DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ 

హైద్రాబాద్, డిశంబర్ 15 , 2018 (డిఎన్ఎస్  DNS Online ): à°Ÿà°¿ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.à°Ÿà°¿ రామారావు తెలిపారు.

హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ చేపట్టిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో అయన తన భవిష్యత్ కార్యాచరణను సుస్పష్టం చేశారు. పాత్రికేయులకు పార్టీ ఇచ్చిన హామీలను ఎట్టి

పరిస్థితుల్లోనూ పరిపూర్ణం చేసి తీరుతామన్నారు. తమకు ప్రాంతీయ అభిమానం ఉందని, అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ లో జీవనం సాగిస్తున్నవారి పట్ల వ్యతిరేకత

లేదన్నారు. వారంతా ఇక్కడ నివాసులేనన్నారు.  
పాత్రికేయులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించింది కూడా టి ఆర్ఎస్ పార్టీయన్నారు. ఈ ఎన్నికల్లో క్రాంతి కుమార్ కు

à°Žà°‚ ఎల్ ఏ à°—à°¾ టికెట్ ఇచ్చి, గెలిపించుకున్నామని, గతంలోనే రామలింగారెడ్డి ని చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించడమే దీనికి నిదర్శనమన్నారు. 

ఎన్నికల ఫలితాలు

జరిగిపోయిన అంశమని, ఓటమి పాలైన పార్టీలు తమ తప్పిదాలపై విశ్లేషించుకోవాలి తప్ప, ఎన్నికల ప్రక్రియను తప్పు పట్టడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మహా కూటమి,

మహా తప్పిదం అని తెలంగాణ ప్రజలు గట్టి తీర్పును ఇవ్వడాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. 
టీఆరెస్ పార్టీలో యువతకు

అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, వారిలో రాజకీయ చైతన్యం పెంపొందించి, విజ్ఞత కల్గిన నాయకులుగా తయారు చేస్తామన్నారు. జాతీయ స్థాయి లో గట్టి పట్టు

సాధించేందుకే బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, దాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కేసీఆర్ జాతీయ

రాజకీయాలపై ద్రుష్టి సారించారన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #trs  #telangana  #hyderabad  #KTR  #TRS  #meet the press

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam