DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుబ్రహ్మణ్య షష్టి వేడుకలకు బిక్కవోలు సిద్ధం. . .

విశాఖపట్నం / కాకినాడ, డిసెంబర్‌ 12, 2018  (డిఎన్‌ఎస్‌) : సుబ్రహ్మణ్య షష్టి అనగానే తెలుగు రాష్ట్ర ప్రజలకు వెంటనే స్ఫురణకు వచ్చే పేరు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు.

à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా వేడుకలు, పోటాపోటీగా భక్తి సంగీత కచేరీలు,  à°°à±†à°‚డు బృందాల మధ్య బాణా సంచా పోటీలు, తెల్లవారేదాకా జాగరణ వీటితో బిక్కవోలు గ్రామంలో సుబ్రమణ్య

షష్ఠి వేడుకలు నిర్వహిస్తుంటారు. దశాబ్దాల కాలం నుంచి ఈ వేడుకలు ప్రతీ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తుంటారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వేడుకల్లో అందరూ కలిసి

పాల్గొనడం, మనస్పర్థలకు ఆస్కారం లేకుండా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులు ఈ వైభవంలో స్వామికి

ఎటువంటి లోటూ రాకుండా అనేక ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. 

మార్గశిర శుద్ధ షష్టిని అత్యంత పవిత్రమైన రోజుగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకను పురస్క

రించుకుని ఈ నెల 13 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవాలయాల్లో షష్టి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తు న్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు 16

కిలోమీటర్ల దూరంలోని బిక్కవోలు మండల కేంద్రంలోని ఈ ఆలయంలో శతాబ్దాల నుంచి అత్యంత వైభవంగా షష్టి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. సుబ్రహ్మ ణ్యుడే

స్వయంగా ప్రతిష్ట చేసిన గోలింగేశ్వర స్వామి నెలకొనియున్నందున సు బ్రహ్మణ్యునితో పాటు ఆయనకూ ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ప్రాత:కాలం నుంచే

సుదూ ర ప్రాంతాలకు చెందిన వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుండడంతో ఆలయ నిర్వాహకలు ప్రత్యేక ఏర్పాట్లు తో పాటు, అన్న ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించే

ఏర్పాట్లు చేసారు. 
దేశంలోనే అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా కీర్తి గాంచిన ఈ ఆలయ అభివృద్ధిలో ఎందరో రాజులు, సంస్ధానాధీశులు తమ వంతు కృషిని జరిపారు. దీనికి

నిదర్శనంగా ఎన్నో శాసనాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుం టాయి. ప్రధానంగా ఈ ఆయ దర్శనం చేసి, ఆలయంలో ప్రాత:కాలం లో నిద్రించిన మహిళలకు సంతానం కలుగుతుందనే నమ్మకం

భక్తుల్లో అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు, స్వామి అనుగ్రహం లభించిన మహిళలు సైతం వందల సంఖ్యలో ఈ రోజున స్వామి దర్శనానికి వస్తుంటారు. గోలింగేశ్వర స్వామి

ఆలయంలోని స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకాను న్నందున విశాఖ జిల్లా నుంచే కాక, రాష్ట్రంలోని ఇతర జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక

బస్సులను నడుపుతున్నారు.  à°¦à°¾à°¦à°¾à°ªà± లక్షకు పైగా భక్తులు à°ˆ స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటు వంటి అవాంతరాలు కలుగకుండా ఆలయ కమిటీ చేస్తున్న

ఏర్పాట్లతో పాటు, స్ధానిక పోలీసు, రెవిన్యూ విభాగాలు ప్రత్యక్ష పర్యవేక్షణలో పాల్గొంటున్నాయి. à°ˆ గ్రామానికి చేరుకోడానికి రాజమం డ్రి - కాకినాడ బస్సు ( కెనాల్‌

రోడ్‌ ) లో బస్సు సౌకర్యంతో పాటు, à°ˆ మార్గంలో à°—à°²  à°°à±ˆà°²à± మార్గంలో పాసింజరు రైళ్ళు ద్వారా చేరుకోవచ్చు.  à°…నంత à°°à°‚ సాయంత్రం రెండు బృందాల à°® ధ్య జరిగే బాణా సంచా పోటీలు

రాష్ట్రం లోనే ప్రథమ స్ధానంలో ఉంటాయన్నది అతిశయోక్తి కాదు. రెండు గ్రామాలకు చెందిన భక్తులు పోటాపోటీగా బాణా సంచా పోటీల్లో పాల్గొని భక్తులను ఆకర్షి

స్తుంటారు. 
ఉదయం నుంచే ఆలయ ప్రాంగ ణంలో ఏర్పాటు చేసిన పెండాల్స్‌ వద్ద నిర్విరామంగా సాగే భక్తి సంగీతం కార్య క్రమాల్లొప్రసిద్ధ గాయనీ గాయకులు సైతం స్వామి

ఉత్సవాల్లో పాల్గోనేందుకు ఆసక్తి చూపుతుంటారు.

విస్తృతంగా ఆర్టీసీ సేవలు  : 
సుబ్రహ్మణ్య షష్టి వేడుకల్లో పాల్గొనేందుకు బిక్కవోలు గ్రామానికి

వేలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు సర్వీసులు నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లా లోని వివిధ

ప్రాంతాల నుచి కాక, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణ, తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు

చేసింది. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bikkavolu  #east godavari #subhramanya shasti  #Rajahmundry  #Samalkot

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam