DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా ఉపమాక వెంకన్న తెప్పోత్సవం.

విశాఖపట్నం, నవంబర్ 20 , 2018 (డిఎన్ఎస్ DNS Online ) : విశాఖపట్నం జిల్లాలో  à°ªà±à°°à°¸à°¿à°¦à±à°§ పుణ్య క్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం తెప్పోత్సవ

కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారి బంధుర సరస్సులో సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం

నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. కార్తీక మాసం లో జరిగే విశేష సేవల్లో క్షీరాబ్ది ద్వాదశి

రోజున నిర్వహించే à°ˆ ఉత్సవం ప్రఖ్యాతి గాంచిందన్నారు. 
దీనిలో భాగంగా సాయంత్రం శ్రీదేవీ భూదేవీ సమేతంగా రాజాధిరాజ వాహనంలోనూ సీతా రాములు మరియు శయన పెరుమాళ్

ఆంజనేయ వాహనంలోనూ వేంచేపు చేసి పుష్కరిణి వద్ద à°—à°² లంకవారి మండపం వద్దకు తీసుకుని వెళ్లారు. 
అనంతరం ఆ వేదిక వద్ద స్వామి మూర్తులకు విష్వక్సేన పూజ, పుణ్యాహ

వాచనం నిర్వహించిన తరువాత శయన పెరుమాళ్ ను చెరువు మద్యలో గల మండపం వద్దకు పడవలో తీసుకుని వెళ్ళి అక్కడ ఆరాధనలు పూర్తి చేసి తిరిగి లంకవారి మండపం వద్దకు తీసుకు

రావడం జరిగింది. అనంతరం ప్రసాద నివేదనలు తీర్ధగోష్ఠి ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణ

లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు,పి.శేషాచార్యులు, బి.సిహెచ్. గోపాలాచార్యులు, ఇల్లింద గోపాలాచార్యులు, రంగాచార్యులు,

ఇనస్పెక్టర్ చంద్రశేఖర్ సిబ్బంది ఈశ్వరయ్య, బి.వి.జి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి  à°°à±†à°‚డువాహనాలతోనూ గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు. à°ˆ తిరువీధి

సేవలో పెద్ద సమాఖ్య లో గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #venkateswara swamy #temple  #upamaka  #teppotsavam 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam