DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన కాంతులని వెలిగించాలి అంటూ నరక సంహార ఆవిష్కరణ  

విశాఖపట్నం, నవంబర్ 7 ,2018 (DNS Online )  :  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ ఆంగ్ల చదువుల్లో పడి సంప్రదాయం అనేది తెలియకపోతుండడంతో విశాఖ నగరం లోని అపార్టుమెంట్ నివాసాల్లోని చిన్నారులకు దీపావళి

పర్వదినోత్సవ అంతర్గత విషయాన్ని తెలియచేసేందుకు నరక అసుర దహన ప్రక్రియను చేపట్టడం జరిగింది. దుష్ట ప్రక్రియ అనే అసురునికి ప్రతీకగా ఒక గడ్డి బొమ్మను

తయారుచేసి, అందున బాణాసంచా పెట్టి, వెలిగించి, దుష్ట ప్రక్రియను మనసులో కూడా తలవకూడదు అనే సంకేతాన్ని అందించడం జరిగింది. చిన్నారుల్లో జ్ఞాన జ్యోతులు

వెలిగించేందుకు పెద్దలు ఈ దీపావళి పర్వదినోత్సవ ప్రభావాన్ని వివరించారు. ఈ వేడుకల్లో చిన్న పెద్ద, అందరూ పాల్గొన్నారు. జ్ఞాన నేత్రం ముందుగా తెరుచుకోవాలి అనే

విషయానికి సంకేతంగా బొమ్మ కి తల భాగం లో ఒక చిచ్చుబుడ్డి ని పెట్టి వెలిగించారు. అరిషట్వర్గాలకు ప్రతీకలుగా లక్మి బాంబులను, చికాకులకు సంకేతంగా సీమ టపాసులు

బొమ్మలో పెట్టారు. అనంతరం సురక్షిత, శ్రేష్ట, ప్రశాంత దీపావళి జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియచేసారు. బాలయ్యశాస్త్రి లే అవుట్ లోని నందిని అపార్టుమెంట్ లో

జరిగిన à°ˆ ప్రక్రియ లో పాల్గొనేందుకు కోలనీ వాసులందరినీ అహ్వాహించారు.  

అంతర్గత విశేషం : 
అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగు లోకి రావడమే దీపావళి.

అంతర్గతంగా జ్ఞాన జ్యోతులని విలిగించుకుని ఉత్తమ పౌరులుగా తయారు కావాలి అనే ప్రధాన విషయానికి సాకార రూపమే దీపావళి. దీన్ని అందరికీ తెలియచేసే విధంగా,

అందరితోనూ కలిసి అనుభవించే విధంగా బాణా సంచా కాల్పులు. 

చెడు పై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ రోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. పుస్తకాల్లో

వివరించిన విధంగా పిల్లలకు దీపావళి జరుపుకునే విధానాన్ని చూపించేందుకు ఈ ప్రక్రియ జరపడం జరిగింది.

నరక : ఎవరికైతే కాంతి అంటే నచ్చదో వాడే నరకుడు. అంటే

అజ్ఞాని అని అర్ధ,. కాంతి అంటే జ్యోతి, జ్ఞానం. జ్ఞానం లేనివారు, వెలుగు లోకి రావడం అంటే ఇష్టం లేనివారుగా చెప్పుకోవచ్చు. దీన్ని శిక్షించడం అంటే అజ్ఞానం నుంచి

బయటకు వచ్చి జ్ఞాని గా మారేవారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #diwali  #deepavali  #narakasura  #effigy burnt  #nandini apartments  #balayyasasthry layout
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam