DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈసారైనా మారండి, దేవాదాయ శాఖ డీసీ కు గంటా మందలింపు

విశాఖ ఉత్సవ్ పై ఉప కమిషనర్ పై à°—à°‚à°Ÿ మండిపాటు 
విశాఖపట్నం, డిశంబర్ 14 , 2018 (డిఎన్ఎస్  DNS Online ): à°ˆ నెల 28 నుంచి 30 వరకు విశాఖ నగరం లో నిర్వహించ నున్న విశాఖ ఉత్సవ్ సమీక్ష

సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు దేవాదాయ శాఖా ఉప కమిషనర్ పై మండిపడ్డారు. శుక్రవారం నగరంలోని విఎంఆర్ డీఏ కార్యాలయం లో చేపట్టిన

సమావేశంలో అయన మాట్లాడుతూ గత కొన్నేళ్లు నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ లో దేవాదాయ శాఖ పనితీరు మహా ఘోరంగా ఉందని, ఎదో మొక్కుబడిగా ఒక స్టాల్ పెట్టి చేతులు

దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పర్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారని, దేవాదాయ శాఖా స్టాల్ పై మరింత ద్రుష్టి పెట్టి,

రాష్ట్రం లోని అన్ని ఆలయాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి చేతిలో చివాట్లు తప్పవని హెచ్చరించారు. ఈ శాఖా పనితీరు ఏమాత్రం

హర్షించ తగినట్టు లేదన్నారు. గత మారు పెట్టిన స్టాల్ లో కేవలం ఆలయాల బొమ్మలు పెట్టి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ పర్యాయం అన్ని స్టాల్స్ కంటే మెరుగైన పనితీరు

కనపడాలన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆలయాల్లో మూర్తులు, వాటి విశిష్టతలను తెలియచేసే విధంగా అన్ని వివరాలతో పాటు, స్టాల్ ను ఆలయాల నిర్మాణం మాదిరిగా

తయారు చేయించాలను సూచించారు. ఆయా దేవాలయాల అర్చకులు, సిబ్బంది, తప్పని సరిగా ఆలయ నమూనా వద్ద ఉండాలన్నారు. తద్వారా వచ్చిన సందర్శకులకు వివరాలు

తెలియచేయాల్సియుంటుందని హెచ్చరించారు. 

 

 

#dns  #dns live #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #visakha utsav #endowments

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam