DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 1020  కోట్లతో యుద్ధ పరికర తయారీ సంస్థతో ఏపీ ఒప్పందం 

 à°…మరావతి, డిశంబర్ 31 , 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరుతోంది. 
భారత రక్షణ రంగ అవసరాలకు వినియోగ పడే మందుగుండు, పరికరాల

సామాగ్రిని తయారు చేసే సంస్థ రూ. 1020 కోట్ల వ్యయంతో పెట్టుబడులు పెట్టేందుకు స్టంప్ ష్చుల్ కేసింగ్స్ ప్రైవేట్ సంస్థ (ఎస్ఎస్ సి) సంస్థ - ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక

అభివృద్ధి మండలి (ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు) మధ్య ఒప్పందం జరిగింది. సోమవారం విజయవాడ లో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశం లో ఈ ఒప్పందం జరిగినట్టు ఏపీ

ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంస్థ సిఈ à°“ జె. కృష్ణ కిషోర్ తెలిపారు. ఒప్పందం అనంతరం DNS  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à°¿à°•à°¿ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ à°ˆ ఒప్పందం ఎస్ ఎస్ సి సీఈఓ

వివేక్ కృష్ణన్ తో కలిసి à°† ఒప్పందం పత్రాలపై సంతకం చేయడం జరిగిందన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో  à°•à°²à°¿à°¸à°¿ చేయనున్న అన్ని తరహాల వర్తక, వ్యాపార, వాణిజ్య

లావాదేవీలను అనుమతులను అందింస్తున్న సంస్థ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అని అన్నారు. రాష్ట్రం లో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ప్రాంతాల

పారిశ్రామికవేత్తలు,, సంస్థలకు అనువుగా ఉండే విధంగా à°ˆ సంస్థ సింగల్ విండో విధానం అమలులోకి తీసుకువచ్చిందన్నారు. 

ఎస్ ఎస్ సి  - సీబీసీ సంయుక్త నిర్వహణలో

యుద్ధ సామాగ్రిని తయారీ చేసి, విక్రయిస్తుంది తెలిపారు. భారతీయ యుద్ధ సైన్య అవసరాలకోసం ఈ సంస్థ సామాగ్రిని తయారు చేస్తుందన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద

యుద్ధ పరికర సంస్థగా ఇది రూపు దిద్దుకోనుందని తెలిపారు. భారత రక్షణ విభాగానికి భవిషత్ అవసరాల కోసం అవసరమయ్యే మందుగుండు, ఆయిల్, స్టీల్ తదితర సామాగ్రిని తయారు

చేసే సంస్థను రెండు దశల్లో 520 కోట్ల రూపాయలతోను, మూడవ దశ లో రూ 500 కోట్ల తో ఏర్పాటు చేయనున్నారన్నారు. ఈ పరిశ్రమ స్థాపన ద్వారా అత్యున్నత నైపుణ్యం కల్గిన 500 మంది

నిపుణలకు నేరుగా ఉపాధి లభించనుందని తెలియచేసారు. దీనికి అనుబంధ పరిశ్రమల్లో సుమారు మరో వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు.  

1960 లో స్థాపించిన స్టం

ప్  à°¶à±à°šà±à°¯à±à°²à±‡, సొమ్మప్ప సంస్థ (ఎస్ ఎస్ ఎస్) కు అనుబంధంగా పనిచేస్తున్న à°ˆ ఎస్ ఎస్ సి సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతి మరింతగా ఇనుమడింపబడుతుందని వివరించారు. à°—à°¤ ఐదు

దశాబ్దాలుగా భారత రక్షణ రంగానికి అత్యున్నత ప్రమాణం కల్గిన సామాగ్రిని భారత ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కి అందిస్తున్న ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 11 అనుబంధ సంస్థలు

ఉన్నాయని తెలియచేసారు. 20 వేల టన్నుల స్టీల్ ను పరికరాల సామాగ్రిగా మార్చగల కెపాసిటీ కల్గిన సంస్థ ఇది అన్నారు.  à°®à±‡à°•à± ఇన్ ఇండియా కార్యక్రమం లో భాగంగా à°ˆ సంస్థ 2016

నుంచి విమాన, రక్షణ రంగంలోకి ప్రవేశించినట్టు తెలిపారు. అదే విధంగా సిబిసి ( కంపానియా బ్రజిలిరా డే కార్టుచొస్ ) సంస్థ చిన్న సైజు, మాధ్యమిక పరిమాణాల్లో యుద్ధ

సామాగ్రి పరికరాలను తయారు చేసే సంస్థ అని,ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో రెండవ స్థానం లో ఉందన్నారు. ఇది బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, అమెరికా, జర్మనీ తదితర

దేశాలకు సేవలు అందిస్తోందని, ఎస్ ఎస్ సి తో సంయుక్తంగా కలిసి ప్రస్తుతం భారత్ దేశంలో సేవలు అందించనుంది వివరించారు. 

ఎస్ ఎస్ ఎస్ స్ప్రింగ్స్  à°¸à°‚స్థ

మేనేజింగ్ డైరక్టర్ సతీష్ మచానీ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం తమకు గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు

దూరదృష్టి, నైపుణ్యత, పరిపాలన దక్షతకు తమను ఆకర్షించిందని, వారి ఆకాంక్ష మేరకు ఉపాధి కల్పన జరుగుతుందని వివరించారు. 

భారత దేశ రక్షణ విభాగ అవసరాలను

అనుగుణంగా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని అనుసరించి ఈ సంస్థను ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించడం జరుగుతోందన్నారు. విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై

- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, కర్నూల్ - బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణాల నేపథ్యంలో ఈ సంస్థ ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్ కు మరింత ఉన్నతి లభించనుంది. ఇదే

క్రమం లో ఇస్రో, డి ఆర్ డి ఓ, బి ఈ ఎల్, బి డి ఎల్, ఎం ఎస్ టి ఎల్, హెచ్ సి ఎల్, వి ఈ ఎం టెక్నాలజీ లాంటి సంస్థలతో ఆంధ్రప్రదేశ్ పటిష్టంగా మారిందన్నారు. మరిన్ని సంస్థలు

పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #amaravati  #SSC  #CBC  #Chandra babu  #Naidu  #APEDB  #Andhra PRadesh Economic Development Board

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam