DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్దార్ సాక్షిగా మరోసారి తెలుగు వారికీ భంగపాటు 

ఇది మేడ్ ఇన్ ఇండియా కాదా, భారత్ కు అంత సత్తా లేదా ?

విశాఖపట్నం, అక్టోబర్ 31, 2018 (DNS Online ) : భారత దేశ వాసులంతా గర్వించదగినట్టు అత్యంత ఎత్తైన ( 182 మీటర్లు,  597  à°…డుగులు )

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు విగ్రహాన్ని నిర్మించామని భారతీయ జనతా పార్టీ, అదే వేడుకల్లో తెలుగువారికి మారోసారి సర్దార్ సాక్షిగా భంగపాటు కల్గించింది. ఈ

విగ్రహం పై స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటూ లిఖించిన పది భాషల్లో తెలుగు భాషకు స్థానం లేకపోవడం ఆంధ్రులు భగ్గుమంటున్నారు. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ సర్దార్

సరోవర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన భారీ ( 182 మీటర్లు,  597  à°…డుగులు )  à°¸à±à°Ÿà°¾à°Ÿà±à°¯à± ఆఫ్ యూనిటీ విగహాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. దీని ప్రారంభోత్సవానికి

వివిధ ప్రాంతాల బీజేపీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ విగ్రహ నామ ఫలకం పై లిఖించిన భాషలపై విమర్శలు వెల్లువవుతున్నాయి. ఈ భాషల్లో తమిళం (తప్పుల తడకలతో), ఫ్రెంచ్,

ఉర్దూ, హిందీ, గుజరాతీ లాంటి భాషలకు మాత్రమే ఈ బోర్డు లో స్థానం కల్పించడం వివాదం నెలకొంది. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తోలి నాళ్ళ నుంచి

ఆంధ్రా పై మోడీ కి ఉన్న వివక్ష, ఈ విగ్రహం రూపం లో బహిర్గతం అయ్యింది. విభజన బిల్లు ప్రకారం ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూడా

ఇవ్వలేదు. దీన్నిబట్టే ఆయనకు, బీజేపీ కి ఆంధ్ర పట్ల ఉన్న వివక్ష నేడు బహిర్గతం అయ్యింది. ఇంతకూ ముందు బీజేపీ కి ఓటు వెయ్యలేదు, ఇక వెయ్యరు అని పూర్తిగా

నిర్దారించుకున్న బీజేపీ వర్గాలు, సర్దార్ ప్రాజెక్ట్ నామ ఫలకం పై తెలుగు భాషకు స్థానం లేకుండా చేసినట్టు తెలుస్తోంది. 

ఇది మెడ్ ఇన్ ఇండియా కదా

?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ సర్దార్ విగ్రహ ప్రాజెక్ట్ నిర్మాణం లో తన కనుసన్నల్లోనే నిర్వహించారు. ప్రధాని సహా, బీజేపీ వర్గాలన్నీ

మేడ్ ఇన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద భాషణలు చేసేస్తూ ఉంటారు, దేశం లో మొత్తం వ్యాపార వర్గాలన్నింటినీ భారత్ లోనే ఉత్పత్తులు తయారు చెయ్యమని దాదాపుగా శాసించిన పనీ

చేస్తున్నారు. 
అలాంటిది వారు చేపట్టిన ఈ విగ్రహం టర్నర్ నిర్మాణ సంస్థ ( దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా నిర్మాణ కర్తలు), మైఖేల్ గ్రేవ్స్ అండ్ అసోసియేట్స్, మీన్హర్డ్ట్

గ్రూప్ సంస్థల పర్యవేక్షణలో జరిగింది. ఇతరులతో ఎందుకు తయారు చేయించినట్టో చెప్పాలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంటే నీతులు ప్రక్కవాడికి చెప్పేందుకే

నన్నమాట. వీళ్ళు పాటించేందుకు కాదా అనే సంకేతాలను బీజేపీ వర్గాలు ఇస్తున్నట్టే ఉంది. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sardar vallabhay patel  #statue of unity  #narendra modi  #bjp  #andhra pradesh  #telugu  #tamil  #english  #hindi  #gujarati

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam