DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయ స్థానాలంటే ఉత్తర ద్వార ప్రవేశమే: రాష్ట్ర చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్  

న్యాయవాదిగా ఒక్క అబద్దం కూడా ఆడలేదు :

న్యాయం అందరికీ సమానమే, బేధాలు లేవు, 

రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ తోటత్తిల్ బి. రాధాకృష్ణన్

 

విశాఖపట్నం, డిశంబర్ 22 ,2018 (DNS Online ): న్యాయ స్థానం అంటే వైకుంఠ ఏకాదశి రోజున ప్రవేశించే ఉత్తర ద్వార ప్రవేశం లాంటిదేనని, అందరికీ న్యాయం సమానమేనని, ఆంధ్ర ప్రదేశ్,

తెలంగాణ రాష్ట్రాల హై కోర్టు ప్రధాన న్యాయాధీశులు తోటత్తిల్ బి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. విశాఖనగరం లోని ద్వారకానగర్ లో గల పౌరగ్రంధాలయం లో సెంటర్ ఫర్ పాలసీ

స్టడీస్ సంస్థ శనివారం నిర్వహించిన అద్భుత కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ డివి సుబ్బారావు

స్మారకోపన్యాసం చేశారు. ఆధ్యాత్మికతను జోడించి ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆలోచింపచేసే విధంగా సాగింది. పంచేంద్రియాలు, మానవత్వం, వైకుంఠ ద్వార ప్రవేశం,

తదితర వైశిష్టతను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. న్యాయస్థానం లో బెంచ్ -  à°¬à°¾à°°à± లు వేరు కాదని, à°ˆ రెండు అంతర్గతంగా సమన్వయం తో నడవవలసినవేనని, న్యాయం, తీర్పు కు మధ్య

మానవ విలువలు అనేవి సంబంధం కల్గియుండాలని తెలియచేసారు. 

డీవీ సుబ్బారావు తో కలిసి గతంలో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నానని, అయితే వారి స్మారకోపన్యాసమే

తానూ ఈరోజు చెయ్యబోతున్నాననే విషయం సభకు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఒక వ్యక్తి పలు రంగాల్లో అత్యంత కీలక స్థానం లో పాత్ర పోషించడం అత్యంత అరుదుగా

ఉంటుందని, అయితే అలాంటి వారిలో డీవీ సుబ్బారావు ఒకరన్నారు. ఒక న్యాయవాదిగా, బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, నగర మేయర్ గా, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షునిగా,

ఇంకా  à°Žà°¨à±à°¨à±‹ ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షునిగా విభిన్న రంగాల్లో అత్యద్భుతమైన పాత్ర పోషించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. 

న్యాయవాదులు కేసులను

వాదించే ముందుగా క్రింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులు, వాటిలో ఉన్న వైవిధ్యాలను ప్రతి న్యాయవాది తప్పని సరిగా తమ కేసుల్లో చేర్చవలసి ఉంటుందని, తద్వారా

కక్షిదారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇతర కేసులను కూడా పూర్తిగా స్టడీ చెయ్యడం ద్వారా విభిన్న కోణాలు తెలుస్తాయన్నారు. 

తాను న్యాయవాదిగా

ఉన్నంత  à°•à°¾à°²à°‚ ఏనాడూ అసత్యం ఆడడం చెయ్యలేదని, సత్యం మాత్రమే ప్రకటించి కక్షిదారులకు సహాయం చెయ్యడం జరిగిందన్నారు. సత్యాన్నే నమ్ముకుంటే న్యాయం దానంతట అదే

వస్తుందనే సిద్ధాంతాన్ని న్యాయవాదులు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కక్షిదారులు న్యాయం కోరుతూనే న్యాయవాదుల వద్దకు వస్తారని, చేపట్టే ప్రతీ

కేసులోనూ నిబద్దత, న్యాయం పక్షానే నిలిస్తే న్యాయాధిపతులు సైతం మీ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయని, న్యాయవాదులకు సూచించారు. అదే విధంగా

న్యాయాధిపతుల నుంచి న్యాయవాదులు తెలుసుకోవాల్సిన విషయాలూ చాలా ఉంటాయని తెలిపారు. 

ఒక గాయకుడూ పాట పాడే తప్పుడు, శ్రుతి, రాగం, తాళం, తప్పకుండా చూసుకోవాలని,

లేనిపక్షంలో పాట అపశృతిలో నడుస్తుందని, అదే విధంగా న్యాయవాదులు కూడా న్యాయం, వాస్తవం, సత్యం, సాక్ష్యం తదితర అంశాలను సరిచూసుకోనట్టయితే కేసు సత్యానికి దూరంగా

వెళ్ళిపోతుందని విషయాన్నీ నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. 

వాదులు, ప్రతివాదులు, తమ తరపున న్యాయవాదులను నియమించుకుని, చేతులు దులుపుకుంటారని, అయితే న్యాయం

కోసం ప్రక్రియ జరుగుతున్నప్పుడు వారు అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుందన్నారు. తద్వారా తమకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో తెలుస్తుందని తెలియచేసారు. 
తీర్పులు

ఇచ్చే ముందు కూడా మానవత్వం తో అమాయకులకు అన్యాయం జరుగకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలనా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే క్రమంలో తీర్పు లు సిద్ధం చేసిన

తర్వాత కూడా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలనా చేసి మార్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. 

అంతకు ముందు డీవీ సుబ్బారావు జీవిత అంశాలకు చెందిన కీలక

ఘట్టాలను దృశ్య రూపంద్వారా సభికులకు తెలియచేసారు. 
ఈ కార్యక్రమం లో నేషనల్ లా యూనివర్సిటీ (బెంగళూరు) ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు, రాష్ట్ర హై కోర్టు

న్యాయాధిపతి à°¡à°¿. వి సోమయాజులు, విశాఖనగరానికి చెందిన న్యాయ కోవిదులు, వివిధ విభాగాల అధికారులు, విద్యావేత్తలు, పలువురు న్యాయవాదులు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

/>  

#dns  #dns live  #dns media #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #justice  #high court  #Radhakrishnan #DV Subba Rao

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam