DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ స్థాయి నేతలను అందించిన ఎయు తో కలిసి పనిచేస్తాం : టాటా 

ఏయూ పూర్వవిద్యార్థు సమావేశంలో  à°°à°¤à°¨à±‌ టాటా
విశాఖపట్నం, డిసెంబర్‌ 10, 2018 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°ªà°‚à°š స్థాయి నేతలను, శాస్త్రవేత్తలను అందించిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ ( ఏ యు)

తో కలిసి పనిచేసేందుకు విశ్వ విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రకటించారు. సోమవారం 
సాయంత్రం విశాఖ సాగర తీరం లోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో

నిర్వహించిన పూర్వవిద్యార్థు వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాయంతో పరిశోధన రంగంలో కలసి

పనిచేయడానికి, సంయుక్త పరిశోధనలను జరిపే దిశగా యోచన చేస్తామన్నారు. విభిన్న శాస్త్రాలను సమన్వయం చేస్తూ పరిశోధనలు సాగాల్సి ఉందన్నారు. విశ్వవిద్యాలయాలో

పరిశోధనలు పెరగాలన్నారు. పరిశ్రమలతో అనుసంధానం కలిగి ఉండటం అవసరమన్నారు. విద్యా వ్యవస్థను వాణిజ్య విపణితో అనుసంధానించడం, చేరువ చేయడం జరగాలన్నారు. పరస్పర

ఆధారిత (ఇంటర్‌ డిసిప్లేనరీ రీసర్చ్‌) పరిశోధను జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. విశాఖ అత్యంత పరిశుభ్ర నగరంగా దేశంలో నిలుస్తోందన్నారు. à°ˆ సమావేశం ఏయూకు, తనకు

నూతన దిశానిర్ధేశం చేస్తాయన్నారు. ఈ రోజు ఆంధ్రవిశ్వవిద్యాయంలో గడిపిన క్షణాలు తనకు జీవితాంతం గుర్తుంటాయన్నారు. తనపై ఉన్న అభిమానంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక

నృత్య ప్రదర్శన తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. 

మానవ వనరుల శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు మాట్లాడుతూ దేశంలోనే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌

మూడోస్థానంలో  à°¨à°¿à°šà°¿à°‚దన్నారు. రతన్‌ టాటా ఆగమనాన్ని పురస్కరించుకుని ఆయన పేరుమీదుగా ప్రత్యేక బంగారు పతకం, అవార్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆవిష్కరణకు

వేదికు ఏర్పాటు చేయాలని, సృజనాత్మక ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు.

ఎంపీ కె.హరి బాబు మాట్లాడుతూ విశాఖలో టిసిఎస్‌

కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ నగరం వ్యాపార, వాణిజ్య, పర్యాటక, విద్య రాజధానిగా నిలుస్తోందన్నారు. టాటా సంస్థకు చెందిన వ్యాపార సంస్థను విశాఖ నగరంలో

నెలకొల్పాలని ఆహ్వానించారు. 

పూర్వవిద్యార్థుల సంఘం చైర్మన్‌ జి.à°Žà°‚. రావు మాట్లాడుతూ యువత ఆర్ధిక రంగానికి, సమాజానికి మరింత మివను జోడిరచే దిశగా

పనిచేయాలన్నారు.  à°ªà±à°°à°ªà°‚చానికి అవసరమైన నాయకత్వాన్ని ఏయూ తీర్చిదిద్ది అందించడం జరుగుతోందన్నారు. రతన్‌ టాటాతో తనకున్న సాన్నిహిత్యంలో భాగంగా నిరాడంబరత,

మానవత్వం ఆయన నుంచి నేర్చుకున్నానన్నారు.

వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెస్స్‌లో స్థానం పొందే

దిశగా అడుగు వేస్తోందన్నారు. సిఆర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని à°ˆ కార్యక్రమం ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతోందన్నారు.

కార్యక్రమంలో వర్సిటీ

రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌, పూర్వవిద్యార్థు సంఘం కార్యదర్శి బి.మోహన వెంకట రామ్‌, కుమార్‌ రాజ తదితరులు  à°ªà±à°°à°¸à°‚గించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య

à°Žà°‚.ప్రసాద రావు, ఎంపీ వరప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌ మాధవ్‌,పి.చపతి రావు, జి.శ్రీనివాసు నాయుడు, జెడ్పీ చైర్మన్‌ లాం భవాని, తదితరులు

పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ వీసీలు, డీన్‌లు, పూర్వవిద్యార్థులు తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

తరన్‌టాటాను, ఆయన సంస్థను ఆవిష్కరిస్తూ వేదికపై నిరుపమ,

రాజేంద్ర బృందం చేసిన నృత్యం ఆకట్టుకుంది. వర్సిటీ తరపున రతన్‌ టాటాను సత్కరించారు. ఆయన చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. 

ఆచార్యులతో ముఖాముఖి.....
/> ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆచార్యులు, అధికారుతో రతన్‌ టాటా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. à°’à°• హోటల్లో జరిగిన కార్యక్రమంలో రతన్‌ టాటా తన ఆలోచనలను

పంచుకున్నారు. ప్రతిభను ప్రోత్సహించాని, దేశీయంగా యువత ఆవిష్కరణు, పారిశ్రామికత వేత్తుగా ఎదగాన్నారు. 
పైలాన్‌ ఆవిష్కరణ...
ఆంధ్రవిశ్వవిద్యాలయం

పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్‌) పైలాన్‌ను రతన్‌ టాటా ఆవిష్కరించారు. సాయంత్రం బీచ్‌రోడ్డు కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న ఆయన ముందుగా పైలాన్‌

ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాన్ని తికించారు. వర్సిటీ పూర్వవిద్యార్థుల సంఘం(ఏఏఏ) సావనీర్‌ను ఆయన

ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ పూర్వ ఆచార్యులు à°‡.వెంక రావును ఘనంగా సత్కరించారు. 

విజేతలకు బహుమతులు.... :
ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థులు

సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన వక్తృత్వం, వ్యాసరచణ, సంగీతం, క్రీడల్లో విజేతలుగా నిలచిన విద్యార్థులు బహుమతులను వేదికపై అందజేశారు. పులువురు

పూర్వవిద్యార్థులు వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పులువురు పూర్వవిద్యార్థులు హజరయ్యారు.

ఏయూ సంగీత విభాగం విద్యార్థులు ప్రదర్శన అరించింది.

కిక్కిరిసిన ప్రాంగణం.... :

పూర్వవిద్యార్థులు సమావేశానికి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా హాజరు

కావడంతో సమావేశం ప్రాధాన్యత రెట్టింపయ్యింది. రతన్‌ టాటా ఆగమనంతో పెద్దసంఖ్యలో పూర్వవిద్యార్థులు సమావేశానికి రావడానికి ఆసక్తి చూపారు. దీనితో సమావేశ మందిరం

పూర్తిగా కిక్కిరిసి పోయింది. పెద్దసంఖ్యలో పూర్వవిద్యార్థులు నగరవాసులు సమావేశానికి రావడంతో సమావేశ ప్రాంగణం నిండిపోయింది. ముందు జాగ్రత్తగా అధికారులు

ప్రాంగణం బయట  à°Žà°²à±‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, టెంట్‌లు, కుర్చీలు వేసి ఏర్పాట్లు చేశారు.

పండగ వాతావరణం... :

పూర్వవిద్యార్థులు సమావేశం నేపధ్యలో

వర్సిటీలో పండగ వాతావరణం నెలకొంది. వర్సిటీ భవనాలను, కూడళ్లను రంగురంగు విద్యుత్‌ దీపాలతో అంకరించారు. వర్సిటీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతీ

విభాగంలో ఉదయం ఆయా విభాగాల పూర్వవిద్యార్థులు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. వీటిలో ఆయా విభాగా పూర్వవిద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలలో తమ

అనుభవాలను, అనుభూతులను తమ స్నేహితులతో పంచుకున్నారు. దీనితో వర్సిటీలో పండుగ వాతావరణం నెలకొంది.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #alumni  #ganta srinivasa rao  #gmr  #tata  #AU  #Ratan Tata

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam