DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేసీఆర్ వెంట టి పోలీసులు వచ్చారంటే. . ఆంధ్ర కి అవమానం కాదా ?

ఆంధ్ర పోలీసులు కేసీఆర్ రక్షణ ఇవ్వలేరా ?

విశాఖపట్నం, డిశంబర్ 24, 2018 (DNS Online ): ఇటీవల విశాఖనగరం పర్యటనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన రక్షణకు

తన వెంట తెలంగాణ పోలీసులను తెచ్చుకున్నారు అంటే ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేనట్టేనని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సాక్షాత్తు దేశ రాష్ట్రపతి, ప్రధాని

లాంటి ఉన్నత స్థాయి నేతలు వచ్చినప్పుడే విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా కల్పించిన సందర్భాలున్నాయి. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటనకు వస్తే

భద్రతా కల్పించలేక పోయారు అంటే వాళ్ళకి నమ్మకం లేకనా లేదా నిజంగానే వీళ్లు రక్షణ కల్పించలేమని చెప్పేశారా? అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రక్క

రాష్ట్రం నుంచి విశాఖ నగరానికి వచ్చిన పోలీసులు, విశాఖ నగరం లోని ఒక ప్రాంతాన్ని భద్రతా పేరుతొ దాదాపు ఆరు గంటల సమయం దాదాపు కబ్జా చేసినంత పని చేయగలిగారంటే

వాళ్ళు ఆంధ్ర పోలీసులకు విలువ ఇచ్చినట్టా కాదా అనే అనుమానాలు వస్తున్నాయి. పైగా స్థానిక మీడియా ను సైతం వాళ్ళు వంద మీటర్ల దూరం లోనే నిలబెట్టారు. ఈ కబ్జా విషయం

ముందుగానే స్థానిక పోలీసు అధికారులకు తెలుసో లేదో మరి. లేదా తెలిసి, మాకెందుకు ఈ హైరానా అని వదిలేశారా అనే విషయం పై కూడా స్పష్టత లేనట్టు ఉంది. ఇలా ఇతర ప్రాంతాల

నుంచీ ఆంధ్రా కు వచ్చే పర్యాటకులు ఎవడి రక్షణ బలగాలు వాళ్ళే తెచ్చేసుకుంటే ఇక స్థానిక పోలీసులకు బాధ్యత ఉండదేమో మరి. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #KCR  #telangana  #sarada

peetham  #AP Police  #T police

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam