DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల అర్చకుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే భాద్యత 

ఆలయ అర్చకులంటే à°…à°‚à°¤ అలుసా ? వేధింపులకు మృత్యువాత 

ప్రభుత్వ సిబ్బంది వేధింపులే అర్చకుల మృత్యువాత కు కారణం 

ఆదాయం గెద్దలా తన్నుకెళ్లేందుకు

దేవాదాయ శాఖ  à°¸à°¿à°¦à±à°§à°‚. 

అర్చకులంటే మంత్రి కే గౌరవం లేదు. 

విశాఖపట్నం, డిశంబర్ 16 ,2018 (DNS Online ) : తెలుగు రాష్ట్రాల్లోని  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖలు పూర్తిగా బ్రష్టు పట్టి

పోయాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల కాలం లో వివిధ ఆలయాల్లోని అర్చకుల బలవన్మరణాలే. ఈ అర్చకుల ఆత్మహత్యలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదే భాద్యత అని

అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అర్చకులంటే చాలా అలుసుగా ఉన్న కారణం వల్లే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. 

అర్చకుని బొక్కలో వేసి కుమ్మితే విషయం బయటకి వస్తుంది అని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి బహిరంగంగా అన్నారంటే అర్చకులు, అర్చక వ్యవస్థ పట్ల ఈ

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోంది. మంత్రులే ఇలా తిడుతుంటే. . .ఇక అధికారులు, ఈఓ లు అర్చకులను తిట్టడం పెద్ద విషయం కాదు.  

హిందూ ధర్మంలో ఆలయాల

నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం అర్చకులు. అర్చకులు సరిగ్గా అర్చనలు చేస్తేనే ఆలయాలకు భక్తుల రాక పెరుగుతుంది, తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇలా

ఆదాయం పెరిగింది అనగానే తన్నుకు పోవడానికి దేవాదాయ శాఖ సిద్ధంగా ఉంటుంది. తద్వారా గుమాస్తాలు, ఈఓ లు అంటూ నానా రకాలుగా సిబ్బంది ని నియమించి ఆ గుడికి వచ్చిన

ఆదాయాన్ని తన్నుకు వెళ్ళిపోతుంది. పైగా అర్చకులకు భక్తులకు ఎటువంటి దక్షిణలు, సంభావనలూ నేరుగా ఇవ్వకుండా హుండీలో వేసేలా చూarchడడమే వీళ్ళ పని, ఇంకే పనీ ఉండదు

వీళ్ళకి. పైగా భక్తులకు సైతం గుడిలో వాళ్ళేమి చెయ్యాలో కూడా ఈ శాఖ తొత్తులు చెప్తుంటారు. పైగా కొబ్బరి కాయ కొట్టడం దగ్గర నుంచి, దర్శనం టికెట్లు, దక్షిణ ఎక్కడ

వెయ్యాలో కూడా ఈ చెంచాగిరి ఉద్యోగులే చెప్తుంటారు. పైగా భక్తులు ఎవరైనా అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారేమో, వాళ్ళకేమైనా సంభవనాలు నేరుగా ఇచ్చేస్తారేమో

అని డేగల్లాగా à°ˆ దేవాదాయ శాఖ చెంచాలు అక్కడే తచ్చాడుతుంటాయి. 

ఆదాయం దేవునిది, ఖర్చు ఈఓ à°•à°¾  . . .

ఆలయాలకు ఆదాయం వచ్చేది కేవలం భక్తుల ద్వారానే. భక్తులు

కూడా ఆయా గుడిలోని మూల విరాట్ ను చేసే దక్షిణలు, సంభావనలూ ఆ గుడికి ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఆ గుడిలో ఈఓ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఆ గుడికి సంభవనాలు ఇవ్వరు.

భక్తులు ఇచ్చే ముడుపులు, హుండీలో వేసే దక్షిణలు కేవలం ఆ గుడి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చెయ్యాల్సి ఉండగా గుమాస్తాలు, ఈఓ ల వ్యక్తిగత ఖర్చులు, అక్కడి కి కవరేజి

కి వచ్చే మీడియా వ్యక్తులకు ( కొందరికే) ముడుపులు సమర్పించుకోవడాన్ని కూడా ఈ హుండీ నుంచే డబ్బులు తీసి ఖర్చు చేసే ఘనులు ఈ సో కాల్డ్ ఈఓ లు. వీళ్ళంటికీ తోడుగా. . .

దమ్మిడీకి కొరగాని, ఆలయానికి ఏమాత్రం పనికిరాని వ్యక్తులను ఆలయ ధర్మకర్తల మండలి లో నియామకాలు జరుపుతుండడం మరింత భారంగా మారింది. వీళ్ళు సొంత పనులకు సైతం

గుడిలోని హుండీ నుంచే డబ్బులు ఖాళీ చేస్తుంటారు. 

అర్చకులకు అరకొర జీతాలు :
ఆలయాలను బ్రతికించే అర్చకులకు మాత్రం అరకొర జీతాలు ఇస్తున్నారు. అది కూడా

కొన్ని నెలలపాటు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. వీళ్ళకి కనీసం పది వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వవలసియుండగా ( ఇదే సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచ్చింది), నేటికీ

వేలాది ఆలయాలలో ఇది ఇవ్వడం లేదు. కేవలం రెండు వేలు, మూడు వేలు జీతాలతో దుర్భర జీవితాలను గడుపుతున్న అర్చకులు వేలల్లోనే ఉన్నారు. పైగా వీళ్ళందరికీ ఈఓ ల నుంచి

వేధింపులు తీవ్రంగానే ఉన్నాయి. 

అర్చకులపై ఈఓ ల ఆగడాలు...

అరకొర జీవితాలు గడుపుతున్న అర్చకులపై ఈఓ ల పట్ల దుష్ప్రవర్తనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా

గుళ్ళల్లో అర్చకులను ఏరా. .  à°“రే . . . ఏమోయ్ . .  à°²à°¾à°‚à°Ÿà°¿ పిలుపులు కూడా వినిపిస్తుంటాయి. అనంతరం అర్చకుల కుటుంబ సభ్యులపై సైతం వేధింపులు కొనసాగుతున్నాయి. వీటి తీవ్రత

పెరుగుతుండడంతో ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం పినగాడి లోని ఒక ఆలయంలో అర్చకుని భార్య తో అసభ్యంగా

ప్రవర్తించిన ఈఓ వైఖరి పై అర్చక కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం, తదుపరి ఈఓ పై చర్యలకు డిమాండ్ చెయ్యడం జరిగింది. ఇలా ఎదిరించి ఫిర్యాదు

చెయ్యగలిగే వారు చాలా అరుదుగా ఉంటారు. మరి వెలుగు చూడని ఘటనలు à°ˆ ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖలో కోకోల్లలుగానే ఉన్నాయన్నది వాస్తవం. 
ఇటీవల కాలంలో తూర్పుగోదావరి

జిల్లా రాజమహేంద్రవరం దగ్గరలోని కోరుకొండ గ్రామం పరిధిలో ఒక అర్చకుడు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇంకొకరు, అంతకుముందు తెలంగాణలోనూ కొన్ని చోట్ల ఇలా అధికారుల

ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. 

పీ ఆర్ సి  à°µà°¸à±à°¤à±‡ డబ్బులు చెల్లించాల్సిందే...

అర్చకులకు పీ ఆర్ సి గానీ, ఇతర

అలవెన్సులు రూపంలో అదనపు ఆదాయం వచ్చిన ప్రతీసారి ఈఓ లు సంతకం పెట్టవలసి ఉంటుంది. ఇలా సంతకం పెట్టవలసి వస్తే ప్రతి అర్చకులు, సిబ్బంది నుంచి వచ్చిన ఆదాయం లో కనీసం

10 à°¶à°¾à°¤à°‚ ఈఓ సంభావన à°°à±‚పంలో ( అమ్యామ్యా) చెల్లించుకోవాల్సి దుస్థితి à°ˆ దేవాదాయ శాఖ లో భయంకరంగా కొనసాగుతోంది. అలా అమ్యామ్యా లు ఇవ్వని అర్చకులపై ఈఓ à°² దుశ్చర్యలు

తీవ్రస్థాయి లోనే ఉంటున్నాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన అర్చకులు అతి కొద్దీ మందే ఉంటారు. దీనికి నిదర్శనమే విశాఖలోని పేదవాల్తేరు లో గల కరకచెట్టు

పోలమాంబ గుడిలో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది à°•à°¿ రెడ్ హ్యాండెడ్ à°—à°¾ ఈఓ దొరకడమే. 

అర్చకులు - ఆత్మహత్యలు :

అర్చకుల పై ప్రభుత్వం పెత్తనం చేస్తుండడంతో,  à°ˆà°“ à°²

ఆగడాలు తాళలేక  à°à°¡à°¾à°¦à°¿ కాలం లో ఎనిమిది మంది అర్చకుల ఆత్మహత్యలు జరిగాయి. 

అధికారుల వేధింపులు తట్టుకోలేక రామచంద్రపురం లో ఫణికుమార్ ఆత్మహత్య చేసుకున్న

ఘటనలో 18 గంటల పాటు పంచనామా చెయ్యకుండా అర్చకుల పై ప్రభుత్వం కక్షసాధింపు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

మండిపడుతున్నారు.  à°ªà°—ో జిల్లా లో మల్లిఖార్జున శర్మ, సిద్ధాంతం లో వేదాంతం కిషోర్, 2018 నవంబర్లో కృష్ణ జిల్లా లోని ఎనికేపాడు లో దుర్గ మల్లేశ్వర స్వామి ఆత్మహత్య

యత్నం, పెద్దాపురం లో అర్చకునిపై ఒత్తిళ్లు, ఆత్మహత్య యత్నం చెయ్యడం వలన పరిణామాలు తీవ్రతరం à°—à°¾ మారుతున్నాయి. 
ఇంట ఘోరం జరుగుతున్నా నోరెత్తి నిరసనలు

తెలియచేసేందుకు అర్చకులకు అవకాశం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. అర్చకుల్లో కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం వారే

ఉండరని, ఇతర సామాజిక వర్గాల వారూ ఉన్నారని, వారు కూడా ఇదే విధంగా వేధింపులకు గురి అవుతున్నారని అర్చక సంఘాలు  à°®à°‚డిపడుతున్నాయి. 

ఈ విధమైన ఆగడాలు తగ్గాలన్న, ఈ

రాష్ట్రం లో హిందూ ధార్మికత విలువలు పెరగాలన్న, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలనూ దేవాదాయ శాఖ అనే రాక్షస (నరక) కూపం నుంచి బయటపడాలి అని హిందూ ధార్మిక వ్యవస్థ,

భక్తులు కోరుకుంటున్నారు. 

ఆస్తులు స్వాహా కే ఈఓ లు, బోర్డులు ...:

వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దోచుకునేందుకు ఆలయాల ఈవోలు, దేవాదాయశాఖ బోర్డు

ప్రతినిధులు, ఆలయాల్లో నియమితులైన అనామక ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇలా ఎవరి స్థాయిలో వారు, అందినకాడికి దేవునికి భక్తులు ఇచ్చిన ఆస్తులను బొక్కేందుకు గెద్దల్లా,

కాకుల్లా అన్ని వేళలా అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంటారు అని హిందూ ధార్మిక మండళ్ల  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± మండిపడుతున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #temple  #archakas  #endowments  #andhra

pradesh  #government
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam