DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ మాజీ ఉద్యోగుల ఆరోగ్య భాద్యత ప్రభుత్వానిదే : ఈఏఎస్ శర్మ 

ఆరోగ్య కేంద్రం కోసం ఆవేదనతో  à°°à±‹à°¡à±à°¡à±†à°•à±à°•à°¿à°¨ సీనియర్ సిటిజన్లు 

విశాఖపట్నం, నవంబర్ 27, 2018 (డిఎన్ఎస్ DNS Online): వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవి విరమణ చేసిన

ప్రభుత్వ మాజీ ఉద్యోగుల ఆరోగ్య భాద్యత ప్రభుత్వానిదేనని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రెండవ వెల్ నెస్ కేంద్రాన్ని ఏర్పాటు

చెయ్యాలని డిమాండ్ తో మంగళవారం వారంనగరం లోని జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరైన శర్మ

మాట్లాడుతూ సుమారు మూడు పదుల కాలం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగుల ఆరోగ్య భాద్యత ప్రభుత్వానిదేనన్నారు. తక్షణం రెండవ వెల్ నెస్ ( ఆరోగ్య కేంద్రం) ఎన్ ఏ డి

కూడలి వద్ద ఏర్పాటు చేసేందుకు ఎన్ ఎస్ టి ఎల్ సంస్థ ఉచితంగా స్థలాన్ని కూడా ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర నిర్మాణానికి నిధులు కూడా కేటాయించిందని,

అయితే ఒకరిద్దరు అధికారుల జోక్యంతో ఈ ఉత్తర్వులు నిలిచిపోయాయన్నారు. నిధులు మంజూరు చేసిన వెంటనే అనుమతులు వచ్చినట్లయితే ఈపాటికి పెద్ద పెద్ద భవనలే నిర్మితమై,

పూర్తిస్థాయి ఆసుపత్రి వచ్చి ఉండేదన్నారు. తక్షణం à°ˆ  à°¸à±€à°¨à°¿à°¯à°°à± సిటిజన్ల ఆవేదన అర్ధం చేసుకుని, à°ˆ కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. 

ఆల్ సెంట్రల్

గవర్నమెంట్ ఎంప్లొయీస్ పెన్షనర్లు సంఘం విశాఖ కేంద్రం  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి à°Žà°‚. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తమకు సిజిహెచ్ ఎస్ కేంద్రం  à°ªà±‡à°°à°¿à°Ÿ à°’à°• వెల్ నెస్

కేంద్రాన్ని విశాఖ లో ఒకటి తూతూ మంత్రం గా నడుపుతున్నారని, అయితే ఇక్కడ ఏ విధమైన సదుపాయాలు లేవని, కేవలం ఒక సిరెంజి కూడా అందుబాటులో లేదన్నారు. వేలాది మంది

పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఇక్కడే వైద్య పరీక్షలు, చికిత్సలు అందించవలసి యుండగా కేంద్ర ప్రభుత్వం పూర్తి భాద్యత రాహిత్యం వహించిందన్నారు. అందుకే మరో

వెల్ నెస్ కేంద్రాన్ని విశాఖ లో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో మంగళవారం ఉదయం  à°µà°¿à°¶à°¾à°– మునిసిపల్ కార్యాలయం ఎదురుగ à°—à°² గాంధీ విగ్రహం వద్ద శాంతియుత

ధర్నా చేపట్టామన్నారు. 

మాకు ఆరోగ్య శ్రీ వర్తించదు :
విశాఖ వెల్నెస్ కేంద్రం పరిధిలో ప్రస్తుతానికి 6226 మంది సభ్యులున్నారని, వీరి కుటుంబ సభ్యులతో సహా

 à°¸à±à°®à°¾à°°à± 16 వేల మంది  à°¸à°­à±à°¯à±à°²à± ఒకే కేంద్రం లో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సియుందన్నారు. వీరెవ్వరికీ ఆరోగ్య శ్రీ పధకం గానీ, కేంద్ర ప్రభుత్వం అందించే మరే

విధమైన వైద్య సదుపాయం గానీ, ఇతర వైద్య కేంద్రాల్లో సేవలు పొందే అవకాశం లేదని, అవి పొందాలంటే నిపుణులైన ప్రభుత్వ వైద్యుల అనుమతి అవసరమన్నారు. వీరెవ్వరూ తమకు

అందుబాటులో ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై సానుకూల భావాన్ని ప్రదర్శించి మరో వెల్నెస్ కేంద్రాన్ని, పూర్తిస్థాయి

వైద్య సదుపాయాలతో అందుబాటులోకి రావాలన్నారు. à°ˆ సమావేశం లో కేబీఆర్ ప్రసాద్, జె. జనార్ధన రావు, బి వి à°Žà°‚ మూర్తి, శాస్త్రి, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 

/>  

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #central government  #employees  #protest  #CGHS  #wellness centre  #GVMC gandhi  #EAS Sarma

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam