DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నామలై పేరు చెబితేనే ద్రావిడ పార్టీలకు గుబులు పుడుతోంది

*కమలాసన్..మెంటల్ ఆసుపత్రిలో మెదడు చెక్ చేయించుకో: అన్నామలై* 

*లక్ష్మణారేఖ దాటితే మీడియానైనా బొయికాట్ చేస్తాం: అన్నామలై*  

*దూకుడు పెంచిన తమిళ సింగం, మద్దతుగా ఎన్నారై లు ప్రచారం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*చెన్నై/ విశాఖపట్నం, ఏప్రిల్ 10, 2024 (డి ఎన్ ఎస్):* తమిళనాట రాజకీయ

ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కమలాసన్ మెంటల్ ఆసుపత్రిలో చేరి మెదడు పరీక్షించుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్, తమిళసింగం కె అన్నామలై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే రాజధాని నాగ్ పూర్ కు మారుతుంది అని కమలాసన్ చేసిన వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా

మండిపడ్డారు. 

వాడో జోకర్ : దయానిధి మారన్.

తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఒక జోకర్ అని డీఎంకే నేత దయానిధి మారన్ హేళన చేసారు. ఒక జాతీయ మీడియా తో మాట్లాడుతూ అన్నామలై చేసే బఫున్ పనులను నవ్వుకోవాలన్నారు. దీనికి స్పందనగా అన్నామలై ను తక్కువ అంచనా వేస్తున్నారంటూ జాతీయ మీడియా

సూచించింది. 

మీడియా అతి. . .వాతలు పెట్టిన అన్నామలై. 

లక్ష్మణ రేఖ దాటి, గాడితప్పితే మీడియా నైనా సరే బొయికాట్ చేయడం జరుగుతుందని తమిళ సింగం, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై చేసిన ప్రకటన హిందూ వ్యతిరేక ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. 
తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ ఉధృతమవుతున్నాయి. చరిత్ర

తిరగ రాస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ కె అన్నామలై, గ్రామస్థాయిలో ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ తమిళ సింగంగా మారారు. ఇంతకాలం బీజేపీ కి ఏమాత్రం ఉనికి లేని   పార్టీకి జవసత్వాలు పెంచి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం ద్రావిడవాడ, హేతువాద పార్టీలకు నిద్రపట్టడం లేదు. ఎలాగైనా అన్నామలై ను అడ్డుకోవాలని విశ్వ

ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారం లో అడుగడుగునా అడ్డుకోడానికి మీడియా ముసుగులో తమ పార్టీ సభ్యులను వదిలిపెట్టింది. 

ప్రచార కాన్వాయ్ లో సైతం కేవలం రెండే కార్లు వినియోగించే అన్నామలై ని ఇబ్బంది పెట్టేందుకు ఓ 10 కార్లలో మీడియా పేరుతొ హిందూ వ్యతిరేక పార్టీల సభ్యులు రావడాన్ని తప్పుపట్టారు. తద్వారా వాళ్ళ

ఖర్చు మొత్తం అన్నామలై ఖాతాలో వేసి, ఈసీ కి ఫిర్యాదు చేసేందుకు కుట్ర పన్నారు. క్రిమినల్స్ ని, గజదొంగలనే ఐపీఎస్ గా గజగజలాడించిన అన్నామలై కి ఈ కుట్రవాదులు ఓ లెక్కా? ఈ వాహనాలను అడ్డుకుని, తమతో మీడియా వాహనాలు అవసరం లేదని, ఏ ప్రాంతంలో మీడియా వాళ్ళని అక్కడే కలుస్తామని చెప్పారు. 
మీడియా పేరుతొ లక్ష్మణ రేఖ దాటితే బాయ్ కాట్

చెయ్యడానికి కూడా వెనుకాడమని ప్రకటించారు. 

అన్నామలై కు మద్దతు గా రంగంలోకి ఎన్నారై లు:. 

తమిళనాట హిందూ వ్యతిరేకులు, హేతువాదులు ద్రావిడ వాదం ముసుగులో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు అన్నామలై కు మద్దతు గా ఎన్నార్ఐ లు నేరుగా రంగంలోకి దిగారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తమిళులు పెద్ద

సంఖ్యలో కోయంబత్తూర్ కు చేరుకుంటున్నారు. స్వచ్చందంగా అణ్ణామలైకి ప్రచారం చేస్తున్నారు. 
ఒక్కసారిగా తమిళ నాట మారిన రాజకీయ ప్రచారం హిందూ వ్యతిరేక పార్టీలకు కొరుకుడు పడడం లేదు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 29, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam