DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది యావత్ తెలంగాణ ప్రజ సమిష్టి విజయం: కేసీఆర్ 

హైద్రాబాద్, డిశంబర్ 10 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): భారత దేశ చరిత్రలో డిశంబర్ 11 à°µ తేదీ తెలంగాణ à°’à°• చరిత్ర సృష్టించిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు

ప్రకటించారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన పత్రికాముఖంగా మొత్తం తెలంగాణ ప్రజలకు, అధికారులకు, మీడియాకు అందరికీ

ధన్యవాదాలు తెలియచేసారు. దేశ చరిత్రలో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు నిర్వహించడం, ఏ ఒక్క ఎన్నికల బూత్ దగ్గరా ఎక్కడా ఎటువంటి అసాంఘిక ఘటనలు,

కొట్లాటలు జరుగకుండా ఎన్నికలు జరగడమే కాకుండా, సానుకూల పరిస్థితుల్లో ఫలితాలు రావడం లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్, ఆయన సిబ్బంది, తెలంగాణ ప్రభుత్వ

అధికారులు అందరూ అద్భుతంగా పనిచేశారన్నారు. ఎన్నికల ప్రచారం లో రైతులకు ఇచ్చిన హామీలపై తోలి సంతకం చేస్తానని తెలిపారు. అదే విధంగా రెడ్డి, వైశ్య సామాజిక

వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర సామజిక వర్గాలకు కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను మొదలు పెడతామన్నారు. మీడియా పోషించిన పాత్ర

అత్యద్భుతమన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam #vizag  #bjp  #trs  #kcr  #telangana

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam