DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంపీ హరిబాబు తీరు బీజేపీ పార్టీకే నచ్చలేదా ? అభ్యర్థి మార్పు అందుకేనా 

విశాఖపట్నం, డిసెంబర్ 1, 2018 (డిఎన్‌ఎస్‌): డాక్టర్ కంభంపాటి హరిబాబు, ప్రస్తుతం విశాఖ లోక్ సభ సభ్యులు, à°—à°¤ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన అభ్యర్థి.

అయితే ఎవ్వరూ ఊహించనటువంటి ఈ మహత్తర అవకాశాన్ని ఆయన పూర్తిగా కాలరాసుకున్నారు అనే చెప్పాలి. తనకి వచ్చిన ఎన్నో గోల్డెన్ ఛాన్స్ లను ఆయన చేజేతులా వదులుకున్నారు.

బీజేపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ప్రాచుర్యం కల్పించేందుకు వచ్చిన అవకాశానను ఆయన ఏనాడూ సద్వినియోగం చేసుకోలేదు. ఒక గిరిజన యూనివర్సిటీ వచ్చిన, ఐఐఎం వచ్చినా,

ఐఐటి వచ్చినా ఈయన ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించకుండా పూర్తిగా భాద్యత రాహిత్యం వహించారు అనే కారణంగా 2019 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈయన

అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కమిటీ కనీసం ఖాతరు కూడా చెయ్యలేదు. ఈ స్థానంలో సాగి కాశీ విశ్వనాధరాజు పేరు ప్రకటించడం గమనార్హం. అయితే తేలుస్తారా లేదా అనేది

ప్రధానం కాదు, కనీసం ఎంపీ హరిబాబు వైఖరి బీజేపీ కేంద్ర కమిటీ కి నచ్చకపోవడమే కారణంగా ఆయన సిట్టింగ్ ఎంపీ గా ఉన్న స్థానం లో సాధారణ కార్యకర్తను ఎంపీ అభ్యర్థిగా

ప్రకటించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చెయ్యగా, వ్యతిరేక వర్గం పండగ చేసుకుంటోంది. 

పార్టీకి ప్రజాదరణ లభించే అంశాలను కూడా ఈయన లెక్క పెట్టకుండా

బేఖాతరు చెయ్యడం గమనార్హం. విభజన హామీల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన హామీలను నెరవేర్చినట్టు కేంద్ర కమిటీ, కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి మరీ

ప్రసంగాల్లో ఊదరగొడుతుంటే, ఇక్కడే స్థానిక ఎంపీగా ఉన్న హరిబాబు నోరు ఎత్తక పోవడం పై పార్టీలో పూర్తి వ్యతిరేకత వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన

వారే వ్యతిరేకులు కారు, పార్టీకి మద్దతుగా నోరెత్తని వారు కూడా పార్టీ వ్యతిరేకులు అనేది బీజేపీ కేంద్ర కమిటీ తేల్చేసింది. ఇదే విధంగా ఈయన తీరు ఉంటె. . రానున్న

కాలంలో జనం ఈయన పేరుకూడా మరిచిపోయే అవకాశాలున్నాయని ఆయనకు అత్యంత సన్నిహిత కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయన్నే నమ్ముకున్న తమ భవిష్యతు ఏంటో

తెలియక వీరంతా సతమతమవుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు లభించాయంటే అది ఆ పార్టీకి ప్రపంచాన్ని

జయించినంత విజయంగా చెప్పవచ్చు. అలాంటిది విశాఖపట్నం, నర్సాపురం లోక్ సభ స్థానాలను గెలుచుకుంది అంటే అది కేవలం తెలుగుదేశం మద్దతు తోనే అని చెప్పాల్సియుంటుంది.

అయితే విశాఖపట్నం నుంచి ఎన్నికైన డాక్టర్ కంభంపాటి హరిబాబు, ఈ విషయం లో తెలుగుదేశం పార్టీకి పూర్తి కృతఙ్ఞతగానే ఉన్నట్టున్నారు అన్నది వాస్తవం. ఈ విషయం ఆయన వెనక

తిరిగే అత్యంత సన్నిహితుల వాక్యమే. రాష్ట్ర విభజన తదుపరి ఈయన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ శాఖకి అధ్యక్షునిగానూ పనిచేశారు. అయితే ఈయన వల్ల పార్టీకి జరిగిన పెద్ద

ఘనకార్యాలు చెప్పుకోదగ్గవి లేనేలేవు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  à°ˆà°¯à°¨à°•à± మద్దతు

తెలపడానికి ప్రధాన కారణం. పైగా బీజేపీ, తెలుగుదేశం లు మైత్రి తెగిపోయిన తర్వాత హరిబాబు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం గానీ, కనీసం తమ పార్టీ పై

నిస్సిగ్గుగా విరుచుకు పడుతున్న అణా కి కాణీ కి కొరగాని గల్లీ స్థాయి తెలుగుదేశం కార్యకర్తలపై కూడా విమర్శలు చెయ్యక పోవడం పార్టీ అధిష్టానాన్ని విస్మయానికి

గురిచేసింది. గతంలో నాటి కీలక నేత వెంకయ్య నాయుడు పార్టీ లో ఉన్నంతవరకూ హరిబాబు హవా కొనసాగింది, ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లిన నాటి నుంచి హరిబాబు అండ్ కో కు

గడ్డుకాలమే ఎదురవుతోంది అనడానికి ఇదే నిదర్శనం. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #sagi  #viswanadha raju  #haribabu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam