DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంస్కార విద్యను అందించే సంస్థల్లో అగ్రగామి శిశుమందిర్

విశాఖపట్నం, డిశంబర్ 28, 2018 (DNS Online): సంస్కార, సంప్రదాయాలను విద్యార్థి దశ నుంచే అందించే విద్యా సంస్థల్లో అగ్రగామి శ్రీ కృష్ణ విద్యా మందిర్ ( శిశు మందిర్) అని డాక్టర్ డి.ఈ

బాబు అన్నారు. శనివారం విశాఖ నగరం లోని ద్వారకానగర్ లోని విద్యా సంస్థ ప్రాంగణంలో జరిగిన 34 వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా

ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఒక మంచి మార్గాన్ని విద్య తో పాటు సంస్కారాలను కూడా అందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారన్నారు. దీనికి

నిదర్శనమే దేశంలోని ఉన్నత హోదాల్లో ఉన్నవారిలో అధికశాతం మంది విద్యార్థి దశలోనే సంస్కార, సంప్రదాయాలను అలవాటు చేసుకున్నవారేనన్నారు. భారత భారత రాష్ట్రపతి

రామనాద్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సహా ఎందరో మహనీయులు ఈ విధమైన విద్యా విధానాన్ని చిన్నతనం లోనే

నేర్చుకున్నవారన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రముఖ కవి, తెలుగు అధ్యాపకులు మీగడ రామలింగ స్వామి మాట్లాడుతూ చిన్నారులను సక్రమ మార్గం లో తీర్చి

దిద్దవలసింది విద్యాలయాలేనని, దీనిలో తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ డాక్టర్ ఏ. నారాయణ స్వామి

మాట్లాడుతూ, తమ విద్యా సంస్థ చేపట్టిన కార్యాచరణ, విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానం, క్రీడాంశాల్లో శిక్షణ, తదితర అంశాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లా

నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ à°—à°² భారతీయ విద్యా కేంద్ర విద్యా సంస్థలు సాధించిన విజయాలను, విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను తెలియచేసారు. 
/> అనంతరం ఎల్ కేజీ నుండి మూడవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు గర్భ డాన్స్, యూనిటీ స్ట్రెంత్, పర్యావరణ సంరక్షణ అంశాల ప్రదర్శనలు, మూడవ తరగతి నుండి 5వ తరగతి

వరకు చత్తీస్ ఘడ్ డాన్స్, బుర్రకథ, దుర్యోధన ఏకపాత్రాభినయం , మొదలగు అంశాలలో ప్రదర్శనలు, ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు కన్నడ డాన్సులు,   గ్రూప్ గ్రూప్ సాంగ్స్,

డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ " రామ బాణమా? రామ నామ మా?  à°ªà±Œà°°à°¾à°£à°¿à°• నాటకం ప్రదర్శించారు. 
ఉదయం జరిగిన కార్యక్రమం లో  à°µà°¾à°°à±à°·à°¿à°•à±‹à°¤à±à°¸à°µà°¾à°¨à±à°¨à°¿

పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన ఆటలు, పాటలు, వక్తృత్వం,  à°µà±à°¯à°¾à°¸à°°à°šà°¨ తదితర పోటీలలో విజేతలుగా నిలిచినా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.  

à°ˆ

వేడుకల్లో శ్రీ కృష్ణ విద్యా మందిర్  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ రామచంద్ర రాజు, ప్రిన్సిపాల్ వివి నాగేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #sisu mandir  #bvk  #anniversary  #dwaraka nagar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam