DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేవీ డే కోసం సాగర తీరం లో 29 నుంచి విన్యాసాల సాధన 

విశాఖపట్నం, నవంబర్ 27, 2018 (డిఎన్ఎస్ DNS Online): డిశంబర్ 4 వ తేదీన భారతీయ నావికా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టే సాహస విన్యాసాల సాధనను రెండు రోజులు

నిర్వహిస్తున్నట్టు తూర్పు నావికాదళ అధికారులు ప్రకటించారు. దీనిలో భాగం à°—à°¾ విశాఖపట్నం సాగర తీరం లోని రామకృష్ణ బీచ్ లో à°ˆ నెల 29 à°¨ గురువారం సాయంత్రం  
4 గంటల నుంచి

6 గంటల వరకు, తిరిగి డిశంబర్ 3 వ (సోమవారం) తేదీన ఇదే సమయానికి నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది తమ శక్తి సామర్ధ్యాలను బహిర్గత పరిచే ప్రక్రియ లో భాగంగా డిశంబర్ 4 వ తేదీన

సాయంత్రం భారీ శక్తివంతమైన సాయుధ బలగాలు, యుద్ధ నౌకలు సాగర తీరం లో విన్యాసాలు చేయనున్నాయి. 

నగర వాసులకు సూచన: ఈ ప్రదర్శనలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు

వచ్చే నగరవాసులకు తూర్పు నావికాదళ అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. బీచ్ కు వచ్చే సందర్శకులు తమ వెంట ఎటువంటి తినిబండారాలు తీసుకు రాకూడదు. తద్వారా

వీటికోసం పశు పక్ష్యాదులు ఈ ప్రాంతంలోకి తిరుగాడే అవకాశం ఉంది. అవి వచ్చినట్లయితే సహస విన్యాసాలు చేసే యుద్ధ, నావికా దళ విమానాయాలకు అంతరాయం కలుగుతుందని

తెలిపారు. నగర వాసులు సహకరించవలసినదిగా కోరుతున్నారు. 

pix courtesy : Indian Navy

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #indian navy  #navy  #navy marathon #navy day

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam