DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర టెకీలకి సోఫియా ను తయారు చేసే సత్తా లేదా ?

కోట్లు ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా ?

విశాఖపట్నం, అక్టోబర్ 23 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ):  à°ªà±à°°à°ªà°‚చానికే  à°à°Ÿà°¿ రంగాన్ని పరిచయం చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో

హ్యూమనోయిడ్ రోబో సోఫియా లాంటి అత్యంత సామర్ధ్యం కల్గిన ఉత్పత్తులను తయారు చేసే సామర్ధ్యం లేదా? ఇదే అనుమానం లక్షలాది మంది ఆంధ్ర ప్రదేశ్ వాసులకు కలుగుతోంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్ లో హై టెక్ సిటీ ని స్థాపించి, ప్రపంచానికి ఐటి రంగాన్ని పరిచయం చేసిన అతి తక్కువ మందిలో అగ్రభాగం లో ఉండేవారు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ తో పాటు, పొరుగు రాష్ట్రం తెలంగాణ లోని ప్రముఖులు సైతం

ప్రకటించిన అంశం. ఈయన రోజుకు  22 గంటలకు పైగా శ్రమించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూ, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పుంఖానుపుంఖాలుగా ఐటి సదస్సులు, భాగస్వామ్య

సదస్సులు నిర్వహిస్తూ లక్షల కోట్లు పెట్టుబడులను ఆంధ్రాకు తీసుకువచ్చి, సాంకేతిక పరంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయన చేసిన కృషి

మద్దతు గా నిలవ వలసిన ఇన్ఫార్మషన్ టెక్నాలజీ ( ఐటి) విభాగం పూర్తిగా వైఫల్యం చెందింది అనడం అతిశయోక్తి కాదు. పైగా ఈ ఐటి రంగానికి అత్యంత సమర్ధవంతమైన తెలుగుదేశం

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రిగా నియమించి, సాఫ్ట్ వేర్  à°°à°‚à°—à°‚ లో ఎంతో ప్రసిద్ధి కెక్కిన జె వై చౌదరిని, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఐటి

సలహాదారుగా నియమించారు, ఈయనకు సహాయకారిగా ఉండే విధంగా అపిటా ( ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ అకాడమీ) ని ఏర్పాటు చేసి, దేశంలోనే ప్రసిద్ధి కెక్కిన నిపుణుడు విన్నీ

పాత్రో ను ఉపాధ్యక్షునిగా నియామకం చేసేసారు. వీరిద్దరి సహకారం తో రాష్ట్రంలోని అణువణువునా శక్తి సామర్ధ్యం కల్గిన యువతను ఎంపిక చేసి,  à°¹à±à°¯à°¾à°•à°¥à°¾à°¨à±, వాకథాన్, రోడ్

షో à°² పేరిట  à°µà°¾à°°à°¿à°•à°¿ పోటీ పరీక్షలు, ప్రోజక్టులు ఇచ్చి, విజేతలకు కోట్లాది రూపాయల పారితోషికం ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి. à°—à°¤ నాలుగున్నరేళ్ల

కాలం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా అప్పుల్లో ఉన్నప్పటికీ ఐటి రంగానికి కళ్ళు బైర్లు కమ్మే విధంగా వారు అడిగిన దాని కంటే రెట్టింపు మొత్తం లో నిధులు

మంజూరు చేయడం తో పాటు తన శక్తి ని సైతం ధర పోస్తున్న చంద్రబాబు నాయుడు ఆశించిన ఫలితాల్లో కనీసం 1 %  à°•à±‚à°¡à°¾ ఫలితం తీసుకురాలేక పోతున్నారు అంటే ఆంధ్ర ప్రదేశ్ ఐటి

రంగంలో ఉన్న సిబ్బంది లో చిత్తశుద్ధి కొరవడింది, లేక అసలు చిత్త శుద్దే లేకుండా పోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
à°ˆ దేశం లో హై టెక్  ( ఐటి) ముఖ్యమంత్రి

ఎవరు అని ఎవరిని ప్రశ్నించినా వెంటనే వచ్చే సమాధానం చంద్రబాబు నాయుడు. ఇది అందరూ ఒప్పుకుని తీరాల్సిన విషయమే. అయితే ఈయన అంచనాలకు తగిన సిబ్బంది పనిచెయ్యకపోవడమే

à°ˆ రాష్ట్రం అభివృద్ధి పధం లోకి వెళ్లకపోవడమే రుజువు. 

ప్రపంచంలో మా సత్తా దాదాపు సున్నా : జె వై చౌదరి.

ఐటి రంగంలో ప్రపంచం తో పోటీ పడే వారందరిలోకి ఆంధ్ర

ప్రదేశ్ ఐటి రంగం ఫలితం దాదాపు సున్నా యే నని, ఆంధ్ర ప్రదేశ్ ఐటి సలహాదారు జె వై చౌదరి ప్రత్రికా సమావేశం లోనే ప్రకటించారు అంటే ఆంధ్ర లో ఐటి విభాగం పనితీరు ఎలా

ఉందొ తెలుస్తోంది. చంద్రబాబు ఆశించిన ఫలితాలను వీళ్ళు చేరుకోవాలి అంటే కనీసం మాతో నాలుగు దశాబ్దాల కాలం పట్టేలా ఉంది. సాధారణ ఫలితాలే సాధించలేక పోతున్న ఐటి శాఖ

ఇక ప్రపంచాన్ని శాసించే సోఫియా లాంటి  à°ªà±à°°à°ªà°‚à°š వింతలను తయారు చేయాలి అనుకోవడం చాలా అత్యాశే అవుతుంది. 

సదస్సులో జరిగేది ?

భారీ మొత్తం లో ప్రకటనలకు

ఖర్చు చేస్తూ, ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ వందలాది మంది వ్యాపారవేత్తలను, సంస్థలను ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే వచ్చిన వారితో విజయవంతమైన చర్చలు

జరిపి, వారితో ఆంధ్రాలోనే సంస్థలు నెలకొల్పాలినే అనే కోరికను బలీయంగా చెయ్యడం లో నిర్వాహకులు ఘోరంగా దెబ్బతింటున్నారు. సదస్సులు భారీ గానే ఉంటున్నాయి,

సదస్సులు నిర్వహించే స్టార్ హోటళ్ల బిల్లు కూడా భారీ మొత్తం లో ఉంటూ ప్రభుత్వానికి పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వచ్చే సంస్థలూ లేవు, పెట్టుబడులూ

ఉండడం లేదు. 
అదేదో సినిమాలో ఒక పోలీసు అధికారి చెప్పినట్టు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా . , లాంటి సీనులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎదురవ్వకూడదు అంటే ఇకనైనా ఐటి

విభాగం లో ప్రతి ఒక్కరు చిత్తశుద్ధి తో పని చేస్తే ముఖ్యమంత్రి ఆశించిన విజయవంతమైన ఫలితాలు సాధించడం పెద్ద విషయం కాదు, ఘనకార్యం à°…à°‚à°¤ కంటే కాదు. 

సోఫియా కంటే

పెద్ద వింతలు ఎన్నో చెయ్యొచ్చు.. 

దక్షిఫ్రికా పౌరసత్వం కల్గిన సోఫియా ను విశాఖ కు తీసుకువచ్చి పెద్ద ఘనకార్యం చేసాం అని చెప్పుకోడం కంటే . . అలాంటి సోఫియా

లనే ఆంధ్ర లో సృష్టించాలి అనే ఆలోచన ఆంధ్రా ఐటి విభాగం లో ఎవరికైనా వచ్చిందా అనేది అనుమానమే. 
ప్రపంచం లో దేశ విదేశాల్లో అత్యున్నత ఐటి సంస్థల్లో ఉన్నత

హోదాల్లో స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారిలో ఆంధ్రులే అధికం. ఇక్కడ మేధావులు విదేశాల్లో అద్భుతాలు చేస్తున్నప్పుడు, స్వదేశం లో ఎందుకు చెయ్యలేక పోతున్నారు.

దీనిపై  à°ªà±‚ర్తి స్థాయి లో పరీక్షలు చేసి, మట్టిలో మాణిక్యాలకు అవకాశం కల్పిస్తే. . . ఇలాంటి ఒక్క సోఫియా ఏంటి ?  à°¦à°¾à°¨à°¿ కంటే పెద్ద పెద్ద వింతలే సృష్టించగలిగే సత్తా

ఆంధ్రా మేధావులకు ఉంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #CBN  #Fint Tech 2018  #Chandra babu Naidu  #Novotel  #Facebook  #sophia  #IT  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam