DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ సోదాల్లో రవాణా తిమింగలం, అంచనాకు మించి ఆస్తులు. 

ప్రభుత్యోద్యోగం తో పాటు à°“ బ్యాంకు డైరక్టర్ కూడానూ. 

పూర్తిగా అధికార దుర్వినియోగం, పైగా ఆస్తులు చేరవేత. 

విశాఖపట్నం, నవంబర్ 3, 2018 (డిఎన్ఎస్  DNS Online):

అక్రమాస్తులను కూడబెట్టడం లో అధికార గణం చాలా ముందంజలో నడుస్తోంది. వరుసగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖా దాడుల్లో విశాఖపట్నం కు రవాణా శాఖా అధికారి భారీ

మొత్తం లో పట్టుబడ్డారు. నగరానికి చెందిన  à°¶à°°à°—à°¡à°‚ వెంకట రావు విశాఖ రవాణా శాఖా లో బ్రేక్ ఇన్స్పెక్టర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 7 :30 à°—à°‚à°Ÿà°² నుంచి అయన

ఇంటిలోనూ, సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేశారు. ఇప్పడికే ఆదాయానికి మించి భారీ మొత్తం లో బంగారం , వెండి ఆభరణాలు సంపాదించినట్టు

సోదాల్లో వెల్లడైయింది. రెండు బ్యాంకు ల్లో లాకర్లు తెరవవలసియుంది. అరిపాక ప్రాంతంలో 20 ఎకరాల భూమి à°•à°¿  à°¸à°‚బంధించిన పత్రాలు, ఇంకా భారీ స్థిరాస్తులు సంబంధించిన

పత్రాలు సోదాల్లో లభ్యమయినట్టు తెలుస్తోంది. గతం లో 2003 లో జరిగిన ఏసీబీ దాడుల్లో వెంకటరావు అప్పట్లోనే 1 కోటి  80 లక్షలు భారీ నగదు విలువ ఆస్తులతో దొరకడం జరిగింది. ( à°ˆ

మొత్తం అప్పట్లోనే ఎక్కువగానే ఉండేది). 1994  à°²à±‹ ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ సర్వీసులోకి  à°šà±‡à°°à°¿, నాటి నుంచి, తన పలుకుబడితో కేవలం ఉత్తరాంధ్రా జిల్లాలోనే మొత్తం సర్వీసు

ను గడిపేసినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి, తనకు కావాల్సిన చోట పోస్టింగ్ చేయించుకున్న సందర్భాలు

ఉన్నట్టు తెలుస్తోంది. నగరం లోని అక్కయ్యపాలెం లో గల గౌరీ కోపరేటివ్ బ్యాంకు లో డైరక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం లో

ఉన్న వ్యక్తులు మరే ఇతర పదవుల్లోనూ, పలుకుబడి పెరిగే విధుల్లోనూ, ఉండడం గానీ, పదవులు చేపట్టకూడదు. ప్రస్తుతం సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు ఇదే అంశం పై

విచారణ జరుపుతున్నారు. మురళీనగర్ లోని వెంకటరావు నివాసం పై  à°¡à°¿à°Žà°¸à± పి రమాదేవి నేతృత్వం లోని బృందం సోదాలు జరుపుతోంది. లభిస్తున్న ఆధారాల ప్రకారం సోదాలు ఇంకా

కొనసాగనున్నాయి.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia #dns media  #vizag  #visakhapatnam  #acb raids  #rama devi  #dsp  #RTO   #Assistant Motor vehicle inspector  #RTA  #Vizianagaram  #Srikakulam  #akkayyapalem  #muralinagar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam