DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి కై కష్టపడుతున్నాం, శ్రమ దోపిడీ చెయ్యద్దు .  చంద్రబాబు  

ప్రభుత్వ సాధించిన  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రగతి పై శ్వేత పత్రం విడుదల 

అమరావతి, డిశంబర్ 28, 2018 (DNS Online): రాష్ట్ర  à°…భివృద్ధి పై నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం, శ్రమ దోపిడీ

చెయ్యవద్దని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వస్తూ ప్రభుత్వ

సాధించిన ప్రతి విజయం, ప్రజలకే అంకితం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం అమరావతి లో జరిగిన కార్యక్రమం లో ప్రభుత్వ సాధించిన ప్రతి

విజయం, ప్రజలకే అంకితం పేరుతో సమాచార శాఖ విడుదల చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమారు 615 పురస్కారాలపై సమాచార శాఖ తీసుకొచ్చిన పుస్తకం ప్రభుత్వం ఈ

నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలపై కరదీపిక రూపొందించడం జరిగింది. 

అనంతరం ఇంధనం, అమరావతి సహా మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్

గ్రిడ్, రహదారులు-భవనాలు, ఆర్థిక నగరాలపై శ్వేతపత్రం విడుదల చేసారు. 

ప్రజలకు అవసరం  à°®à±Œà°²à°¿à°• à°°à°‚à°—à°‚ : 

ఇంధనం, అమరావతి సహా మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, తీర

ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రహదారులు-భవనాలు, ఆర్థిక నగరాలపై ఈ శ్వేతపత్రం తెలియచేస్తోంది వివరించారు. 1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని,

తొలిసారిగా ప్రైవేట్ రంగంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చాయన్నారు. ఈ సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నామని, 2004 నుంచి 2014 వరకు దశాబ్దం పాటు

విద్యుత్ రంగంలో చీకట్లు రోజులు గడిపానమి తెలిపారు. ఆ తరువాత అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల విద్యుత్ రంగం మరింత కష్టాల్లోకి నెట్టబడిందని, రాష్ట్ర

విభజన తరువాత మళ్లీ ఇంధన రంగంపై దృష్టి పెట్ట à°¡à°‚ జరిగిందని, ఆనతి కాలంలోనే మిగులు విద్యుత్ సాధించగలిగామన్నారు. 

అనేక నూతన విధానాలు, కార్యక్రమాలు

చేపట్టాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండోతరం విద్యుత్ సంస్కరణలు :పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టామని, సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్

ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిపైనే కాకుండా సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించగలిగామని, స్వల్పకాలంలోనే మిగులు విద్యుత్

సాధించామన్నారు.   2014 జూన్ నాటికి రాష్ట్రంలో రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, అనంతర కాలంలో సిబ్బంది కృషి వల్ల  2014లో సౌర విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6.50

ఉంటే, 2018 నాటికి రూ.2.70à°•à°¿ చేరిందని, 2013-14లో మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 1.85% మాత్రమే సమకూరగా, ఇప్పుడు అది 22%à°•à°¿ చేరుకుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31,725

సౌర విద్యుత్ పంపుసెట్లను అమర్చారని, అనంతపురం, కడప, కర్నూలులో మొత్తం కలిపి 4000 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్కులను ఏర్పాటుచేస్తున్నాం. అందులో ఇప్పటికే 1850

మెగావాట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కర్నూలు సోలార్ పార్కు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు. ఇక్కడ 1000 మెగావాట్లు అందుబాటులోకి వచ్చాయని,

పునరుత్పాదక విద్యుత్ రంగంపై ఇప్పటివరకు పెట్టుబడులు రూ.36,604. 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు చెందిన యువత ప్రయోజనాలు

పొందారన్నారు. 

సుజ్లాజ్, గమెసా, రీజెన్ వంటి విద్యుత్ తయరీ ఉపకరణాల సంస్థలు ఏపీలో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటుచేశాయి.
రాష్ట్రంలో పెద్దఎత్తున ఇంధన

సంరక్షణ, పొదుపును ప్రోత్సహిస్తున్నాం. రాష్ర్టవ్యాప్తంగా అన్ని ఇళ్లకు 2.2 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీచేశాం. 110 మునిసిపల్ పట్టణాలలో 6.23 లక్షల ఎల్ఈడీ వీధి బల్బులను

అమర్చాం. గ్రామాలలో ఇప్పటికే 20 లక్షల వీధిలైట్లను అమర్చాం. జనవరి నాటికి అన్ని వీధి లైట్లను ఎల్ఈడీలతో మార్చేస్తాం. ఎటువంటి పెట్టుబడి లేకుండా 30 శాతం విద్యుత్

ఆదాను ఈవిధంగా సాధించగలిగామని, గృహ అవసరాలకు 2.84 లక్షల ఇంధన సమర్ధత ఫ్యాన్లు, 1.42 లక్షల ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లను పంపిణీచేశామని వివరించారు. ఇంధన సమర్ధత లేని 44,814 వ్యవసాయ

పంపుసెట్ల స్థానంలో ఇంధన సమర్ధత కలిగిన ISI పంపుసెట్లను అమర్చామన్నారు. 2013-14లో 14%గా ఉన్న విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2018 నవంబరు నాటికి 9.7%కి తగ్గించాం. ఇది దేశంలోనే అతి

తక్కువ అని తెలిపారు. 
2018-19 సంవత్సరానికి విద్యుత్ రంగానికి రాయితీల కింద రూ.6,030 కోట్లు కేటాయించామని, 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు 137

పురస్కారాలు వచ్చాయన్నారు. 

2020 వరకు విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం APయేన్నీ, రూ.50 వేల కోట్లు పెట్టుబడులు పెడితే 20 శాతం సౌర

విద్యుత్ వస్తుందన్నారు. ఎల్ఈడీ బల్బులను తీసుకొచ్చినట్టే సౌర విద్యుత్ ఆధారిత ఎలక్ర్టిక్ పవర్ ఫిల్లింగ్ స్టేషన్లు తీసుకొస్తామన్నారు. ఎక్కడికక్కడే

విద్యుత్ ఉత్పత్తి చేసే స్టార్ట్ పవర్ గ్రిడ్ల వ్యవస్థను తీసుకొచ్చామని, దీనితో ఎక్కడికక్కడే సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా పంపిణీ, సరఫరా

చేయిస్తామని తెలిపారు. 

పౌర విమానయాన శాఖలో : మనం ఇంతకుముందు వరకు చాలా పూర్

పౌర విమానయాన శాఖ ప్రగతిలో ఇంతకుముందు వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చాలా

వెనుకబడి ఉందని, 1.1 మిలియన్ ప్రయాణికులు రాష్ట్రం నుంచి విమానయానం చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 5.5 మిలియన్లకు చేరిందన్నారు. 2015లో సివిల్ ఏవియేషన్ పాలసీ తీసుకొచ్చామని,

కేంద్ర పౌర విమానయాన శాఖకు విమానాశ్రయాల అభివృద్ధికి విలువైన భూములు అందించగలిగామన్నారు. 

ఇంటింటికీ ఫైబర్ నెట్ :

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ

ఫైబర్ నెట్ సేవలు అందించేందుకు టవర్ కార్పొరేషన్ పెట్టాం. ఇంటింటికీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించామన్నారు. ఆర్థిక నగరాలను అభివృద్ధి

చేస్తున్నామని, జక్కంపూడి సిటీని à°’à°• నమూనాగా  à°¤à±€à°¸à±à°•à±à°¨à°¿ మొదలు పెట్టామన్నారు.  à°…మరావతి నగరాభివృద్ధి అనేకమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందని,

ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాలలో అమరావతి ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. .

గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి: 

గ్రీన్ అండ్ బ్లూ సిటీగా

అమరావతిని రూపుదిద్దుతామని చంద్రబాబు తెలిపారు, 3.5 మిలియన్  à°œà°¨à°¾à°­à°¾, 2 మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి అని, తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో మరో 50

వేల కోట్లు అమరావతి నగర నిర్మాణానికి అవసరం అవుతాయన్నారు.  à°Žà°¸à±à°†à°°à±à°Žà°‚, అమృత్, విట్ వంటి ప్రతిష్టాత్మక వర్శిటీలు వచ్చాయి. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు

వస్తున్నాయి. అమరావతి ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌à°—à°¾ తీర్చిదిద్దుతున్నాం. వీటి ధీటుగా 8 స్టార్ హోటళ్లు వస్తున్నాయని, 80 వేల హోటల్ గదులు రాజధానికోసం అవసరం

అవుతాయన్నారు. 

ఓడల ద్వారా సరుకు రవాణాలో 117 నుంచి 173 మిలియన్ యూనిట్లకు వెళ్లగా, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని,

జగ్గయ్యపేట, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ జల రవాణా కేంద్రాలను అభివృద్ధి చేసామని, పైప్ లైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు వీలయ్యే ప్రాజెక్టులను

చేపట్టాం. దీని ద్వారా 30 శాతం అదనంగా గ్యాస్ సరఫరాకు వీలు కలుగుతుందన్నారు. 

రోడ్లు రహదారుల్లో :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం  11 జాతీయ రహదారులను 715

కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని, 130 వంతెనలు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర రహదారులను విస్తరిస్తున్నట్టు

ముఖ్యమంత్రి తెలిపారు.  2400 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులను అభివృద్ధి చేశామని, à°“à°¡à°² ద్వారా సరుకు రవాణా చేసేందుకు అవసరమైన అభివృద్ధి చేస్తున్నామని

తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #amaravati  #andhra pradesh  #government  #chandra babu naidu  #governance

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam