DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తోటి వారిని ఆదుకోవడం మా భాద్యత : సి ఎస్ ఎన్ రాజు 

కళాభారతి లో 500 మందికి లూథియానా రగ్గులు పంపిణీ 

విశాఖపట్నం, డిశంబర్ 23, 2018 (DNS Online ):  à°šà°²à°¿ తీవ్రత అధికంగా ఉండడంతో విశాఖ ప్రాంతంలోని పేదలకు కొంతవరకు సహకారాన్ని

అందించేందుకు లూథియానా నుంచి తీసుకువచ్చిన రగ్గులు పంపిణీ చేసినట్టు ప్రముఖ దార్శనికులు సిఎస్ఎన్ రాజు తెలిపారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం మద్దిలపాలెం లోని

కళాభారతి వేదిక వద్ద సుమారు 500 మందికి ఈ లూథియానా రగ్గులు అందించామన్నారు. ప్రతి ఏడాది కొన్ని సంస్థల ద్వారా ఈ పంపిణీ జరిగిందని, గతం లో కంటే ఈ ఏడాది అధికంగా చలి

తీవ్రత ఉండడంతో కళాభారతి వద్దే నేరుగా పేదలకు వీటిని అందించాలని నిర్ణయించామన్నారు. వీటిని పంజాబ్ లోని లూథియానా నగరం నుంచి ఆర్డర్ పై తయారు చేయించామన్నారు.

వీటిని ఆదివారం ఉదయం ముందుగా లబ్దిదారులకు టోకెన్లు అందించి, వారికీ కళాభారతి లోకి ఆహ్వానించి, వేదిక వద్ద రగ్గులను పంపిణీ చేసినట్టు

తెలిపారు.

 

విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ  (కళాభారతి కళావేదిక ) కార్యదర్శి జీఆర్ కె  à°ªà±à°°à°¸à°¾à°¦à±   మాట్లాడుతూ 

సిఎస్ఎన్ రాజు  -  à°µà°¾à°°à°¿ సతీమణి కమల

రాజు దంపతులతో పాటు వారి కుమారుడు రామ రాజు లు చూపించిన దాతృత్వం అద్భుతమన్నారు. ప్రస్తుత చలికి విపరీతంగా బాధ పడుతున్న పేదవారికి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన చలి

రగ్గులను 455 మందికి ఉచితంగా రాజు గారి సొంత నిధులతో పంపిణీ చేశారని, మరో వంద రగ్గులు వరకూ విశాఖ బీచ్ రోడ్ లోని సంచార కుటుంబాలకు స్వయంగా అందించనున్నట్టు

తెలిపారు. ప్రతి మనిషి జీవితం లో ఎంతో కొంత సంపాదిస్తారని, అయితే దానిలో కొంత పేదలకు వెచ్చించాలి అనే దాతృత్వం చాలా తక్కువ మందికే ఉంటుందన్నారు. 
భగవంతుడు ఈ

మానవ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కొంత తిరిగి ఇచ్చి రుణం తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి వ్యక్తి మీద ఉందన్నారు.  à°…లాంటి మానవతా దృక్పథంతోటే సి ఎస్ఎన్ రాజు

వారి స్వంత నిధులతో ఈ పంపిణీ చేయడం జరిగింది వారు కుటుంబంలో కుటుంబ సభ్యులు చాలా ధన్యులు అన్నారు. సీఎస్ఎన్ రాజు కుటుంబ సభ్యులు చేపట్టిన కార్యక్రమం చూసి, మరో

రెండు వందల మంది సభ్యులు రావడంతో త్వరలోనే వీరికి కూడా అందించే ప్రయత్నం చేయనున్నట్టు ప్రకటించినట్టు తెలిపారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kalabharati  #csn raju

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam