DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరం లో అసామాన్య ఆభరణాల విక్రయ ప్రదర్శన 

విశాఖపట్నం, నవంబర్ 30 ,2018 (డి ఎన్ ఎస్ DNS Online ): విశాఖ సాగర తీరం లోని ఓ హోటల్ లో అత్యంత విలువైన అసామాన్య ఆభరణాల విక్రయ, ప్రదర్శన ప్రారంభమైంది. శుక్రవారం యునైటెడ్

ఎగ్జిబిషన్ నేతృత్వం లో యు ఈ డి జ్యువెలరీ ప్రదర్శన పేరిట అమూల్య వజ్ర , సువర్ణ ఆభరణాలను నగర వాసుల సందర్శన కై ప్రవేశపెట్టారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనను

విశాఖ వాసులకై ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు మనో కుమార్ తెలిపారు. విశాఖ లో ఈ ప్రదర్శన 6 వ సారి నిర్వహిస్తున్నామన్నారు. సీజన్ కు అనుగుణంగా అన్ని తరహాల ఆభరణాలు

ఉన్నాయని, ప్రత్యేక డిజన్లను అర్దార్లపై కూడా అందించడం జరుగుతుందన్నారు. సుమారు 45 మంది కి పైగా ఆభరణ ఉత్పత్తి దారులు, రీటైలర్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రదర్శన

లో తేవా, మీరాకారి, సోల్కర్, కుందాం, యాంటిక్, తదితర విలువైన, స్టోన్ నగలు, జెమ్ సెట్. ఫ్యాషన్, సిల్వర్, డైమండ్ గిఫ్ట్ ఆర్టికల్స్, తదితర ఆభరణాల తో పాటు వివాహాది

శుభకార్యక్రమాలకు సరిపడా మెరుగైన మేలిమి ఆభరణాలను అందుబాటులో ఉంచామన్నారు. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #diamond expo #hotel novatel

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam