DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వ పాప హరణం  దామోదర దీపోత్సవము 

విశాఖపట్నం, అక్టోబర్ 25, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : హైందవ సంప్రదాయం లో ప్రతి గృహంలోనూ నిత్య దీపారాధన జరగాల్సియుంది. అయితే పాశ్చాత్య సంప్రదాయాలకు అలవాటుపడి, దీపారాధనలు

దాదాపుగా కరువవుతున్నాయి. సనాతన ధర్మాన్ని తిరిగి కొనసాగించేలా, సంత్సంగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు చేస్తున్న కృషికి తగిన ఫలితం లభిస్తుంది. నిత్యం గృహాల్లో

దివ్యజ్యోతులు వెలిగించి, తన జీవనాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగింపచేసుకోవాలనే సంకేతాలను ఇచ్చే విధంగా నగరం లోని ఇస్కాన్, హరేకృష్ణ మూమెంట్ సంస్థలు చేస్తున్న

కృషి అభినందనీయం, సదా ఆచరణీయం. దామోదరం మాసాన్ని పురస్కరించుకుని బుధవారం ( ఈ నెల 24 ) నుంచి నగరం లోని సంస్థల ఆలయాల్లో ప్రతి రోజు సాయంత్రం వేళల్లో సహస్ర దీపాలంకరణ

సేవ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు ఆవు నేతితో దీపాలంకరణ చేయడం వలన కలిగే ఫలితం వివరిస్తూ, హైందవ

సంప్రదాయం లో దీపానికి ఇచ్చిన ప్రాధాన్యతలను భక్తులకు తెలియచేయడం జరుగుతోంది. ఇదే మాసం లో స్వయంగా భక్తుల ఆహ్వానం మేరకు, వారి గృహాల వద్దే ఈ దీపోత్సవాలను కూడా

నిర్వహించే విధంగా à°ˆ ఆధ్యాత్మిక సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా యువతీ యువకులు, విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తున్నాయి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns

news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #damodara  #deepotsavam  #iskcon #hare krishna movement 


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam