DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటమి భయంతో పురంధేశ్వరి అనపర్తి రెబెల్ అభ్యర్థి కు బహిరంగ మద్దతా?

*ఎంపీ ప్రచార రధాలపై నల్లమిల్లి ఫోటో, భారీ షాక్ లో బీజేపీ, కూటమి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*అనపర్తి / విశాఖపట్నం, ఏప్రిల్ 21, 2024 (డి ఎన్ ఎస్):* రాజమండ్రి ఎంపీగా గెలిచే అవకాశం లేదు అనే భయంతో అనపర్తి తెలుగుదేశం రెబెల్ అభ్యర్థి కి మద్దతు ప్రకటించారని ప్రచారం విస్తృతంగా

సాగుతోంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తు పార్టీల నియమాన్ని సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తుంగలోకి తొక్కినా ఘటన రాజమండ్రి లో జరిగింది. ఎంపీ గా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచార రధాలపై ఉన్న బ్యానర్లలో అనపర్తి తెలుగుదేశం రెబెల్ అభ్యర్థి నల్లమిల్లి

రామకృష్ణ రెడ్డి ఫోటో ఉండడం అందరిని షాక్ కు గురి చేసింది. 

అనపర్తి లో బీజేపీ కి చెందిన అత్యంత వీక్ అభ్యర్థి కొనసాగితే తానూ ఎంపీ గా గెలిచే అవకాశం లేదు అనే విషయం ఆమెకు తెలుసు. 

అనపర్తి లో ఎమ్మెల్యే టికెట్ ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆశించారు. అయితే పొత్తులో ఈ సీటు

బీజేపీ అభ్యర్థి శివకృష్ణ రాజు కు కేటాయించడం జరిగింది. ఇప్పడికే ఆతను ప్రచారాన్ని వేగవంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఈ సీటు తనకు ఇవ్వాల్సిందిగా నల్లమిల్లి శాంతియుత పోరాటం చేస్తున్నారు. అయితే ఈ సీటు మార్పు పై ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నల్లమిల్లి స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 23 న నామినేషన్

వేసేందుకు ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. 

రాజమండ్రి ఎంపీ పరిధిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పురంధేశ్వరి ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచార రధాలపై అసెంబ్లీ అభ్యర్థుల ఫోటోల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఫోటో ముద్రించడం కలకలం లేపింది. 

సొంత పార్టీ అభ్యర్థిని

వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ రెబెల్ అభ్యర్థి ఫోటో ను వెయ్యడం ఏంటని, బీజేపీ అభ్యర్థి సమర్ధించడం ఏంటని అధిష్టానం చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. పైగా రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న పురంధేశ్వరి తానే ప్రతిపాదించి, ప్రకటించిన అనపర్తి అభ్యర్థి శివకృష్ణ రాజు కు వెన్నుపోటు పొడవడం ఏంటని బీజేపీ క్యాడర్

మండిపడుతున్నారు. 

ఒకవేళ టికెట్ మార్పు ఉన్నట్టు అయితే. . .ఆ మార్పు జరిగాక నల్లమిల్లి ఫోటో ను ముద్రించాల్సి ఉంది. అది కాకుండా ముందుగానే అత్యుత్సాశానికి పోయి పురంధేశ్వరి సొంత పార్టీ అభ్యర్థి కి బలిపశువును చేసినట్టు అయ్యింది. 

ఇప్పడికే టికెట్ల పంపకం లో తన సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు

ఇచ్చుకున్నారు అనే విమర్శల నేపథ్యంలో అనపర్తి టీడీపీ రెబెల్ ఫోటో మరింత సంచలనం గా మారింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam