DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్జునుని చేతిలో దుష్ట చతుష్టయానికి భంగపాటు తప్పదు : బొత్స. 

విశాఖపట్నం, నవంబర్ 4, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : మహా భారతం కలం లో దుష్ట చతుష్టయాన్ని చూసినవాళ్లు ఇప్పుడు లేరని, అయితే ఆధునిక భారతం లో దుష్ట చతుష్టయాన్ని ప్రత్యక్షంగా

చూస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ తెలుగుదేశం తన బద్ద విరోధి అయినా కాంగ్రెస్ పార్టీ తో జతకట్టడం తో ఇది ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ దుష్టచతుష్టయానికి ఆధునిక అర్జునుడు వైఎస్ జగన్

మోహన్ రెడ్డి చేతిలో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. పూర్తిగా అవినీతిలో కుళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలను రక్షించుకోవడానికి బద్ద విరోధి అయిన

కాంగ్రెస్ తో కలిశారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రం లోని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని, దోపిడీ దారులైన సుజనా చౌదరి ఈడీ విభాగం,  à°¸à°¿à°Žà°‚ రమేష్ పై ఆర్ధిక

శాఖా సోదాలు చేపడితే అవి రాష్ట్ర ప్రజలకే అవమానం అని సొంత పచ్చ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసుకున్నారని హేళన చేశారు. à°—à°¤  à°¨à°¾à°²à±à°—ున్నరసంవత్సరాల పాలనలో

అద్బుతాలు చేశానని, ఇంతకంటే మెరుగైన పరిపాలన కావాలి నాకు మరొక అవకాశం ఇవ్వాలని ప్రజలను అడగాలి గాని, స్థాయి దిగిపోయి అర్భకుల కళ్ళు పట్టుకోవడం నలభై ఏళ్ళ రాజకీయ

చరిత్రకు మచ్ఛే అన్నారు. 

అన్ని వ్యవస్థలనూ బ్రష్టు పట్టించాడు :

చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో  à°…న్ని వ్యవస్దలను భ్రష్టు పట్టించడని, ఏ ఒక్క శాఖను కూడా

వదిలిపెట్టలేదన్నారు. తన అవినీతి పంజా బారిన పడకుండా ఉన్న శాఖా ఒక్కటి కూడా లేదన్నారు. 

- సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చంద్రబాబు

ఎన్నిసార్లు చెప్పాడని, ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ళ దగ్గరకి చేరుకున్నదన్నారు. బీజేపీ వలన దేశానికి జరిగిన నష్టం కంటే చంద్రబాబు వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన

నష్టం పది రేట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం,ఇచ్చినమాట నిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్

అధిష్ఠానాన్ని ఎదిరించి దేశం లోని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం నేర్పించిన పార్టీ ఇదేనన్నారు. రానున్న కాలం లో ఈ దుష్ట చతుష్టయానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు

గట్టిగా బుద్ది చెప్తారని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీ కాంగ్రెస్ అయితే, దానికి అనుమతి ఇస్తూ అందరికంటే ముందుగా లేఖ ఇచ్చింది

చంద్రబాబే నన్నారు. à°ˆ ఇద్దరు ద్రోహులకు ఆంధ్ర ప్రజలు గుణపాఠం చెప్పి, ఇంటికి పంపడం ఖాయమన్నారు. 

చీఫ్ సెక్రటరీలతోనే ఛీ కొట్టించుకున్న ఘనత మీదే .:

గతం లో

నీ వద్ద పనిచేసిన ఛీఫ్ సెక్రటరిలు ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తోందని చెప్పి, ఛీ కొట్టినా, దులుపేసుకున్న ఘనుడు చంద్రబాబేనన్నారు. గతం లో ఏ ముఖ్యమంత్రి దగ్గర

పనిచేసిన ప్రధాన కార్యదర్శులైనా ఇలా ముఖ్యమంత్రి మొహాన ఛీ కొట్టిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dns media  #dnsmedia  #vizag  #visakhapatnam  #ysr congress  #botsa satyanarayana  #press meet  #telugudesam  #congress

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam