DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర బీజేపీ అంతా మోసపూరితమే : బెహరా అనిల్. 

ఆంధ్ర బీజేపీ అంతా దొంగ నాటకాలు, మోసపూరితమే,  : బెహరా అనిల్. 

జల్లికట్టు కంటే శబరీ మల అయ్యప్ప తక్కువ వాడా ?

అంతా ఓటు రాజకీయమే, వీళ్ళకి హిందుత్వ అవసరం

లేదు...

బిజె వైఎం అధ్యక్షునికి కావాల్సింది రాముడు కాదు, రహీమే . . . . .

పార్టీ వైఖరి పై మండిపడుతున్న గుంటూరు యువమోర్చ నేతలు 

గుంటూరు, నవంబర్ 6 ,2018 (DNS Online ): భారతీయ

జనతా పార్టీ అంతా మోసపూరితం గా మారిపోయిందని, ఏళ్ళ తరబడి పార్టీ నే నమ్మిన వారిని భూ స్థాపితం చేస్తున్నారంటూ గుంటూరు యువమోర్చ సభ్యుడు బెహరా అనిల్ బీజేపీ పై

ఫైర్ అయ్యారు. పార్టీ లో తగిన గుర్తింపు లేదని తన ఆవేదన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

గత కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం శ్రమించి, ఉద్యమాల్లో పోలీసుల లాఠీ

దెబ్బలు తిని, పోలీసు కేసులు మోస్తూ, కోర్టులో కేసులకు హాజరవుతున్న కార్యకర్తలకు బీజేపీ ఇచ్చిన బిరుదులూ కరడు కట్టిన హిందువాది అని అన్నారు. వీళ్ళని నమ్ముకుంటే

క్రైస్తవ, ముస్లిం ఓట్లు పోతాయంటూ బహిరంగంగానే ప్రచారం చేస్తున్న పార్టీ నేతలపై గుంటూరు బీజేవైఎం మండిపడుతోంది. 
సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వారిపై

కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారన్నారు. పార్టీ ఆవిర్భవించిన నాడు ఉన్న సిద్ధాంతాలకు పాతర వేసేశారని, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు ఉప్పు పాతర వేసే విధంగా

శబరిమల ఆలయం పై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే నోరెత్తక పోవడంతోనే  à°¬à±€à°œà±‡à°ªà±€ వైఖరి ఏంటో బహిర్గతం అయ్యిందన్నారు. తమిళనాడు లో జల్లికట్టు నిర్వహణ పై సుప్రీం కోర్టు

ఇచ్చిన వ్యతిరేక తీర్పు పై తక్షణం ఆర్డినెన్సు తీసుకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం, శబరీ మల ఆలయం విషయం లో ఎందుకు నోరెత్తలేదన్నారు. పార్టీలోని నేతలు, కోవర్టులు

చేసిన ఒత్తిడి మేరకు ఓట్లు రాజకీయం కోసం నోరెత్తలేదన్నారు.

హిందుత్వ దెబ్బతింటూంటే పార్టీ నోరెత్తదే ?
ఇటీవల కాలం లో హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా

సుప్రీం కోర్టు లో తీర్పులు వెలువడుతుంటే బీజేపీ నేతలు కనీసం నోరు కూడా ఎత్తడం లేదన్నాడు. స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాల పై అనుకూలత, శబరీ మల ఆలయం లోకి అన్ని

వయసుల మహిళల ప్రవేశం తదితర అంశాలపై వెలువడిన తీర్పులు హిందూ సమాజం లో ఎన్నో అభ్యంతరాలు కల్గించిన, బీజేపీ నోరెత్తకపోవడంతోనే దాని విలువల ప్రజలకు

తెలిసిందన్నారు. 

కూల్చిన ఆలయాల కట్టక పొతే నోరెత్తలేదే  ?

విజయవాడ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నలభై హిందూ ఆలయాలు కూల్చేస్తే ఎదో తూతూ

మంత్రం గా నిరసన చేసి, తర్వాత నోరెత్తని ఘనత ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ దే నన్నారు. కూల్చిన ఆలయాల స్థానంలో తిరిగి కడతామని కేవలం నోటిమాటగా చెప్పగానే మళ్ళీ నోరెత్తని

ఘనులు ఆంధ్ర బీజేపీ పెద్దలేన్నారు. ఇది జరిగి నెలల కాలం గడుస్తున్నా ఇప్పడికీ ఆలయాలు ఎక్కడ కడతారో కూడా చెప్పక పోయినా బీజేపీ మాత్రం తన పబ్బం

గడుపుకుంటోందన్నారు. 


బీజేవైఎం అంతా బూటకమే  :

భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర కమిటీ లో మొదటి నుంచి

బీజేపీ జండా పట్టుకుని పని చేసిన వారికి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని, పైగా 45 ఏళ్ళు దాటినా వీళ్ళు యువకులే అంటూ గుంటూరు నుంచి నలుగురికి పదవులు

కట్టబెట్టారన్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలుగా వివిధ కమిటీల్లో హంగామా చేస్తున్న వారిలో ఎంతమంది 2014  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à°•à± ముందు బీజేపీ పార్టీ లో ఉన్నారని

ప్రశ్నించారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన రమేష్ నాయుడు కి బీజేవైఎం అధ్యక్షునిగా పదవి వచ్చినప్పుడు వెంటనే అతను భద్రాచలం గుడికో, లేదా ఒంటిమిట్ట రామాలయం కో లేదా

సమీపం లో ఏ రామాలయానికో వెళ్తాడు అనుకున్నామని, అయితే అతను నెత్తిన ఓ టోపీ పెట్టుకుని మసీదుకు పోయాడని మండిపడ్డారు. పైగా ఇతను సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వ్యక్తి

అని గుర్తు చేశారు. పార్టీ లో కేవలం కుల, ఆర్ధిక, అంగబలం మాత్రమే నడుస్తోందని, ఏళ్ళ తరబడి నుంచి బీజేపీ పార్టీ అభివృద్ధి కి కృషి చేసిన వాడు అవసరం

లేదన్నారు. 

కార్యకర్తలు  à°¸à°¾à°§à°¿à°‚చింది పోలీసు కేసులు మాత్రమే :

నిన్న గాక మొన్న పార్టీ లోకి వచ్చిన వాళ్లకి అధ్యక్ష పదవులు, అనుబంధ విభాగాల పదవులు

కట్టబెట్టి, పార్టీ ను పూర్తిగా కుళ్లబొడిచేశారన్నారు. అతనికి జై కొట్టినవాడికే పార్టీలో పదవులు వచ్చే దౌర్భాగ్య స్థితికి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ

చేరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మిగిలింది కేవలం పోలీసు కేసులేనన్నారు. పైగా ఇవన్నీ బీజేపీ అధిష్టానం

మేరకు వివిధ సమయాల్లో నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు చేసిన సమయం లో పెట్టినవేనన్నారు. 

ఆంధ్ర లో ప్రజలను మోసం చేసేందుకు పార్టీ లోని భూటకపు పెద్దలు బృహత్తర

ప్రణాళిక సిద్దం చేసేశారన్నారు. దీనిద్వారా రానున్న కాలంలో పార్టీ జండా మోసేందుకు కూడా డబ్బులిచ్చి జనాన్ని తెచ్చుకునే గతి పడుతుందన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns

news  #dnsmedia  #dns media  #vizag #visakhapatnam #andhra pradesh  #bjp  #bjym  #guntur

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam