా దారి మళ్లింపు చేపట్టారు. వీటిని గమనించి నగర వాసులు పోలీసు యంత్రాంగానికి సహకరించవలసినదిగా

సూచించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cricket  #aca vdca criket stadium  #pm palem stadium  #india  #west indies  #traffic  #commissioner of police

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam