DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్షల్లో జీతాలు, లెక్కలేని జీవితాలు, ఓటింగ్ కి దూరంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ?

హైదరాబాద్, డిశంబర్ 6 , 2018 (DNS Online ): భారత దేశం అత్యధిక వేగంగా పరుగులు పెట్టడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సాఫ్ట్ వేర్ రంగం. ఈ రంగంలో సిబ్బంది చేసే ప్రయోగాలు, పరిశోధనలతో

దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు లభిస్తున్నాయి. ఈ రంగంలో విధులు నిర్వహించే వారికి నెలసరి వేతనాలు కూడా లక్షకు పైగానే ఉంటుంది ( ఎక్కువ మందికి). ఈ దేశాన్ని

శాసిస్తున్న వీరికి ఈ దేశం పట్ల ఏమాత్రం భాద్యత ఉన్నట్టుగా కనపడడం లేదు. ఇది గత కొన్నేళ్లుగా నిరూపితమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో శాసన సభలకు జరుగుతున్న

సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనవలసి భాద్యత పౌరులుగా ప్రతి ఒక్కరికీ ఉంది. పైగా అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిపై మేధావులు, విద్యావంతులు,

ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏమాత్రం భాద్యతయుతంగా వ్యవహరించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన సాఫ్ట్

వేర్ ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనేందుకు సుముఖంగా లేరు. దీనికి వారు చెప్తున్నా ప్రధాన కారణం పోలింగ్ రోజు న సెలవు లభించడం లేదు అని. వీళ్లల్లో చాలా మందికి

ఓట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి à°Ÿ, వీళ్ళేమో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారుట. అక్కడికి వెళ్లాలంటే సాఫ్ట్ వేర్ సంస్థలు సెలవు ఇవ్వడం లేదుట. 

మరి

ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎందుకు పొందుతున్నట్టు ?
ప్రభుత్వాన్ని నిర్దేశించే ఓటింగ్ ప్రక్రియలో వీళ్ళు పాల్గొన్నారు, కానీ వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చే

రాయితీలు మాత్రం పుష్కలంగా పొందుతున్నారు. ఎగుమతి సుంకాలల్లో ఎక్కువ రాయితీ పొందేది వీళ్ళే. పైగా ప్రస్తుతం జరుగుతున్న ఎలట్రానిక్ వోటింగ్ మిషన్లలో ఓటింగ్

నమోదు సాఫ్ట్ వేర్ తయారు చేసింది కూడా ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగులే అనే విషయం వీళ్ళకి గుర్తు లేదు.

ఉద్యోగం ఇక్కడ మరి ఓటు ఎక్కడో ఎలా?

à°—à°¤

కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం చేసే ఉద్యోగులు తమ ఓటు ను మాత్రం ఎక్కడో దూర ప్రాంతాల్లో ( వాళ్ళ గ్రామాల్లో) నమోదు చేసుకున్నట్టు

చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఏంటో తెలియదు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఓటు హక్కు ఇక్కడే ఎందుకు నమోదు చేసుకోలేక పోయారు. సెలవలు ఇవ్వరు అని తెలిసినప్పుడు,

ఆన్ లైన్ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉండగా, వీళ్లల్లో చాలా మంది కనీసం ఆసక్తి కూడా చూపడం లేదన్నది వాస్తవం. పైగా రోజులో 20 గంటలకు పైగా అదే

ఇంటర్నెట్ లో ఉండే వీళ్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ నమోదు తెలియదు అంటే నమ్మేది ఎవరు? ఇది పూర్తిగా భాద్యతారాహిత్యమే. 

సరైన వ్యక్తులు గెలవడం లో వీళ్ళు ఎటువంటి

భాధ్యత చూపడం లేదు, పైగా గెలిచినా వాడు చేసే పనుల్లో తప్పులు మాత్రం వెతుకుతుంటారు. పైగా సోషల్ మీడియాలో పెద్దగా నీతి కబుర్లు, పోస్టింగ్ లు పుంఖాలు పుంఖాలుగా

పెట్టడం లో చాలా బిజీగా ఉంటారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #trs  #telugudesam  #telangana  #elections  #software  #employees  #voters

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam