DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18 న ఉత్తర ద్వార దర్శనానికి ఆలయాలు సిద్ధం:

భద్రాచలం, తిరుమల కె అధిక ప్రాధాన్యత 
 

విశాఖపట్నం, డిశంబర్ 17, 2018 (DNS Online): ఈ నెల 18 న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ దేవాలయాలు

సిద్ధమవుతున్నాయి. ఆంధ్ర దేశంలో ఈ ఉత్తర ద్వార దర్శన వేడుకలలు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే అన్ని ఆలయాలూ ఏర్పాట్లలో నిమగ్నమై

యున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున వారికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భద్రాచల క్షేత్రం లో శ్రీ రామచంద్ర

స్వామి, సపరివారంగా ఈ రోజునే భక్తులకు కన్నుల పండువగా దర్శనం ఇస్తుంటారు. అదే విధంగా తిరుమల క్షేత్రం లో రెండు రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం

కల్పిస్తుంటారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని వస్తారు కనుకనే ఏకాదశి రోజున, మరునాడు వచ్చే ద్వాదశి రోజున కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. సింహాచలం,

వేదాద్రి, యాదాద్రి, మంగళగిరి, శ్రీకూర్మం తదితర ఆలయాలు ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అదే విధంగా తెలుగు ప్రాంతాల్లోని అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఈ

ముక్కోటి వేడుకలు జరుగుతుంటాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bhadrachalam  #uttara dwara darshanam  #vaikuntha ekadasi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam