DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీల అభ్యర్థులకు ఒణుకు పుట్టిస్తున్న బ్రాహ్మణ అభ్యర్థులు 

పెందుర్తి లో అభ్యర్థులను పరుగులెత్తిస్తున్న పురోహిత మిత్ర రాజేష్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)* 

*విశాఖపట్నం, ఏప్రిల్ 29, 2024 (డి ఎన్ ఎస్):* వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసన సభ, లోక్ సభ స్థానాలకు పోటీపడుతున్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు బ్రాహ్మణ అభ్యర్థులు ఒణుకు

పుట్టిస్తున్నారు. కేవలం కుల పిచ్చితో అభ్యర్థులకు సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకు ఇతరులు చుక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ, కూటమి పార్టీ అభ్యర్థులకు అడ్డుపుల్లలు గా స్వతంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం, బిసి సామాజిక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ

రెండు వర్గాలకూ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీల అభ్యర్థులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పార్టీ కూడా బ్రాహ్మణా సామాజిక వర్గం వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన వీరు కొందరు అభ్యర్థులను బరిలో నిలిపారు. 
వారిలో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున ఏలూరు వెంకట రమణ (రాజేష్)

పెందుర్తి నుంచి, వడ్డాది ఉదయ్ కుమార్ పెందుర్తి నుంచి, నూకల సూర్య ప్రకాష్ భీమిలి నుంచి శాసన సభకు పోటీ పడుతున్నారు. చాపక్రింద నీరులా వీరు చేసుకుంటున్న ప్రచారం ఉద్యమంగా సాగుతోంది. పెందుర్తి నియోజక వర్గంలో బ్రాహ్మణా , కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. కూటమి పార్టీల నుంచి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ( కాపు ) బరిలో

ఉండగా, బ్రాహ్మణులూ కూడా తమకే ఓటు వేస్తారు అనే ధీమాతో ఉన్నారు. ఒక్కసారిగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడం తో కూటమి కంగు తింది.  ఇక ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇతని పట్ల సొంత పార్టీలోనే పూర్తి వ్యతిరేకత ఉంది. దీంతో కూటమి అభ్యర్ధికి గెలుపు అవకాశం ఉందని అందరూ భావిస్తున్న

తరుణంలో బ్రాహ్మణ అభ్యర్థులు అడ్డుకట్ట వేస్తున్నారు. 

ఆ అర్చకుడు . .అసామాన్యుడే, . .

పెందుర్తి నియోజక వర్గం నుంచి బరిలో ఉన్న ఏలూరు వెంకట రమణ ఆ ప్రాంతం వారికి సుపరిచితులు. ప్రధానంగా బ్రాహ్మణా సామాజిక వర్గంలోని అన్ని వర్గాలకూ తలలో నాలుకలా మసులుతూ.. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ ద్వారా ఎన్నో సేవా

కార్యక్రమాలు చేస్తున్నారు. వృత్తి పరంగా పౌరహితులు అయినా, వాస్తు, జ్యోతిష్యం సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వ్యాపారం చేసుకునేవారికి ప్రతి నెలా బ్రాహ్మణ బజార్ లు నిర్వహిస్తూ, వారికి ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా సేవ చేస్తున్నారు.  
పేద బ్రాహ్మణులకు ఆర్థిక, వ్యాపార, విద్యా, వైద్యం, తదితర రంగాల్లో తగిన విధంగా

అండగా నిలబడి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన బ్రాహ్మణా పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను, హ్యూమన్ రైట్స్ సంఘానికి స్థానిక ప్రతినిధిగానూ, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. 
గత ఆరు నెలలుగా పెందుర్తి నియోజక వర్గం లోని ప్రతీ వీధి తిరుగుతూ అందరి సమస్యలూ తెలుసుకుంటున్నారు. ఒక చిన్న ఆటో, సంప్రదాయ వస్త్రధారణలో

 పదిమంది పురోహితులు ఒక బృందంగా ఏర్పడి ఒక్కో ప్రాంతం లో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వి ఐదు ఆరు బృందాలు పెందుర్తి నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 

ఈయనకు డ్రిల్లింగ్ మిషన్ గుర్తు కేటాయించడం కూడా ఈయన ప్రచార శైలి ని తెలియచేస్తోంది. గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా క్షేత్ర స్థాయిలో

డ్రిల్లింగ్ చేసి మరీ ఓట్లు కొల్లగొట్టేలా కనపడుతోంది. 

ఇప్పడికే ఉత్తరాంధ్ర పురోహిత సంఘం, ఆంధ్ర ప్రదేశ్ విశాఖ కేంద్ర బ్రాహ్మణ పురోహిత సంఘం సమాఖ్య వెంకట రమణ కు మద్దతు ప్రకటించాయి. ఇక ఇదే ప్రాంతంలో సింహాచలం గ్రామం కూడా కలవడంతో అక్కడ పురోహిత, అర్చక సంఘాలు, కూడా ఈయనకు సంఘీభావం తెలిపే అవకాశం ఉంది.

 

ఇంతకాలం అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేసిన బ్రాహ్మణ సామాజిక వర్గం ఒక్కసారిగా విజృంభించి ప్రచారం చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు నిద్ర పట్టడం లేదంటే అతిశయోక్తి కాదు 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 15, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam