DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాకూటమిని మట్టికరిపించింది బాబు వైఖరే : విజయశాంతి

బాబుతో పొత్తుపై కాంగ్రెస్ ను ముందుగానే హెచ్చరించా !!

హైదరాబాద్, డిశంబర్ 13 , 2018 (DNS Online ): తెలంగాణ లో మహా కూటమి లో చంద్రబాబు ను చేర్చవద్దని, తెలుగుదేశం తో చేరితే

మొదటికే మోసపోతామని కాంగ్రెస్ అధిష్టానాన్ని ముందుగానే హెచ్చరించానని ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్.పి విజయశాంతి మండిపడ్డట్టు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గం లో

 à°•à°¾à°‚గ్రెస్ పార్టీ  à°•à°¾à°°à±à°¯à°•à°°à±à°¤à°²à°¤à±‹ పార్టీ ఘోర ఓటమి పై ఆమె తన ఆవేదన పంచుకున్నట్టు సమాచారం. మహా à°—à°  బంధన్  ( మహా కూటమి ) ను కొంప ముంచింది చంద్రబాబేనన్నారు. ఇప్పడికే

విభజన అంశం పై తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు పై తీవ్ర వ్యతిరేకత ఉందని, గతం లో అతను చేసిన వ్యవహారమే దీనికి కారణమన్నారు. అయినప్పటికీ కొందరు ఇచ్చిన తప్పుడు

సంకేతాలతో కాంగ్రెస్ అధిష్టానం చంద్ర బాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తో జత కూడడంతో కొత్తగా సీట్లు రావడం సంగతి పోయి, ఉన్న సిట్టింగ్ సీట్లు కోల్పోవడం తో

పాటు, కాంగ్రెస్ పార్టీ మహా నేతలు కూడా మట్టి కరిచారన్నారు. దీనికి చంద్రబాబే భాద్యత వహించాలన్నారు. టిడిపితో పొత్తు పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట

వ్యతిరేకించింది తానేనన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలిచేస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లోకి వెళ్లడం వల్లే ఈ పరిస్ధితి

ఉత్పన్నమైందని వ్యాఖ్యానించినట్టు తెలియవచ్చింది. పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇస్తానని, కనీసం పార్లమెంటు ఎన్నికల

నాటికైనా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నట్టుగా సమాచారం.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #telugu desam  #congress #telangana  #maha kutami  #vijayashanti  #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam