DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంపశయ్య నవీన్ కు లోకనాయక్ పురస్కారం 

విశాఖపట్నం, నవంబర్ 24, 2018 (డిఎన్ఎస్ DNS Online): ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం

అందిస్తున్నట్టు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రకటించారు. శనివారం నగరం లోని సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర

జ్ఞాన పీఠ్ అవార్డు గా ప్రసిద్ధికెక్కిన లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రతి ఏటా జనవరి 18 వ తేదీన ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి ని పురస్కరించుకుని,

ప్రముఖ సాహిత్యకారులు అందిస్తున్నట్టు తెలియచేసారు. 
అయితే ఈ ఏడాది జనవరి 19 న ( అందరికీ అనుకూలంగా ఉన్నందున) విశాఖ నగరం లోని కళాభారతి వేదికపై జరుగనుందని

వివరించారు. 
à°ˆ పురస్కారం తో పాటు రూ. లక్షన్నర నగదు బహుమానం అందించనున్నారు. à°ˆ ఏడాది à°ˆ పురస్కారం తో పాటు అదనంగా మరొక ఇద్దరు ప్రముఖులకు రూ.  50 వేల చొప్పున

సత్కరించనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ప్రముఖ సంఘసేవకులు వంశీ రామరాజు, వేగేశ్న ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మంది దివ్యంగులకు ఉచిత విద్యను అందిస్తున్న

మహనీయులు,  à°—ుంటూరు లో మహిళా విద్య కోసం శ్రమిస్తున్న.ఎన్. మంగా దేవి లకు జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నామన్నారు. à°ˆ ఏడాది ప్రత్యేకంగా బారిస్టర్ పార్వతీశం

నాటక ప్రదర్శన ఉంటుందన్నారు.  à°®à±Šà°•à±à°•à°ªà°¾à°Ÿà°¿ నరసింహ శాస్త్రి à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ బారిస్టర్ పార్వతీశం నవలను తూము శివ బృందం వారు నాటకంగా మలిచి అత్యాధునిక సాంకేతిక

పరిజ్ఞానంతో  à°ˆ పురస్కార వేదిక పై ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. 

తెలుగు సాహిత్య సేవలో నిరంతరం తరిస్తున్న అంపశయ్య నవీన్ గా ప్రసిద్ధికెక్కిన దొంగరి

మల్లయ్య కు ఈ పురస్కారాన్ని అందించాలని పురస్కార కమిటీ నిర్ణయించిందని తెలిపారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన ఈయన ఆర్థిక శాస్త్ర

అధ్యాపకునిగా విధులు నిర్వహించారు. à°°à°¾à°¸à°¿à°¨ అంపశయ్య నవలే ఈయన ఇంటిపేరుగా మారిందంటే ఈయన à°°à°šà°¨ శైలి పదును తెలుస్తోందన్నారు. 2004 లో ఈయన రాసిన కాలరేఖలు అనే నవలకు కేంద్ర

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. తదుపరి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారని వివరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఆంధ్ర యూనివర్సిటీ పాలక

మండలి సభ్యులు, లోక్ నాయక్ ఫౌండేషన్ ప్రతినిధి ఎన్. బాబయ్య పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #Lok nayak  #foundation   #award  #Ampasayya Naveen  #Kalabharati   #NTR  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam