DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్గశిర మాసోత్సవాలకు హంగామా ఆరంభం. . . .

ఆలయ మాజీ కమిటీలకు అడ్డుకట్ట పడేనా ?

విశాఖపట్నం, నవంబర్ 27, 2018 (డిఎన్ఎస్ DNS Online): ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షిక

మాసోత్సవాలు అత్యంత వైభవంగా మార్గశిర మాసాంతం నిర్వహించడం ఆనవాయితీ à°—à°¾ వస్తోంది. నెల రోజుల పాటు జరిగే  (డిశంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి) à°ˆ ఉత్సవాల్లో

పాల్గొని అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది. ప్రత్యేకించి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు అధిక సంఖ్యలో

వస్తుంటారు. వీరందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేస్తుంది. సాధారణ రోజుల్లో భక్తులపై అధికార దర్పం ప్రదర్శించే ఆలయ సిబ్బందికి

అడ్డుకట్ట వేసే విధంగా ఈ మార్గశిర మాసోత్సవాల నిర్వహణను జిల్లా యంత్రాంగం తమ చేతిలోకి తీసుకుంటుంది. దీంతో ఆలయ సిబ్బంది సైతం వారి ముందు చేతులు కట్టుకోవాల్సి

వస్తుంది. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులకు అందుబాటులో ఉంటూ, వారికి సౌకర్యాలు అందించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఇచ్చే

ఆదేశాలు ఒకటైతే, వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సిబ్బంది తీరును భక్తులు తప్పు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు అందుబాటులో ఉంటూ, వారి

అభిప్రాయాలను తెలుసుకుంటున్న ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి కి భక్తులు అభినందనలు తెలియచేస్తున్నారు. అయితే ఆలయ సిబ్బంది తీరుమాత్రం మార్చుకోవాల్సిన

అవసరం ఉండనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

మార్గశిరం అంతా కలెక్టర్ ఆధీనంలోనే :

భక్తులు వ్యక్తం చేస్తున్న ఆరోపణలు, ఆలయ కార్యనిర్వహణాధికారి

విజ్ఞప్తి మేరకు మార్గశిర మాసోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ, యంత్రాంగానికి ఆదేశాలు జరీ చేశారు. దీనికి

అనుగుణంగానే మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆలయ నిర్వహణ కమిటీ ఏర్పాటు, కార్యాచరణ పై సమీక్ష జరిపారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆలయ ఈఓ

జ్యోతి మాధవి, మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరి నారాయణన్ , డీసీపీ ( పోలీస్) రమేష్ కుమార్, ఏసీపీ ( పోలీస్) కె. ప్రభాకర్, రంగరాజు, ఇతర విభాగాల

అధికారులు పాల్గొన్నారు. 

మాజీ కమిటీలకు అడ్డుకట్ట పడేనా ?

శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ధర్మకర్తల మండలి పదవి కాలం ఇటీవలే ముగిసి, రద్దు అయినందున,

ప్రస్తుతం పాలక మండలి లో కేవలం ఈఓ మాత్రమే నిర్వహణ భాద్యతలను చేపట్టవలసి యుంది. అయితే గతం లో ఈ ఆలయానికి పాలకమండలి సభ్యులుగా పనిచేసిన వారంతా అధికార పార్టీకి

చెందిన వారు కావడంతో వారి అధికార జులుం ప్రదర్శించడం అధికారం గా ఉండడం గతం లో భక్తులు, అధికారులు ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ పర్యాయం వారెవరికీ పాలక మండలి

సభ్యులు కాక పోయినా వారు తమ అధికార పరపతిని వినియోగించే అవకాశం ఉంది. దీంతో తమ అనుయాయులను వందల సంఖ్యలో ఆలయం లోకి నేరుగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. దీంతో

సామాన్య భక్తులు ఇబ్బందులు పడతారు. à°ˆ పర్యాయం జిల్లా యంత్రాంగం వీరికి అడ్డుకట్ట  à°µà±‡à°¸à±‡ అవకాశం ఉందా ? లేక వాళ్ళు కూడా అనధికార పాలకమండలి సభ్యులకు  ( సూడో పెద్దలు),

దాసోహం అంటారో చూడాలి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam