DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 నుంచి మార్గశిర మాసోత్సవాలు, అమ్మ దర్శనానికి ఆర్భాటంగా ఏర్పాట్లు

విశాఖపట్నం డిశంబర్ 6,2018 (DNS Online ) : ఉత్తరాంధ్ర జిల్లా వాసుల ఇలవేల్పు, విశాఖపట్నం లోని బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక మార్గశిర మాసోత్సవాల

కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.జ్యోతిమాధవి తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె

మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంచి నీరు,

ప్రసాద వితరణ వంటివి అందించేందుకు స్వచ్చంద సంస్థలకు అనుమతి ఇచ్చామన్నారు. ఇతర విభాగాల్లో సేవలు అందించేందుకు నగరానికి చెందిన స్కౌట్లు, స్వచ్చంద సంస్థల

ప్రతినిధులు, అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ఉత్సవాలను ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. ఉత్సవాలను విశాఖ దక్షిణ

నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. 

ఈ నెల 8 నుంచి జనవరి 5 వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు

 à°œà°°à°—నున్నాయని, అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు వస్తుంటారని తెలిపారు. ప్రధానంగా గురువారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం తో à°† రోజున

తెల్లవారుఝామునుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారన్నారు. ఈ నెల రోజుల్లో నాలుగు గురువారాలు వస్తున్నాయని, దీనికై ఆలయం నుంచి టౌన్ కొత్త రోడ్ వరకు భక్తుల

క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు. వీరందరికీ  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు నడుపుతున్నామన్నారు. ఆలయం నుంచి మెయిన్‌ రోడ్డు వరకు చలువ పందిళ్లు ఏర్పాటు

చేస్తున్నాం. టౌన్‌కొత్తరోడ్డు వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి ఇతర ఆలయాల నుంచి సుమారు 200 మంది ఉద్యోగులను నెల రోజుల పాటు

డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నామన్నారు. 

దర్శనం వేళలు : వీఐపీలకు దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇతర సమయాల్లో

సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తారు. 
ప్రవేశ దర్శన టిక్కెట్లు : అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా రూ. 20, రూ. 100, రూ. 200 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క గురువారం

రోజున రూ. 500à°² టిక్కెట్‌ను విక్రయిస్తాం. à°ˆ టిక్కెట్‌పై వెళ్లే భక్తులకు లడ్డూప్రసాదం అందజేస్తారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #skml  #temple  #margasira #masotsavalu  #festival

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam