DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తుత్తి ఆక్టోపస్ నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడే నిద్ర లేచింది. 

విశాఖపట్నం, డిసెంబర్‌ 12, 2018  (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఎన్నికల తర్వాత ఖాళీ అయిపోయిన ఉత్తుత్తి ఆక్టోపస్ లు నాలుగున్నరేళ్ళ కాలం గమ్మునుండి, ఇప్పుడిప్పుడే మళ్ళీ నిద్ర

లేస్తున్నాయి. ఉత్తరాంధ్రా లో ఒకటి ఉంది, కోస్తాలో మరొకటి ఉంది. గత నాలుగున్నరేళ్ల కాలం గా నిద్దరోయి, మళ్ళీ ఇప్పుడు నిద్ర లేచాయి. వీటికి పెద్దగా ప్రచారం

లేకున్నా, వాటికీ అవే గొప్పగా ఫీలవుతుంటాయి. వీటిని పట్టించుకునే నాధుడే లేకున్నా, అప్పుడప్పుడూ ఊబిలోనుంచి పైకి లేస్తుంటాయి. ఇటీవల వీటి సంచారం మొదలైంది. ఇవి

కేవలం ఐదేళ్ల కాలం లో కేవలం నాలుగైదు నెలలు మాత్రమే మేలుకొని ఉంది, మిగిలిన కాలం నిద్రపోతుంటాయి. ఈ ఆక్టోపస్ లు సంచరించాలంటే వాతావరణం పచ్చగా ఉండాల్సిన

ఉంటుంది. ఉత్తరాంధ్రా ఆక్టోపస్ ని పట్టించుకునేవారు లేకున్నా, సంచరిస్తున్నట్టు హంగామా చేస్తూనే ఉంటుంది. వీటిని పట్టించుకునే వాడు పెద్దగా లేకున్నా, వీటికి

విలువ లేకున్నా, తామే గొప్ప అంటూ స్వీయ సంకేతాలిచేస్తుంటాయి. ఆకలి తీరడం కోసం ఇవి తిమింగలాలు వెంట పడుతుంటాయి తప్ప చిన్నపాటి షార్క్ లు, ఇతర మత్య్స సంపద

పనికిరావు, అసలు వాటి జోలికే ఈ ఆక్టోపస్ లు వెళ్లవు. కానీ ఈ నిద్రపోయే ఉత్తుత్తి ఆక్టోపస్ ల ఆకలి తీర్చేవి మాత్రం ఈ చిన్నపాటి మత్య్స సంపదే అనే విషయం ఆక్టోపస్ కి

తెలియడం లేదు. à°† విషయం తెలిసే నాటి ఆక్టోపస్ జీవితం ముగిసిపోతుందన్నది వాస్తవం. 
కోస్తా లో ఉన్న ఆక్టోపస్ కోడి నిద్ర పోతూ, నే కూడా ఇక్కడే ఉన్నా అంటూ

సంకేతాలిస్తూ ఉంటుంది. అది మొన్న కూస్తే, ఉత్తరాంధ్ర ఉత్తుత్తి ఆక్టోపస్ ఈరోజే నిద్రలేచింది. ఇక అది కూడా కూయడం మొదలెడుతుంది. à°ˆ ఆక్టోపస్ లు కూసే కూతంతా

తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయన్నది ప్రస్తుత సమాచారం.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #guntur  #vijayawada  #octopus

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam