DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్ష ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిందే , రోడ్డెక్కిన నిరుద్యోగ యువత

విశాఖపట్నం, నవంబర్ 2, 2018 (డిఎన్ఎస్  DNS Online) : బాబు వస్తే జాబు వస్తుంది అని లక్షలాది మంది యువతను మభ్యపెట్టి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీరని

ద్రోహం చేసాడని నిరుద్యోగ యువత రోడ్డెక్కింది. శుక్రవారం నగరం లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్  ( ఏ యు) గ్రంధాలయం నుంచి మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగ

గల గాంధీ విగ్రహం వరకూ సుమారు రెండు వేలమందితో భారీ ర్యాలీ చేపట్టారు. వీళ్లంతా పీజీ లు చేసి నిరుద్యోగ యువత కావడం గమనార్హం. రాష్ట్ర విభజన తదుపరి లక్షలాది గా

ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఇష్టం లేదని యువతీ యువకులు మండిపడ్డారు. వీరి భారీ ర్యాలీ సిరిపురం, ఉడా

కార్యాలయం, హెచ్ ఎస్ బీ సి కూడలి, దత్ ఐలాండ్, సంపత్ వినాయకగర్ ఆలయం, ఆశీలిమెట్ట కూడలి మీదుగా జీవీఎంసీ కి చేరుకుంది. ఈ ర్యాలీ లో విద్యార్థులు ఎటువంటి అవాంఛనీయ

ఘటనలు చేయకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. డీసీపీ స్థాయి అధికారులు ప్రత్యక్షం పర్యవేక్షణ చేసారంటే ఏ స్థాయి లో భద్రతా చేపట్టారో

తెలుస్తోంది. అనంతరం విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 18 వేల పోస్టులనే భర్తీ చేస్తున్నట్టు ప్రకటన

విడుదల చేసిందని, అయితే నిరుద్యోగులు లక్షల్లో ఉండగా, కేవలం 18 వేల పోస్టులే ఎలా కుదురుతుందన్నారు. తక్షణం లక్ష పోస్టులను భర్తీ చేయాల్సిందేనని, తాము ఎన్నో

ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కై శిక్షణ పొందుతున్నామని, కనీసం చంద్రబాబు నాయుడు ఉద్యోగాలను భర్తీ చేస్తామని నోరెత్తలేదన్నారు. ఓట్లు కోసం అడుక్కున్న

తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పుడు కళ్ళు మూసుకుపోయారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని ఓట్లు వేయించుకున్న తెలుగుదేశం, నేడు కనీసం ఒక్కడికి

కూడా రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రానున్న కాలం చంద్రబాబు నాయుడుకు గడ్డు కాలమేన్నాయి, ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనల్లో ఏ యు

కళాశాలలు, అనుబంధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #andhra university  #nirudyoga march  #mass protest  #huge rally  #andhra pradesh  #government  #job notifications

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam