DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం ఆంధ్ర ప్రదేశ్ : మంత్రి నారా లోకేష్

అత్యంత క్లిష్ట స్థితిలోనూ అభివృద్ధికై చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.:

విశాఖపట్నం, నవంబర్ 26, 2018 (డిఎన్ఎస్ DNS Online): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమని, ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్ర కు రావాలని   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ , ఐటి శాఖా మంత్రి నారా లోకేష్

పిలుపునిచ్చారు. సోమవారం నగరం లోని సాగరతీరం రిసార్ట్స్ లో జరిగిన ఫిక్కీ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన

మాట్లాడుతూ అత్యంత క్లిష్ట స్థితిలోనూ అభివృద్ధికై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, కేంద్రం నుంచి దమ్మిడీ సహాయం లేకున్నా కష్టించి పనిచేస్తున్నామన్నారు.

ఆర్ధికంగా అప్పుల్లోకి దింపేసి, రాష్ట్రాన్ని విడగొట్టడంతో దాదాపు శూన్యం ( జీరో) స్థాయి నుంచి పనిచేయవలసి వచ్చిందన్నారు. ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అందించిన

సహకారానికి అయన అభినందనలు తెలిపారు. 

మహిళా సాధికారతకు పెద్ద పీట :

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, విద్య,మహిళా

సాధికారత వలన సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో మొదటి నుండి మహిళా పారిశ్రామికవేత్తలు ముఖ్యపాత్ర

పోషిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారతకు ఆంధ్ర ప్రదేశ్ పెద్ద పీట వేసిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనేక పాలసీలు తీసుకొచ్చామని

వివరించారు. కొన్ని రంగాలకు మాత్రమే మహిళలను పరిమితం చెయ్యకుండా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ఫిక్కీ మహిళా సదస్సులు

నిర్వహించడం అభినందనీయమన్నారు. వీరికి అవసరమయ్యే వసతులు, వనరులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి జాప్యం లేకుండా అందిస్తామని ప్రకటించారు. 

అదే విధంగా

రాష్ట్రం లో అన్ని తరహాల పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో వనరులు ఉన్నాయని, పైగా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు  à°°à±†à°¡à± కార్పెట్ స్వాగతం

పలుకుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇతర  à°¦à°•à±à°·à°£à°¾à°¦à°¿ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం

తక్కువుగా ఉందని, కేవలం నాలుగేళ్లలోనే సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. 
ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి

మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో
నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని

వివరించారు. 

అభివృద్ధి లోనూ,సంతోష సూచికలోనూ అందరికంటే ముందు ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం

లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి

సాధించాలని, ప్రస్తుతం 11.22 శాతం వృద్ధి సాధించామని,  à°ªà±‡à°ªà°°à± లెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నామని తెలిపారు. 

ప్రతి నెల ఫైల్స్ క్లీయరెన్స్ పై ముఖ్యమంత్రి సమీక్ష

ఉంటుంది.మంత్రులుగా ఫైల్స్ క్లీయరెన్స్ పై పోటీ పడి మరీ పనిచేస్తున్నామని,  à°°à°¿à°¯à°²à± టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలను తక్షణమే

పరిష్కరించగలుగుతున్నామన్నారు. 

రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తిత్లీ తుఫాను వచ్చిన 25 రోజుల్లోనే సహాయక కార్యక్రమాలు పూర్తి చేసి,నష్ట పరిహారం కూడా

చెల్లించామని,  à°°à°¿à°¯à°²à± టైం గవర్నెన్స్ ద్వారా ప్రాణ నష్టాన్ని కూడా తగ్గించగలిగామని తెలియచేసారు. 

రాష్ట్ర ప్రజలకు ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు గా

మారబోతుందని,  à°¸à±à°Ÿà°¾à°°à±à°Ÿà± అప్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించామని, 
అంతగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని స్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఇంటికి ఇంటర్నెట్

సదుపాయం కల్పించే స్థాయికి చేరుకున్నామని ప్రకటించారు.  à°ªà±à°°à°¤à°¿ ఇంటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా కేవలం  149 రూపాయిలకు ఇంటర్నెట్, వైఫై, టెలివిజన్ అందిస్తున్నామన్నారు.

 à°¦à±‡à°¶à°‚లో ఎక్కడా లేని విధంగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి నిర్మిస్తున్నామని,  à°…ధునాతన టెక్నాలజీల అభివృద్ధి అమరావతి లో  à°œà°°à°—బోతుందని వివరించారు. రాజధాని

నిర్మాణం కోసం 40 వేల కోట్లు ఖర్చు అవుతుండ గా, . కేంద్ర ప్రభుత్వం కేవలం 1500 కోట్లు ఇచ్చిందన్నారు. అమరావతి బాండ్స్ పెడితే గంటలో 2 వేల కోట్లు సమీకరించగలిగామని,

తద్వారా అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. 

ఐటి హబ్ గా విశాఖ నగరం :

హెచ్ సి ఎల్  à°•à°‚పెనీ అధునాతన టెక్నాలజీల పై అమరావతి లో పరిశోధన మరియు

అభివృద్ధి చెయ్యబోతుంది

విశాఖపట్నం ఐటి హబ్ గా మారుతుందని, దీనికి తార్కాణంగానే గత నాలుగు ఏళ్లలో ఎన్నో అంతర్జాతీయ ఐటి సదస్సులు, హాకధాన్ లు, వాకదాన్,

ఫింటెక్ సదస్సులు నిర్వహించడమే కాక, విద్యార్థులకు పోటీలు పెట్టి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామన్నారు. విశాఖ లో ఫింటెక్ వ్యాలీ ఏర్పాటు తో ఫైనాన్సియల్

టెక్నాలజీ కంపెనీలు అన్ని విశాఖపట్నం కు వస్తున్నాయన్నారు. 

రాయలసీమ ఉత్పత్తుల హబ్ :

రాయలసీమ లోని నాలుగు జిల్లాలు తయారీ రంగానికి హబ్ గా

మారుతున్నాయని, అనంతపురం లో ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియా ఏర్పాటు అవుతుందని, కియా కంపెనీ పనుల ప్రారంభం నుండి మొదటి కారు ప్రొడక్షన్ కేవలం 15 నెలల్లో

జరగబోతుందని, ఫాక్స్ కాన్ ,సెల్ కాన్, డిక్సన్,కార్బన్ లాంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు. టీసీఎల్,రిలయన్స్

జియో,ఫ్లెక్స్ ట్రానిక్స్ లాంటి కంపెనీలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయని తెలిపారు. కర్నూలు లో అతి పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు

చేసామని తెలిపారు. 

దేశంలో విద్యుత్ చార్జీలు పెంచబోము అని ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ఎలెక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున

వినియోగించబోతున్నామని, కేవలం తొమ్మిది నెలల్లోనే  à°¨à°¦à±à°² అనుసంధానం చేసి చూపించామని, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేసామని, త్వరలోనే గోదావరి, పెన్నా

నదుల అనుసంధానం చేస్తామన్నారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ పరిశ్రమలకు, గృహ అవసరాలకు,  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ అవసరాలకు రాష్ట్రం లో నీటి కొరత లేకుండా చేయబోతున్నామన్నారు.  

ఈ సదస్సులో

ఫిక్కీ మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు  à°ªà°¿à°‚à°•à±€ ( అపర్ణ ) రెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 180 మంది మహిళా

పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #FICCI  #women industrialists  #Nara Lokesh  #Women Empowerment  #Enterprenuers   #Visakhapatnam   #Vizag  #Amaravati  #Rayalaseema

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam