DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిరకాల వాంఛ కు సాకార రూపం. . . చిత్రసీమకు చంద్రశేఖర్

విశాఖపట్నం, డిశంబర్ 17, 2018 (DNS Online): పాత్రికేయునిగా ఎన్నో సంచలన వార్తలు రచించి పాఠకుల దృష్టిని ఆకర్షించిన చంద్రశేఖర్ తన చిరకాల వాంఛకు రూపకల్పన సాగించే దిశగా

అడుగులు వేస్తున్నారు. వెండి తెర పై సైతం తన హవాను కొనసాగించేందుకు తొలి అడుగు వేశారు. సోమవారం విశాఖ నగరం లో మూవీ యాంబిషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా

తెలుగు సినిమా ఆరంభ సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎల్.ఆనంద్ నిర్మాతగా సునీల్ చరణ్ కథానాయకునిగా, రూపకల్పన జరుగుతున్న చిత్రానికి చంద్రశేఖర్

దర్శకునిగా తొలి అడుగు వేస్తున్నారు. వందలాది మంది నటీ నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన స్టార్ మేకర్ ఎల్. సత్యానంద్, సాయిపూజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

వానపల్లి రవికుమార్ లు హాజరై దర్శక నిర్మాతలు, నటీ నటులను అభినందించారు. ఈ సందర్బంగా సత్యానంద్ మాట్లాడుతూ పాత్రికేయ రంగం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన

వారెందరో ఉన్నారని, వారంతా అద్భుతమైన విజయాలు సాధించినవారేనన్నారు. అదే విధంగా కష్టే ఫలి అన్న రీతిలో ఏ పని చేపట్టినా, విజయవంతంగా పూర్తిచేసే వరకూ కృషి చేసే

వ్యక్తి చంద్రశేఖర్ సినీ జీవితం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పలువురు పాత్రికేయులు, సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #cinema #tollywood  #chandra sekhar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam