DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొగ్గుస్కామ్ లో దోషులకు విశాఖ బీచ్ లో విగ్రహాలు పెడతారా? సిగ్గు సిగ్గు

దాసరి, హరికృష్ణ, నాగేశ్వర రావు లు  à°¸à±à°µà°¾à°¤à°‚త్ర పోరాట యోధులా ?

విచ్చలవిడిగా విశాఖ లో అధికార దుర్వినియోగం, సీఆర్ జెడ్ ఉల్లంఘనే  

విశాఖపట్నం, జనవరి 2 , 2019 (DNS Online ):

భారత దేశాన్ని కుదిపేసిన స్కాముల్లో బొగ్గు స్కామ్ ఒకటని, దానిలో ప్రధాన దోషిగా ఉన్న దాసరి నారాయణ రావు విగ్రహం తో పాటు మరో ఇద్దరికీ విశాఖ ఆర్ కె బీచ్ లో

విగ్రహాలు పెట్టడాన్ని
విశాఖ పీపుల్స్ ఫ్రంట్ మండి పడింది.బుధవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వచించిన విలేకరుల సమావేశం లో ఫ్రంట్ చైర్మన్ డాక్టర్

కె ఎస్ చలం మాట్లాడుతూ ఈ దేశం లో ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టాలి అంటే స్థానిక పాలక సంస్థల అనుమతి అవసరమని, దీన్ని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ తుంగలోకి

తొక్కిందన్నారు. 
విశాఖ రామకృష్ణ బీచ్ రోడ్ లో గత నెల్లో మూడు విగ్రహాలు ( దాసరి నారాయణరావు, ఎన్. హరికృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు) రాత్రికి రాత్రే పెట్టేసి,

వాటిని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తో ప్రారంభింపచేసేశారన్నారు. à°ˆ కార్యక్రామానికి  à°µà°¿à°¶à°¿à°·à±à°Ÿ అతిధులుగా మాజీ రాజ్య సభ సభ్యులు యార్లగడ్డ

లక్ష్మి ప్రసాద్, తదితరులు హాజరైనట్టు పత్రికల్లో గమనించామన్నారు. దీనిపై తాము స్థానిక జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు

మంత్రి గంటా శ్రీనివాసరావు కు కూడా లీగల్ నోటీసులు పంపామన్నారు. అయితే నెల రోజులు గడిచినా వీళ్ళు స్పందించక పోవడం తో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు

తెలిపారు. 
విశాఖ సాగర తీరం లో విగ్రహాలు పెట్టడానికి వీళ్ళమైనా భారత దేశ స్వాతంత్య్ర పోరాట సమర యోధులా అని ప్రశ్నించారు. పైగా వీరెవ్వరికీ విశాఖ జిల్లాతో గాని,

కనీసం ఉత్తరాంధ్రా జిల్లాలతో గానీ ఎటువంటి సంబంధం లేదని, వీళ్ళ విగ్రహాలు పెట్టుకోడానికి కేవలం  à°•à±à°², రాజకీయ సామాజిక కారణాలే తప్ప, à°ˆ ప్రాంతానికి దమ్మిడీ

ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.  à°ªà±ˆà°—à°¾ అడ్డగోలుగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారని, దీనిపై సమాధానం చెప్పవలసిన జిల్లా కలెక్టర్ గానీ, జీవీఎంసీ కమిషనర్

గానీ నోరెత్తక పోవడం పట్ల అధికార పార్టీ ప్రభావం బహిర్గతమవుతోందన్నారు. 

బ్యానర్ తొలగించే జీవీఎంసీ, వీటిని ఎందుకు తొలగించ లేదు ?

సాధారణ ప్రజలు తమ

ఇళ్లల్లో ఫంక్షన్లు జరిగినప్పుడు ఒక బ్యానర్ ను రోడ్డు పై కడితే వెంటనే తొలగించమని ఆదేశాలిచ్చిన జీవీఎంసీ కమిషనర్, విశాఖ బీచ్ రోడ్ లో ముగ్గురి విగ్రహాలను

అనధికారికంగా శాశ్వత నిర్మాణం చేపడితే కనపడలేదా అని ప్రశ్నించారు. 

అల్లూరి కి లేని విలువ వీళ్ళకెలా ?

భారత దేశ స్వాతంత్య్ర పోరాట యోధుడు, ఉత్తరాంధ్ర

మన్యం వీరునిగా ఖ్యాతిగాంచిన అల్లూరి సీతారామ రాజు విగ్రహం పెట్టడానికి నానా నిబంధనలు చెప్పిన ప్రభుత్వం, సినిమావాళ్ళ విగ్రహాలకు మాత్రం ఎలా పడితే ఆలా

పెట్టేసుకునేందుకు కార్యాచరణ చేసేశారన్నారు. 

నాకు సంబంధం లేదు : యార్లగడ్డ .
ఈ విగ్రహాల ఏర్పాటు లో వివాదాలు తనకు తెలియదని, ఈ వివాదం తో తనకు సంబంధం లేదని

యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ వివరణ ఇచ్చినట్టు చలం తెలిపారు. 

అధికారులు తప్పించుకోలేరు :

ఈ విగ్రహాల ఏర్పాటు తమకు తెలియదు అని తప్పించుకునే అవకాశం

విశాఖ జిల్లా అధికారులకు లేదన్నారు. మూడు రోజుల క్రితం విశాఖ సాగర తీరం రామ కృష్ణా బీచ్ లో జరిగిన విశాఖ ఉత్సవ్ వేడుకల్లో ఈ విగ్రహాలకు విద్యుత్ దీపాలు పెట్టి,

భారీ నేమ్ ప్లేట్లు పెట్టి మరీ ఆకర్షణీయంగా తయారు చేశారు అధికారులు. అప్పడికే ఈ విగ్రహాల ఏర్పాటుపై తాము ఈ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, గంటలకు లీగల్

నోటీసులు పంపామన్నారు. దీనిపై వివరణ ఇవ్వవలసిన అధికారులు వీటికి డెకొరేషన్ చేసి మరో తప్పు చేశారన్నారు. వీరందరి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం

ను ఆశ్రయించనున్నామన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖ పీపుల్స్ ఫ్రంట్ ప్రతినిధులు, సీపీఎం నగర కార్యదర్శి బి. గంగారావు, న్యాయ సలహాదారు దివాకర్, తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #RK beach  #beach road  #dasari narayana rao  #harikrishna  #nageswara rao

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam