DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నోటి దురదతో హిందూపురంలో కూటమి అభ్యర్థి కి దబిడిదిబిడేనా?

*అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)* 

*విశాఖపట్నం, ఏప్రిల్ 29, 2024 (డి ఎన్ ఎస్):* నోటి తో అహంకారపు వ్యాఖ్యల ఫలితం హిందూపురం లో తెలుగుదేశానికి దబిడిదిబిడి అయ్యేలా తయారయ్యింది. హిందూపురం కేంద్రంగా స్వామి పరిపూర్ణానంద గత

రెండేళ్లుగా పలు సామాజిక కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తూ అందరి తో కలిసి మెలిసి ప్రచారం చేసుకున్నారు. అయన హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున టికెట్ ఆశించారు. బీజేపీ కూడా దాదాపుగా ఖరారు చేసింది. అయితే. . హిందూపురం నుంచి అసెంబ్లీ కి బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి స్వామిజి ఎంపీ గా పోటీ చేస్తే స్థానిక ముస్లిం లు

తనకు ఓటు వెయ్యరు అని, తక్షణం స్వామిజి కి టికెట్ రద్దు చెయ్యాలి అని తేల్చి చెప్పేసారు. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ నేతలకు దాదాపు హుకుం జారీ చేసేసారు. అంతే స్వామిజి కి కేటాయించిన ఎంపీ సీటీ రద్దు చేసేసారు. స్వామిజి బీజేపీ నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. 
దీంతో ఆగ్రహించిన పరిపూర్ణానంద 85 శాతం

ఉన్న హిందువులకు ఇది అవమానం అని, కేవలం ముస్లిం ఓట్ల ను మాత్రమే టీడీపీ అభ్యర్థి అడగాలని డిమాండ్ చేశారు. తానూ ఇంతవరకూ ఎంపీ టికెట్ మాత్రమే ఆశించానని, టీడీపీ అభ్యర్థి హిందువులపై చేసిన అవమానకారపు వ్యాఖ్యలకు నిరసనగా తానూ అసెంబ్లీ బరి లో కూడా నామినేషన్ వేశారు. కూటమి నేతలు స్వామిజి నామినేషన్ ను ఆకతాయితనంగా తీసుకుని,

పెద్దగా పట్టించుకోలేదు. 
అయితే సోమవారం నామినేషన్లు ఉపసరణ సమయం కూడా ముగిసి పోవడంతో స్వామి పరిపూర్ణానంద కు అగ్గిపెట్టె గుర్తు కేటాయిస్తూ నామినేషన్ ను ఖరారు చేసారు. 
దీంతో ఒక్కసారిగా కూటమి నేతల్లో గుబులు మొదలయ్యింది. గత రెండేళ్లుగా స్వామిజి కి మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ మద్దతు ప్రకటించారు. నేడు

ఎన్నికల్లో సైతం స్వామిజి వెంటే తాము ఉంటామని ప్రకటన కూడా చేయడంతో పాటు, వారు ప్రచారాన్ని సైతం ఉధృతం చేసారు. 
స్వామిజి గెలిచినా, గెలవక పోయినా, హిందూపురం శాసన సభ నియోజక వర్గంలో అధికశాతం ఓట్లను చీల్చడం మాత్రం ఖాయం. దీంతో టీడీపీ అభ్యర్థి గత రెండు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న పెద్దగా చేసిన అభివృద్ధి ఏమి

లేకపోవడంతో యువత, మహిళలు, మైనారిటీలు అధికశాతం స్వామిజి కి ఓటు వేసే అవకాశం ఉంది. తద్వారా అభ్యర్థి గెలుపు అంత సులభం కాబోదు.
కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న హిందూపురం సీటు నేడు అభ్యర్థి నోటి దురద వల్ల కత్తిమీద సాములా తయారయ్యింది అని కూటమి క్యాడర్ మింగలేక కక్కలేక ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 16, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam