DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారిజ లో వైభవంగా కార్తీక దామోదర వ్రతం 

విశాఖపట్నం, నవంబర్ 25, 2018 (డిఎన్ఎస్ DNS Online): విశాఖ సాగర తీరం లో  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుపబడుతున్న జీయర్

వేదవిద్యా పరిశోధన సంస్థ వారిజ ఆశ్రమం లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం కార్తీక దామోదర వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. సంస్థ వేదవిద్యా

అధ్యాపకులు, ఆచార్యులు శ్రీకాంత్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్రతాన్ని నిర్వహింపచేశారు. ఈ సందర్బంగా విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు

పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందారు. శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి మందిరంలో జరిగిన ఈ వ్రతం లో వేదవిద్యా అధ్యాపకులు మాట్లాడుతూ అత్యంత

పవిత్రమైన కార్తీక మాసంలో స్వామిని సేవించడం మహద్భాగ్యమని, విద్యార్థిని విద్యార్థులు సేవించడం ద్వారా ఉన్నత విద్య లభిస్తుందని, నిత్యం హయగ్రీవ స్వామి

స్తోత్రాన్ని పఠనం చెయ్యడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. తులసి మాతకు ప్రత్యేక అర్చనలు అందించారు. ప్రతి విశిష్ట సందర్బంలో ఈ ఆశ్రమం లో ఆయా సందర్భోచిత

కార్యక్రమాలను అత్యంత వైభవంగా భక్తులచే నిర్వహింపచేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ మాసం రెండవ వారం ఆశ్రమ నిర్వాహకులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిజకు

రానున్నారన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానించారు. ఈ వ్రతాన్ని ఆశ్రమ వేద విద్యార్థులు భక్తులచే ఆచరింప

చేశారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #varija  #jeeyar  #beach road #hayagreeva  #damodara vratam #karitka  #srikanth

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam