DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశీ గడ్డపై తెలుగు తల్లి విజయ విహారం : వంగూరి చిట్టెన్ రాజు 

మెల్ బోర్న్, నవంబర్ 28 ,2018 (DNS Online ): భారత దేశం లోనే కాక విదేశీ వేదికలపై, ఖండాంతరాల్లోనూ తెలుగు భాష, సాహిత్యం విజయ విహారం చేస్తోందని ప్రముఖ సాహిత్యకారులు, తెలుగు భాషా

అభివృద్ధి సమన్వయకర్త వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా లో దిగ్విజయంగా నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు, రానున్న కాలం లో

ఖండాంతరాల్లో చేపట్టే సాహితీ సదస్సులపై  à°…యన ప్రత్యేకంగా DNS Online కు తెలియచేసారు. 
ఈ నెల మొదటి వారంలో అత్యంత వైభవంగా మెల్ బోర్న్ లో 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా జరిగి పలురకాలుగా తెలుగు సాహిత్య చరిత్రలో మరొక నూతన అధ్యాయానికి నాందీ పలికిందని తెలిపారు.  

à°ˆ సదస్సు ఆస్ట్రేలియా ఖండంలోనే  à°œà°°à°¿à°—à°¿à°¨

మొట్టమొదటి సాహితీ సదస్సు కాగా, మరొక కారణం తెలుగు భాషా సాహిత్యాలకి సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించి ఆ వెన్నెలని వెదజల్లే ప్రస్థానం లో

భారత ఉప ఖండం, అమెరికాఖండం, ఐరోపా ఖండం, దక్షిణ ఆసియా ఖండాల తరువాత ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండంలో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా నిర్వహించబడడం కూడా మరొక

కారణం. 

à°ˆ సదస్సుకు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• ఆకర్షణగా భారత ఉపరాష్ట్రపతి ముప్పర్తి వెంకయ్య నాయుడు గారి విడియో సందేశ ప్రసారం కాగా,  à°®à±†à°²à± బోర్న్ &మలేషియా ప్రాంతాలలో

బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న 17 మంది తెలుగు ఉపాద్యాయుల సత్కారం చేయడం జరిగిందన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీని కట్టా దేశ విదేశాల

ప్రతినిధులకి స్వాగతం పలకగా ,  “అవధాన సరస్వతి” à°¡à°¾. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సంస్కృతంతో సహా ఇతర భాషల పదాలు లేకుండా అచ్చ తెనుగు సొగసుని సోదాహరణంగా వివరించి

సభికులని అలరించారు. 

కేంద్ర సాహిత్య ఎకాడెమీ ప్రధాన కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస రావు గారు తెలుగు భాషా సాహిత్యాలకి ఎకాడెమీ అనేక దశాబ్దాలగా

అమలుచేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలని వివరించారు. à°ˆ సందర్భంగా సాహిత్య ఎకాడమీ వారు “అర్ధ శతాబ్దిలో లో అమెరికా తెలుగు à°•à°¥- 1964 - 2014”అనే చరిత్రాత్మక ప్రాధాన్యత

కలిగిన గ్రంధ ప్రచురణకి సంస్థాగత నిర్ణయం తీసుకుని, ఆ గ్రంధానికి ప్రధాన సంపాదకులుగా వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా) & సి. మృణాళిని (హైదరాబాద్) లని నియమించినట్టు

ప్రకటించారు. ప్రముఖ పాత్రికేయులు అప్పరసు కృష్ణారావు (ఢిల్లీ),తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ (హైదరాబాద్) ,సతీష్ వరదరాజు (సిడ్నీ) సముచిత

ప్రసంగాలు చేయగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ డేనియల్ నెజేర్స్ 2020 లో పారిస్ లో ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో ఇటువంటి సమావేశం నిర్వహించాలని తలపెడుతున్నట్టు

వెల్లడించారు. ఆకెళ్ళ రాఘవేంద్ర తెలుగు సాహిత్యం తనకి జీవితానికి ఇస్తున్న స్ఫూర్తి మీద ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. 

శాయి రాచకొండ (హ్యూస్టన్)

నిర్వహణలో కవితాస్త్రాలయ -2018” చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రంధం పుస్తకావిష్కరణ  à°œà°°à°¿à°—ింది. 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా చేపట్టిన ప్రచురణలు :

అమెరికట్టు కథలు (వంగూరి చిట్టెన్ రాజు), సరికొత్త వేకువ & నాట్య భారతీయం (కోసూరి ఉమా భారతి), తీపి గుర్తులు (శంకర నారాయణ), వంశీ ప్రచురణలు కొత్త కథ 2017, కొత్త కథలు -2018, నేల మీద

జాబిలి -అక్కినేని -బాలు శతగీత లహరి,  à°°à°¾à°® చంద్రమౌళి రచనలు (కాల నాళిక, మొదటి చీమ, తపస్సు), వడ్డేపల్లి కృష్ణ విరచిత శాంతి కవాటం & బాసర సరస్వతి మహిమ డీవీడీ, మారిషస్ వారి

అన్నమయ్య పద కోశం పుస్తకాలు à°ˆ సదస్సులో ఆవిష్కరించబడ్డాయి.  à°¸à°¦à°¸à±à°¸à± కు  à°µà°¿à°šà±à°šà±‡à°¸à°¿à°¨ ప్రతినిధులు అందరికీఆవిష్కరించబడిన పుస్తకాలతో సహా ఎనిమిది తెలుగు పుస్తకాలు

ఉచితంగా బహుకరించబడ్డాయి.

తదనంతరం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 23వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతలు గా నిలిచిన ఆస్ట్రేలియా తెలుగు రచయితలు రమాకాంత్

రెడ్డి (మెల్ బోర్న్) శారద మురళి (సిడ్నీ) లకి ప్రశంసా పత్రం నగదు బహుమతి సభా ముఖంగా అందజేయబడ్డాయి. తన నగదు బహుమతిని తిరిగి వంగూరి ఫౌండేషన్ వారికే విరాళంగా ఇచ్చి

రమాకాంత రెడ్డి సభికుల అభినందనలు అందుకున్నారు. à°† సదస్సులో ప్రసంగ వేదికలు ఆయా దేశాలకి ప్రత్యేకం à°—à°¾ కేటాయించి సదస్సులు నిర్వహించామన్నారు.  
పాల్గొన్న

సాహితీ వేత్తలు : రెండు రోజులలోనూ నాలుగు ఆస్ట్రేలియా ప్రసంగ వేదికలలో మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, కెన్బేరా, అడిలైడ్, మొదలైన నగరాల నుండి శ్రీ కృష్ణ రావిపాటి,

అరుణ నిమ్మగడ్డ,  à°µà±‡à°£à±à°—ోపాల్ రాజుపాలెం, ఉమా మహేష్ శనగవరపు, రమాకాంత్ రెడ్డి, శివశంకర్ పెద్దిభొట్ల, సారధి మోటమఱ్ఱి, ఉషా శ్రీదేవి శ్రీధర, నాగేందర్ రెడ్డి కాసర్ల,

వేణుగోపాల్ రాజుపాలెం, యోగి వాల్హాతి, రుద్ర ప్రసాద్ కొట్టు, విజయ మాధవి గొల్లపూడి, అను మునుగంతి, శారద మురళి, సి,వి.రావు, మురళి ధర్మపురి, చారి ముడుంబి, భాస్కర రావు

సరిపల్లి, మల్లిక్ రాచకొండ, ఊటుకూరి సత్యనారాయణ  à°®à±Šà°¦à°²à±ˆà°¨ వారు అనేక అంశాల మీద ప్రసంగించారు. వాటిల్లో భాషా శాస్త్ర పరంగా ఉమా మహేష్ శనగవరపు (58 తెలుగు అక్షరమాల

రహస్యాలు, వాటిని కాపాడుకోవలసిన ఆవశ్యకత, సులభంగా నేర్పే చిట్కాలు) ఉన్నత స్థాయిలో ఉంది. మురళి ధర్మపురి కవితలు, యోగి వాల్హాతి à°•à°¥ సృజనాత్మకత  à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°‚, రమాకాంత్

రెడ్డి ప్రసంగం సభికులని ఆకట్టుకున్నాయి. ఊటుకూరి సత్యనారాయణ గారి సినీ సమాచార సమగ్ర సేకరణ, ప్రచురణ, చిత్త శుద్ధి సభికులని ఎనలేని ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని

కలిగించాయి. ఆయన దశాబ్దాల కృషిని సారధి మోటమర్రి గారి సభికులకి సవివరంగా తెలియజేయడం ముదావహం. ఒక కేసీఆర్ గారి అనుచరుడిగా తెలంగాణా లో తెలుగు నేపధ్యంతో

నాగేందర్ రెడ్డి కాసర్ల ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. 
ఆయా ఆస్ట్రేలియా వేదికలని వడ్డేపల్లి కృష్ణ, అప్పరసు కృష్ణా రావు, భారతి కందిమళ్ళ, రావు కొంచాడ

సమర్ధవంతంగా నిర్వహించారు. 

ఇక భారత దేశం రచయితల ప్రసంగాలకి కేటాయించిన రెండు వేదికలలో గ్రంధాలయాల పాత్ర మీద భారతి కందిమళ్ళ గారి సాధికార ప్రసంగం,  à°²à°²à°¿à°¤

సంగీత వికాసం మీద వడ్డేపల్లి కృష్ణ వివరణాత్మక ప్రసంగం, భారతంలో దాంపత్య సంయమనం మీద ప్రభల జానకి సోదాహరణ ప్రసంగం, తెలంగాణా మహిళా కవిత్వం మీద సమర్ధవంతంగా విహంగ

వీక్షణం చేసిన ప్రొఫెసర్ త్రివేణి వంగారి ప్రసంగం, యోగ శాస్త్రాన్ని, సాహిత్యాన్ని అన్వయిస్తూ రాపర్తి శ్రీను ప్రసంగాలకి మంచి స్పందన లభించింది.  à°µà°‚శీ రామరాజు

గారి సుదీర్ఘ ప్రస్థానంలో సుమారు వంద మంది సాహితీ స్రష్టలతోతన వ్యక్తిగత పరిచయాలలో కొందరితో సానిహిత్యాన్ని సభికులతో పంచుకున్నారు. మరో రెండేళ్ళ తర్వాత 7 వ

ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు న్యూజీలాండ్ లో నిర్వహించాలని సభికుల నుంచి వినతులు వచ్చాయన్నారు. 

ఆకట్టుకున్న ఆకెళ్ళ :

ప్రముఖ పుస్తక సంచాలకులు,

విశ్లేషకులు, సివిల్స్ శిక్షణ సంస్థ నిర్వాహకులు ఆకెళ్ళ రాఘవేంద్ర నిర్వహణలో జరిగిన సాహితీ సదస్సులో మారిషస్ కు చెందిన సంజీవ నరసింహ అప్పడు మారిషస్ దేశంలో

 à°¤à±†à°²à±à°—ు భాష, సాహిత్య, సంస్కృతుల వికాసంపై సమగ్రమైన ప్రసంగం చేశారు. రెండేళ్ళ తరువాత జరిగే 7à°µ ప్రపంచ సాహితీ సదస్సు మారిషస్ లో నిర్వహించడానికి ఆసక్తి

వెలిబుచ్చారు. నాలుగు తరాలుగా విదేశాల్లోనే అక్కడే నివాసం ఉంటూ, మాతృ దేశాన్ని, మాతృ భాషను విస్మరించకుండా తెలుగు నేల పై నివసించే వారికంటే అత్యద్భుతమైన తెలుగు

భాషను ఆచరిస్తున్న మారిషస్ వాసులకు ప్రపంచ తెలుగు సదస్సు అభినందనలు తెలిపింది. 

మలేషియా నుంచి డా. అచ్చయ్య కుమార్ రావు గారి నాయకత్వంలో వచ్చిన 29 మంది

బృందం...అందులో ఉన్న ఐదో తరం తెలుగు చిన్నారి బాల బాలికలు. ఉదయశ్రీ చదలవాడ శిక్షణ లో వారు గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయ కవిత ఆలాపన, కరుణ శ్రీ జంధ్యాల

పాపయ్య శాస్త్రి గారి తెనుగు తల్లి కవిత, అన్నింటికీ పరాకాష్టగా మలేషియా తెలుగు వారి మూడు వందల ప్రవాస జీవితాన్ని ముగ్గురు పదేళ్ళ ఐదో తరం మలేషియా తెలుగు

అమ్మాయిలురేఖ సరికొండ శిక్షణ లో బుర్ర కథ రూపంలో చేసిన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ బుర్ర కథ కి, తెలుగు భాషా సాహిత్యాలని కాపాడుకోవాలి అని ఆ

మలేషియా వారికి ఉన్న తపనకీ సభికులు చలించిపోయారు. అప్పటికప్పుడు ప్రభల జానకి గారు, యార్లగడ్డ వారు ఆ ముగ్గురికీ ఒక్కొక్కరికీ వంద డాలర్లు బహుమతి అందజేశారు. డా.

అచ్చయ్య కుమార్ రావు గారు ఎంతో హుందాగా, సవినయంగా, మలేషియాలో తెలుగు కోసం తాము చేస్తున్న కృషిని వివరిస్తూ, సుమారు 5 మిలియన్ డాలర్ల వ్యయంతో  à°¯à°¾à°µà°¤à± ప్రపంచంలో

విదేశాలలో మరెక్కడా లేని విధంగా à°’à°• నాలుగు అంతస్తుల తెలుగు భవన నిర్మాణం కౌలా లంపూర్ లో పూర్తి చేసినట్టు ప్రకటించారు.  à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ మలేషియా ప్రధాన మంత్రి స్వయంగా

à°… తెలుగు భవనాన్ని జాతికి అంకితం చేస్తారు అని ప్రకటించారు. ఇంతటి ప్రగాఢమైన ప్రకటనలకి మెల్ బోర్న్ లో జరిగిన 6à°µ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు  à°µà±‡à°¦à°¿à°• కావడం

ముదావహం. 

à°ˆ సదస్సులో రెండవ రోజు ప్రారంభ వేదికలో జరిగిన “అచ్చ తెనుగు కుదించిన కుదురాట”..అంటే  “లఘు అవధానం”. సమయాభావం వలన పూర్తి స్థాయి అవధానానికి అవకాశం

లేదు కాబట్టి, సభికులకి అచ్చ తెనుగు అవధాన ప్రక్రియని ఆస్ట్రేలియాలో తొలి సారిగా  à°ªà°°à°¿à°šà°¯à°‚ చెయ్యడానికి శతావధాన సరస్వతి à°¡à°¾. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు

సంకల్పించారు. ఈ ప్రక్రియలో రావు కొంచాడ రావు సంచాలకులు గానూ, రమాకాంత్ రెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, ప్రసాద్ పిల్లుట్ల, ఉమా మహేష్ శనగవరపు, వేణుగోపాల్ రాజుపాలెం

“అడుగరి”..అంటే పృచ్చకులుగా పాల్గొన్నారు. మొదటి దత్త పది పదాలు అస్ట్రేలియా, మెల్ బోర్న్, ఇండియా, ఢిల్లీ ...రెండో దత్త పది పదాలు, వంగూరి, తాయ్ (Telugu Association of Australia), లోక్

నాయక్,సదస్సు.... వీటన్నింటినీ అవధాని పాలపర్తి గారు అలవోక à°—à°¾ పూర్తి చేసి అచ్చ తెనుగు ఔన్నత్యాన్ని ప్రతినిధులకి మరొక సారి గుర్తు చేశారు. 

ఈ సదస్సులో మరొక

ఆసక్తి కరమైన విశేషం శాయి రాచకొండ నిర్వహణలో జరిగిన “కథా పూరణ పోటీ”. ఇందులో ప్రసిద్ద రచయిత సత్యం మందపాటి గారి à°•à°¥ à°’à°•à°Ÿà°¿ తీసుకుని , అందులో ఆఖరి పేరాలు

“కత్తిరించేసి” , మొదటి కొన్ని పేరాలు మాత్రమే ప్రతి నిధులకి ముందు రోజు ఇచ్చారు శాయి గారు. ఆసక్తి ఉన్న వారు à°† రోజు రాత్రి à°† కథని వారికి తోచిన రీతిలో “పూర్తి”

చేసి మాకు ఇస్తే..అవి అన్నీ చదిబి ఈ కథా పూరణ బావుందో వారికి ఒక చిన్న బహుమతి ఇస్తాం అని శాయి గారు ప్రకటించారు. ఈ సదస్సులో ఈ కథా రచన పోటీకి అనూహ్యంగా 18 మంది

స్పందించారు. అంతకంటే ఆశ్చర్యం ...మలేషియా నుంచి వచ్చిన వారిలో 15 ఏళ్ల లోపు ఐదో తరం అమ్మాయిలు పాల్గొన్నారు....అయితే బహుమతి గెల్చుకున్న వారు ఆకెళ్ళ రాఘవేంద్ర.

 (హైదరాబాద్) ,  à°µà°¿à° à°²à± (అమెరికా). 
ఈ 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి పరాకాష్టగా తన 1963 లో తన 35వ ఏట ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి, స్థిర పడిన తొలి ఆస్ట్రేలియా తెలుగు

ప్రవాసి, ఆస్ట్రేలియా తొలి తెలుగు సంఘం అయిన సిడ్నీ తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు వాహిని పత్రిక ప్రారంభకులు, రేడియో ప్రయోక్త, శతాధిక నాటక రచయిత, డా.

దుర్వాసుల మూర్తి (వయసు 90 ) & మంగళ దంపతులకి కర్పూర దండలు, దుశ్శాలువా, కిరీటం, నగదు పురస్కారాలతో పాటు ఆకర్షణీయమైన సన్మాన పత్రం, పుష్పాభిషేకాలతో  à°œà±€à°µà°¨ సాఫల్య

పురస్కారం అత్యంత వైభవంగా జరిగింది. 
తన ముగింపు ఉపన్యాసం లో “పద్మభూషణ్” à°¡à°¾. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కేసీఆర్ నాయకత్వంలో తెలుగు భాష పట్ల తెలంగాణా

ప్రభుత్వ విధాలని ప్రశంసిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ నిరాదరణ పట్ల విచారం వ్యక్తం చేశారు. 
ఈ మెల్ బోర్న్ సదస్సు ప్రణాళిక, ఆచరణ, నిర్వహణలలో అత్యంత ప్రతిభ,

ఆసక్తి, అనురక్తి చూపిస్తూ à°ˆ సదస్సు à°…à°–à°‚à°¡ విజయానికి కారకులైన అనేక మంది కార్య కర్తలలో  à°†à°¸à±à°Ÿà±à°°à±‡à°²à°¿à°¯à°¾ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీని కట్టా& లత, కార్యదర్సి à°¡à°¾. శ్రీ

గుళ్ళపల్లి & కవిత, రావు కొంచాడ & ప్రత్యూష దంపతులు, అప్పటికప్పుడు అన్ని విషయాలూ అట్టే ఆకట్టుకుని అలవోకగా అన్నీ సవ్యంగా నిర్వహించిన ఆత్మీయురాలు షర్మిల చుక్క

అజిత్, నమోదు బల్ల దగ్గర అంతా తానే అయిన లక్ష్మి, ప్రియాంక, ....వంశీ రామరాజు గారి à°…à°‚à°•à°¿à°¤ భావం....à°’à°•à°°à°¾, ఇద్దరా .. పేర్లు తెలియని  à°…నేక మంది స్వచ్చంద సేవకులు, మంచి భోజన

సదుపాయం చేసిన బిర్యానీ మహల్ మిత్రులు, ఆడియో & విడియో ఏర్పాట్లు చేసిన వారు,...సదస్సుకు సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam